




Best Web Hosting Provider In India 2024
యూపీఎస్సీ ఎన్డీఏ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
యూపీఎస్సీ ఎన్డీఏ ఎన్ఏ 1 ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి. ఫలితాల్ని ఎలా చెక్ చేసుకోవాలో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ 1 ఫలితాలను విడుదల చేయనుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (1) 2025కు హాజరైన అభ్యర్థులు upsc.gov.in యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో తమ స్కోర్లను చూసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా, ఈ ఫలితాలను upsconline.gov.in కూడా చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
యూపీఎస్సీ ఎన్డీఏ ఫలితాలు 2025- డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
- upsc.gov.in యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ 1 రిజల్ట్స్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ రిజల్ట్స్ డిస్ప్లే అవుతాయి.
5. ఫలితాలను చెక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
6. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.
యూపీఎస్సీ ఎన్డీఏ ఎన్ఏ 1 పరీక్షలు 2025 ఏప్రిల్ 13, 2025న జరిగాయి. ఈ పరీక్షలో మ్యాథ్స్, జనరల్ ఎబిలిటీ అనే రెండు సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి 2 గంటల 30 నిమిషాలు. అన్ని సబ్జెక్టుల పేపర్లలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. గణితం, జనరల్ ఎబిలిటీ పరీక్ష ప్రశ్నపత్రాలను హిందీతో పాటు ఇంగ్లిష్‌లోనూ రూపొందించారు.
యూపీఎస్సీ ఎన్డీఏ ఎన్ఏ 1 పరీక్షల రిజిస్ట్రేషన్ 2025 డిసెంబర్ 11 నుంచి 2025 జనవరి 1 వరకు జరిగాయి.
ఈ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద్వారా యూపీఎస్సీ మొత్తం 406 ఎన్డీఏ ఎన్ఏ ఖాళీలను భర్తీ చేయనుంది.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ని చూడాలని అధికారులు సూచించారు.
ఇక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్ ఇటీవలే వెలువడ్డాయి. మొత్తం 1056 పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియను చేపట్టారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link