



Best Web Hosting Provider In India 2024
నీట్ యూజీ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి
Neet nta city intimation slip: నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ విడుదలైంది. పరీక్షకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ సందర్శించి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (నీట్-యూజీ) 2025 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ను విడుదల చేసింది. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ సిటీ స్లిప్ చెక్ చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చు. నీట్ యూజీ 2025 పరీక్షను మే 4, 2025న ఎన్టీఏ నిర్వహించనుంది.
సిటీ స్లిప్ ఎలా డౌన్లోడ్ చేయాలి?
ముందుగా neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ వెళ్లాలి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ సిటీ ఇన్ఫర్మేషన్ ఫర్ నీట్ (యూజీ) 2025 లింక్ మీద క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, ఇతర అవసరమైన సమాచారాన్ని నింపి సబ్మిట్ చేయాలి.
నీట్ యూజీ 2025 ఇన్ఫర్మేషన్ స్లిప్ ఓపెన్ అవుతుంది.
భవిష్యత్తు కోసం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డు తేదీ!
నీట్ యూజీ 2025 ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ తమ పరీక్షా కేంద్రం నగరానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇస్తుందని, అడ్మిట్ కార్డులు విడిగా జారీ అవుతాయని అభ్యర్థులు గమనించాలి. అధికారిక బులెటిన్ ప్రకారం, నీట్ యూజీ అడ్మిట్ కార్డులను మే 1, 2025న అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు.
నీట్ యూజీ 2025 పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలకు సంబంధించి మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 45-45 ప్రశ్నలు, బయాలజీ నుంచి 90 ప్రశ్నలు ఉంటాయి. గరిష్టంగా 720 మార్కులకు నిర్వహించే పేపర్‌ను సాల్వ్ చేయడానికి అభ్యర్థులకు 3 గంటల సమయం ఇస్తారు.
Best Web Hosting Provider In India 2024
Source link