Best Web Hosting Provider In India 2024
Nindu Noorella Saavasam 16th December Episode: నిండు నూరేళ్ల సావసం నేటి ఎపిసోడ్‌లో అంజలి ఎగ్జామ్ రిజల్ట్స్ బయటకు వచ్చాయని, తనకు స్కూల్ అడ్మిషన్ దొరికిందని సంతోషంగా అరుంధతి చెబుతుంది భాగమతి. అంజలిని చూసి భాగీ గర్వపడటం కనిపిస్తుంది. ఆ పిల్ల పిచ్చుకను చూసి ఆమె తల్లిదండ్రులకంటే ఎక్కువగా నీకే సంతోషంగా ఉన్నట్లుంది కదా బాలిక అని చిత్రగుప్తుడు అంటాడు.
ట్రెండింగ్ వార్తలు
ఎందుకు అనిపిస్తుందో
దానికి అవును, గుప్త గారు. నాకు ఎందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా కూతురు పాస్ అయినా కూడా ఇంతలా సంతోషించను కావచ్చు. అంజలికి బాగో లేనప్పుడు కూడా నా గొంతు బిగుసుకుపోయినట్లు అనిపించింది. మా నాన్నకు ఆరోగ్యం బాలేనప్పుడు అలా జరిగింది. సేమ్ అలాగే అంజలి విషయంలో అనిపించింది. అలా ఎందుకు అనిపిస్తుందో తెలియదు అని మిస్సమ్మ అంటుంది.
వాళ్లు నీ రక్త సంబంధీకులే. ఎటు చూసిన నీకు కూతుళ్లు, కుమారులే అవుతారు అని చిత్రగుప్తుడు మనసులో అనుకుంటాడు. భాగీని ఏదీ అడ్డుకోలేదని, అంజలి చాలా తెలివైనదని, మూడు రోజుల్లో సిలబస్ మొత్తం పూర్తి చేసిందని, ఈరోజు ఆమె తల్లి ఉంటే తనను చూసి చాలా గర్వపడేదని ఆమె అరుంధతితో అంటుంది భాగమతి. ఆ విషయం ఆమె మొహంలో కనిపిస్తోందిగా అని చిత్రగుప్తుడు అంటాడు.
సంతకం తీసుకున్నాకా
దాంతో షాక్ అయినా భాగమతి అంజలి తల్లి సంతోషంలో ఆనందం ఇక్కడ ఎలా కనిపిస్తుంది అని భాగమతి అనుమానంగా అడుగుతుంది. దానికి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది అరుంధతి. దానికి అదే కరెక్ట్ అని చిత్రగుప్తుడు అంటాడు. అనంతరం తన తండ్రి చికిత్స కోసం అమర్ సంతకం తీసుకోవాలని అరుంధతికి భాగమతి చెబుతుంది. సంతకం తీసుకున్నాకా ఇక్కడి నుంచి వెళ్లిపోతావా అని అరుంధతి అడుగుతుంది.
దానికి ఏం చెప్పకుండా మౌనంగా వెళ్లిపోతుంది మిస్సమ్మ. ఇప్పుడు మిస్సమ్మ వెళ్లిపోతుందా గుప్తా గారు అని టెన్షన్‌గా అరుంధతి అడుగుతుంది. దానికి వేచి చూడుము అని గుప్తా అంటే.. నాకున్న సగం టెన్షన్ మీకు ఉంటే ఇలా అనరు అని అరుంధతి అంటుంది. నాకు కూడా ఉంది కదా శిరోబారం. నీతో మాట్లాడినట్లు ఆ బాలిక ఎవరికైనా చెప్పినా నాకే కదా సమస్య అని చిత్రగుప్తుడు అంటాడు.
ఆత్మ గురించి
మరోవైపు, డ్రైవర్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మనోహరి ఆందోళన చెందుతుంది. ఆమె ఎవరితోనో మాట్లాడుతున్నట్లు నటిస్తుంది కానీ మనోహరి ఆమెను తిట్టి ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. గుప్తా, భాగీ ఎవరో కనిపించని వ్యక్తితో మాట్లాడుకోవడం తాను చూశానని నీలా చెబుతుంది. ఇంట్లో “ఆత్మ” గురించి గుప్తా చెప్పిన మాటలు మనోహరికి గుర్తున్నాయి. ఘోరా గురించి ఏమైనా సమాచారం దొరికిందా అని నీలాను అడుగుతుంది.
అనంతరం అంజుని ట్యాబ్లెట్ వేసుకోమ్మని మిస్సమ్మ అంటే చేదుగా ఉంటుందని అంటుంది. దాంతో అంజుని కళ్లు మూసుకోమ్మని చెప్పి.. అరటి పండులో ట్యాబ్లెట్ పెట్టి ఇస్తుంది భాగమతి. ఆ అరటిపండు తింటుంది అంజు. రేపటి నుంచి స్కూల్‌కు వెళ్లాలి. రెస్ట్ తీసుకో అని అమర్ చెప్పి వెళ్లిపోతాడు.
బహుమతిగా
మరోవైపు భాగమతి చేసే పనులు చూసి మురిసిపోతారు అమర్ తల్లిదండ్రులు. పిల్లలను బాగా చుసుకుంటున్నందుకు ఆమెను ప్రశంసిస్తారు. భాగీ ఉంటే పిల్లల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమర్ కు చెప్పి భాగీకి గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. బహుమతిగా అమర్ సంతకాన్ని అడగమని భాగీకి చెప్పాలని రాథోడ్ నిర్ణయించుకుంటాడు.