Krishna mukunda murari december 16th: డ్యూటీ ఎక్కిన మురారి.. ముకుందలో మొదలైన టెన్షన్

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari december 16th: ముకుంద నిద్ర లేచేసరికి ఎదురుగా కృష్ణ ఉండటం చూసి షాక్ అవుతుంది. నిద్రలేవగానే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అవి ఇవ్వడానికి వచ్చానని చెప్తుంది. కానీ ముకుంద మాత్రం కోపంగా ఎందుకు బతికించావ్? జరగబోయేది చూసి చావమనా అంటుంది. జరబోయే భవిష్యత్ గురించి కూల్ గా ఆలోచించమని ట్యాబ్లెట్ ఇస్తుంటే విసిరి కొడుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు

మురారితోనే తన పెళ్లి అంటోన్న ముకుంద

నిన్ను చూస్తుంటే చంపేయాలి అనేంత కోపం వస్తుందని అంటుంది. మా అత్తయ్య ఇప్పటికీ మురారిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తుంది. గతం గుర్తుకు వచ్చిందని సంతోషించకు నేను బతికేది మురారి కోసమని ముకుంద చెప్తుంది. నేను బతికేది ఏసీపీ సర్ కోసమేనని కృష్ణ కోపంగా అంటుంది. అలా అయితే నీ బతుక్కే అర్థం లేదు. మురారితో మా అత్తయ్య అని మాట్లాడబోతుంటే కృష్ణ అడ్డుపడుతుంది.

అనవసరంగా కలలు కాని జీవితాన్ని నాశనం చేసుకోకు. ఏసీపీ సర్ నీకు రాసి పెట్టి లేదు. ఏసీపీ సర్ నీవాడు అయితే దేవుడు ఆయనకి గతం గుర్తుకు వచ్చేలా ఎందుకు చేస్తాడు. నీ భవిష్యత్ అంతా ఒకరితోనే అది ఆదర్శ్. తాను ఎక్కడ ఉన్న పట్టుకొచ్చే బాధ్యత తనదని కృష్ణ చెప్తుంది. ముకుంద కోపంగా అరుస్తుంది.

శకుంతల భయం.. ధైర్యం చెప్పిన రేవతి

శకుంతల ఇంటి గుమ్మం దగ్గర నిలబడి కృష్ణ ఎక్కడికి వెళ్లిందోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. రేవతి అటు వస్తుంటే పిలిచి అడుగుతుంది. ఇంటికి వెళ్ళి ఉంటుంది చూసి పంపిస్తానులే అంటుంది. పిల్లలు ఆవేశంగా భార్యాభర్తలుగా ఉండమని చెప్పారు. కొన్ని రోజుల్లో లగ్గం ఉంది అసలు దోషిని ఎప్పుడు పట్టుకుంటారని భయపడుతుంది. కాని రేవతి మాత్రం మురారి ఎలాగైనా దోషిని పట్టుకుంటాడని ధైర్యం చెప్తుంది.

 

మురారి, కృష్ణల చూడముచ్చటైన ప్రేమ

మురారి గదిలో కృష్ణ ఫోటోస్ గోడకి పెడుతూ వాటిని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. కృష్ణ మీద నాకున్న ప్రేమే నాకు గతం గుర్తుకు వచ్చేలా చేసింది. రెండు రోజుల్లో అసలు దోషిని పట్టుకుని లోపల వేసేస్తాను. కృష్ణ చిన్నాన్న నిర్దోషిగా బయటకి తీసుకొస్తానని మనసులో అనుకుంటాడు.

కృష్ణ వచ్చి మురారిని చూస్తుంది. మీకు నామీద ఇంత ప్రేమ ఉందని తెలిస్తే ఇంత దాకా వచ్చేది కాదని బాధపడుతుంది. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. తల స్నానం చేసి వచ్చిన మురారికి కృష్ణ ప్రేమగా తల తుడుస్తుంది. ఇద్దరూ కాసేపు కళ్లతో ప్రేమించేసుకుంటారు.

ముకుందకి సపోర్ట్ గా భవానీ

భవానీ కిందకి వచ్చి ముకుంద లేచిందా అని ఇంట్లో వాళ్ళని అడుగుతుంది. ఎవరూ ఏం పట్టనట్టు ఉండటంతో వాళ్ళని తిడుతుంది. వాళ్ళని అని ప్రయోజనం ఏముంది నేనే దురదృష్టవంతురాలినని ముకుంద బాధగా మాట్లాడుతుంది. అలా ఎందుకు అనుకుంటావ్ అదృష్టం పట్టబోతుందని భవానీ ధైర్యం చెప్తుంది.

ఒక విషయంలో సంతోషంగా ఉంది ఈ ఇంట్లో ఎవరు అండగా లేకపోయినా కూడా మీరు నాకు అండగా నిలిచారు ఆ విషయంలో అదృష్టవంతురాలినని అంటుంది. కృష్ణ టైమ్ కి రియాక్ట్ అవకపోతే హాస్పిటల్ లో ఉండేదానివని మధుకర్ అంటాడు. ఏం గౌతమ్ లేదా ఏంటి ఎప్పుడు కృష్ణ గురించే మాట్లాడతారని భవానీ చిరాకుగా మొహం పెడుతుంది.

 

డ్యూటీ ఎక్కిన మురారి

మురారి, కృష్ణ నవ్వుకుంటూ కిందకి వస్తుంటే వాళ్ళని భవానీ కోపంగా చూస్తుంది. మిగతా వాళ్ళు మాత్రమ సంతోషంగా ఉంటారు. డ్యూటీలో జాయిన్ అవుతున్నానని చెప్పి మురారి భవానీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. జైలుకి వెళ్ళి కృష్ణ వాళ్ళ చిన్నాన్నని కలుస్తాం, ఆ తర్వాత డాక్టర్ ని కలుస్తామని చెప్పేసరికి ముకుంద టెన్సిన్ పడుతుంది. అది కృష్ణ గమనిస్తుంది. పరిమళ హాస్పిటల్ లోనే సర్జరీ జరిగింది కదా ఎవరు చేయించారో ఐడియా ఉంటుందని అంటాడు. ఎలా ఉందని ముకుందని కృష్ణ అడుగుతుంది. ముకుంద చాలా కంగారుపడుతుంది.

మురారి, కృష్ణ వెళ్లిపోతారు. ఇప్పుడు మురారి తీగ లాగితే దేవ్ అన్నయ్య డొంక కదులుతుంది. మురారి దేవ్ గురించి అత్తయ్యకి చెప్తే తను నన్ను క్షమిస్తుందా? కృష్ణ వాళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిసి అన్యోన్యంగా ఉంటున్న వాళ్ళని వేరు చేయడానికి లెక్క చేయలేదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా? అప్పుడు ఏకంగా నన్ను షూట్ చేసేస్తుందని ముకుంద భయపడుతుంది. మురారి వాళ్ళు ప్రభాకర్ ని కలుస్తారు. అటు ముకుంద తన అన్న దేవ్ ని కలిసి విషయం చెప్తుంది.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *