Best Web Hosting Provider In India 2024
Bigg Boss 7 Telugu Day 104 Episode Highlights: బిగ్ బాస్ 7 తెలుగు పూర్తి కావడానికి ఇంకా ఒక్కరోజే మిగిలింది. ఈ సందర్భంగా గ్రాండ్ ఫినాలే ఫీవర్ మొదలైపోయింది. ముందుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి బుల్లితెర యాంకర్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీముఖిని దించారు. యాంకర్ శ్రీముఖి మాటలతో ఎలా రచ్చ చేస్తుందో తెలిసిందే. అలాగే హౌజ్‌లో కూడా రచ్చ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
శ్రీముఖి హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే అమర్ దీప్, ప్రియాంక వెళ్లి గట్టిగా హగ్ చేసుకున్నారు. బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ పూర్తి అయిన వెంటనే తర్వాతి వారమే సూపర్ సింగర్స్ గ్రాండ్ లాంచ్ చేస్తున్నట్లు శ్రీముఖి తెలిపింది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న హౌజ్‌మేట్స్‌లో సింగింగ్ ఆడిషన్ చేద్దామనుకుంటున్నట్లు శ్రీముఖి చెప్పింది.
అనంతరం ప్రశాంత్ ప్లీజ్.. ఇది ఫన్ టాస్క్. ఓడిపోతే హగ్ ఇస్తా.. గెలిస్తే గట్టి హాగ్ ఇస్తా.. ఓకే అని సరదాగా శ్రీముఖి అంది. దానికి ఓకే అన్నట్లుగా తలను చుట్టూ తిప్పాడు పల్లవి ప్రశాంత్. దాంతో అంతా తెగ నవ్వేశారు. తర్వాత గోంగూర తోటకాడ కాపు కాసా అని అమర్ దీప్ పాడాడు. మధ్యలో లిరిక్స్ గుర్తుకు రాగా తల పట్టుకున్నాడు. దాంతో నీ కోరికలు చెబుతున్నట్లు ఉంది కానీ, పాట పాడుతున్నట్లు లేదు అని అర్జున్ సెటైర్ వేశాడు.
కెవ్వు కేక పాటను అర్జున్ పాడాడు. తర్వాత ప్రియాంకను ప్రిన్స్ యావర్ ఎత్తుకుని చుట్టూ తిప్పాడు. అనంతరం ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించింది శ్రీముఖి. ముగ్గురి నుంచి ఒకర్ని డేట్, ఒకర్ని కిల్, మరొకరిని మ్యారేజ్ చేసుకోవాలినిపిస్తే ఏం చేస్తావని ప్రిన్స్ యావర్‌ను శ్రీముఖి అడిగింది. దానికి వెంటనే అశ్వినీని మ్యారేజ్ చేసుకుంటానని యావర్ చెప్పాడు. అబ్బా.. అబ్బా అరెయ్.. అంటూ శ్రీముఖితోపాటు అంతా ఏడిపించారు. ఇలా ప్రోమో సరదాగా సాగిపోయింది.