Prithviraj About Prabhas: ప్రభాస్‍ను అలా ఎందుకు పిలుస్తారో నాకు అర్థమైంది: పృథ్విరాజ్ సుకుమారన్

Best Web Hosting Provider In India 2024

Prithviraj Sukumaran About Prabhas: ప్రస్తుతం సలార్ క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఆ సినిమా రిలీజ్ దగ్గరయ్యే కొద్దీ బజ్ పెరుగుతూనే ఉంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా సలార్‌లో మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్ర పోషించారు. వీరిద్దరి స్నేహమే ప్రధాన అంశంగా పార్ట్-1 రూపొందినట్టు అర్థమవుతోంది. సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఈ తరుణంలో క్రమంగా ప్రమోషన్ల జోరును మూవీ యూనిట్ పెంచుతోంది. ఈ క్రమంలోనే హెచ్‍టీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు పృథ్విరాజ్ సుకుమారన్.

 

ట్రెండింగ్ వార్తలు

ప్రభాస్‍ను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో తనకు సలార్ సమయంలో అర్థమైందని పృథ్విరాజ్ వెల్లడించారు. అతడికి చాలా త్వరగా స్నేహితుడినయ్యాయనని వివరించారు. “ఇతరుల సంతోషంలో ఆనందాన్ని వెతుక్కునే గిఫ్ట్ అతడికి (ప్రభాస్) ఉంది. సెట్‍లో ఎప్పుడూ అందరి గురించి అతడు చూసుకుంటుంటారు. అందరూ మంచి ఆహారం తినేలా.. సౌకర్యవంతంగా ఉండేలా చూసుకుంటుంటారు. అప్పుడు తెలిసింది అతడిని అందరూ డార్లింగ్ అని ఎందుకు అంటారో” అని పృథ్విరాజ్ చెప్పారు. తాను తరచూ మెసేజ్‍లు చేసే అతితక్కువ స్నేహితుల్లో ప్రభాస్ ఒకరని ఆయన తెలిపారు.

చాలా సంతోషంగా ఉంది

కేజీఎఫ్ 2 సమయంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనకు సలార్ కథ చెప్పారని పృథ్విరాజ్ సుకుమారన్ తెలిపారు. ఇటీవలి కాలంలో తాను విన్న గొప్ప స్క్రిప్ట్ ఇదే అనిపించిందని అన్నారు. తనను వరదరాజగా ప్రశాంత్ ఊహించుకున్నందుకు సంతోషంగా అనిపించిందని తెలిపారు. ఆ కథపై పెట్టుకున్న నమ్మకంతో ముందుకు సాగామని, అది ఫలించిందని అనుకుంటున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని పృథ్విరాజ్ అన్నారు.

సలార్ పార్ట్-1 సీజ్‍ఫైర్ మూవీలో దేవగా ప్రభాస్, వరదరాజ మన్నార్‌గా పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. చిన్ననాటి నుంచే వీరు స్నేహితులుగా ఉంటారు. కష్టాల్లో ఉన్న సమయంలో వరదరాజ్‍కు తోడుగా దేవ నిలబడతాడని సలార్ ట్రైలర్లో తెలిసింది.

 

సలార్ సినిమా ప్రమోషన్ల జోరు క్రమంగా పెరుగుతోంది. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍ను దర్శకధీరుడు రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ అతి త్వరలో బయటికి రానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫ్రెండ్‍షిప్ సాంగ్ సూపర్ పాపులర్ అయింది. అలాగే సెన్సార్ రిపోర్టులు కూడా సలార్‌కు పాజిటివ్‍గా ఉన్నట్టు వినిపిస్తోంది.

సలార్ చిత్రానికి ఏ సర్టిఫికేట్ వచ్చింది. సుమారు 2 గంటల 55 నిమిషాల పాటు ఈ మూవీ రన్‍టైమ్ ఉండనుంది. యాక్షన్ సీన్లు ఉండడం వల్లే ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చిందని నిర్మాత చెప్పారు. సలార్ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన చోట్ల సలార్‌కు భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి.

 
WhatsApp channel
 

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *