ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.14-7-2022(గురువారం) ..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశంపార్టీ 6 వ వార్డు కౌన్సిలర్ షేక్ యాకూబ్ అలీ(కట్టప్ప) ,దుబాయ్ కరిముల్లా ..
నందిగామ అభివృద్ధే మా ధ్యేయం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కులం -మతం- రాజకీయం పార్టీలు చూడకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు : ప్రభుత్వ విప్పు & జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ..
నందిగామలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు – ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ లు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినై , నందిగామ అభివృద్ధి మొండితోక బ్రదర్స్ తోనే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను : కౌన్సిలర్ యాకోబు అలీ (కట్టప్ప) ..
పేద బడుగు బలహీన వర్గాలకు , మైనారిటీలకు తెలుగుదేశం పార్టీలో చోటులేదు ..
అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మేము చేసిన అభివృద్ధిని గర్వంగా చెబుతున్నాం , గత ఐదేళ్లలో మీరేమి చేశారో తెలుగుదేశం పార్టీ చెప్పగలదా : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
నందిగామలో రూ.89 కోట్లతో ప్రతి ఇంటికి తాగు నీటి కుళాయి ప్రాజెక్టు – అనాసాగరం & డివిఆర్ కాలనీలలో 2 అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు , వైఎస్ఆర్ రైతు బజార్ , రూ.15 కోట్లతో డ్రైనేజీలు నిర్మాణం – కోవిడ్ కేర్ హాస్పిటల్ – బాలికల జూనియర్ కళాశాల – గాంధీ సెంటర్ అభివృద్ధి – సీఎం రోడ్డు విస్తరణ పనులు – కేంద్రీయ విద్యాలయం – తాత్కాలిక షాదీఖానా గా బాబు జగ్జీవన్ రావు భవన్ – ఇవన్నీ కేవలం మూడేళ్లలోనే చేసాం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ నాలుగు సిమెంట్ రోడ్లు పోసి దోచుకోవటం ,చందాలు వసూలు చేయటం, మున్సిపాలిటీ పై విజిలెన్స్ దాడులు – అభివృద్ధిలో ఆఖరి స్థానంలో మున్సిపాలిటీ – ఇది తప్ప గత ఐదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో తెలుపగలరు ..
మేము మీకు మాదిరి రబ్బరు స్టాంపులం కాదు – స్వతంత్ర నిర్ణయాలతో పరిపాలన చేస్తున్నాము – నందిగామ ను అభివృద్ధి చేస్తున్నాం ..
మళ్లీ చెబుతున్నా వైసీపీలోకి టీడీపీ కౌన్సిలర్ చేరటం ఇది ఆరంభం మాత్రమే – ఇంకా చాలామంది టచ్ లో ఉన్నారు – త్వరలోనే తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుంది ..
నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీలో చేరిన కౌన్సిలర్ యాకూబ్ అలి, దుబాయ్ కరిముల్లా , న్యాయవాదులు అద్దంకి మణి బాబు , షేక్ సైదా , షేక్ సుభాని లను ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు కండువాలు కప్పి ఆహ్వానించారు .. ముందుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ..