
Best Web Hosting Provider In India 2024
Aadikeshava OTT Release Date: మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్, సెన్సేషనల్ శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ సినిమా నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ అయింది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి. అయితే, ఆదికేశవ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్గా నిలిచింది. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై తాజాగా అంచనాలు వెలువడ్డాయి.
ట్రెండింగ్ వార్తలు
ఆదికేశవ సినిమా డిసెంబర్ 22వ తేదీన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుందని తాజాగా సమాచారం చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఈ సినిమా ఓటీటీలోకి రానుందన్న మాట. అయితే, ఆదికేశవ స్ట్రీమింగ్ డేట్ గురించి నెట్‌ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. డిసెంబర్ 22న ఆదికేశవ స్ట్రీమింగ్కు వస్తుందని అంచనాలు వెలుడుతున్నాయి.
ఆదికేశవ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఓవర్ డోస్ యాక్షన్ సీన్లు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కథ, కథనం కూడా కొత్తగా లేకపోవటంతో ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్‌నే ఆ చిత్రం తెచ్చుకుంది. ఇందుకు తగ్గట్టుగానే కలెక్షన్లు కూడా పేలవంగానే వచ్చాయి.
ఆదికేశవ సినిమాలో జోజు జార్జ్, సుమన్, తనికెళ్ల భరణి, సుదర్శన్, అపర్ణా దాస్, జయప్రకాశ్, రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందించారు.
అన్యాయాలు చూసి సహించని హీరో బాలు (వైష్ణవ్ తేజ్), అతడి ప్రేమలో హీరోయిన్ చిత్రావతి (శ్రీలీల) పడడం, హీరోకు కుటుంబానికి ఓ ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం వీటిచుట్టే ఆదికేశవ మూవీ కథ తిరుగుతుంది. తన సొంత ఊరికి వెళ్లి విలన్‌ను హీరో ఎలా అంతమొందించాడన్నదే ఆ సినిమా ప్రధాన పాయింట్‌గా ఉంది.
హీరోగా తొలి సినిమా ఉప్పెనతోనే వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ కొట్టాడు. అయితే, ఆ తర్వాత అతడు హీరోగా చేసిన కొండపొలం, రంగరంగ వైభవంగా పరాజయం పాలయ్యాయి. అయితే, ఆదికేశవతో మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని వైష్ణవ్ తేజ్ ఆశించగా.. ఇది కూడా ఫలించలేదు.