Best Web Hosting Provider In India 2024

Bigg Boss 7 Winner Prize Money: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే నేడు జరుగనుంది. సీజన్ 7 టైటిల్ విజేత ఎవరన్నది ఆదివారం నాగ్ ప్రకటించబోతున్నారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమర్‌దీప్ సెకండ్ ప్లేస్‌తో సరిపెట్టుకున్నట్లు చెబుతోన్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఆరంభం నుంచి విన్నర్ అంటూ ప్రచారం జరిగిన శివాజీ థర్డ్ ప్లేస్‌తో ఎలిమినేట్ అయినట్లు చెబుతోన్నారు. ఫైనలిస్ట్ ఆరుగురిలో ముందుగా అర్జున్ అంబటి ఎలిమినేట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక జైన్ ఎలిమినేషన్‌ను రవితేజ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో ఫైనలిస్ట్ ప్రిన్స్ యావర్ మాత్రం నాగార్జున ఇచ్చిన పదిహేను లక్షల సూట్‌కేస్ తీసుకొని ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలిసింది.
విన్నర్ ప్రైజ్‌మనీ
కాగా ఈ సారి బిగ్‌బాస్ విన్నర్‌కు గత సీజన్స్‌కు మించి ప్రైజ్‌మనీ దక్కబోతున్నట్లు సమాచారం. విన్నర్‌కు యాభై లక్షల ప్రైజ్‌మనీని బిగ్‌బాస్ యాజమాన్యం ఇవ్వనుంది. వీటితో బిగ్‌బాస్ షోకు స్పాన్సర్‌గా వ్యవహరించిన ఓ జ్యూవెల్లరీ సంస్థ విన్నర్‌కు ఇరవై లక్షల విలువైన డైమండ్ నక్లెస్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలిసింది.
వీటితో పాటు 12 లక్షల విలువైన మారుతి బ్రిజా కారుకు కూడా విన్నర్‌కు గిఫ్ట్‌గా దక్కబోతున్నట్లు తెలిసింది. ఓవరాల్‌గా బిగ్‌బాస్ విన్నర్‌కు 80 లక్షల వరకు ప్రైజ్‌మనీ దక్కనున్నట్లు సమాచారం.
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో రవితేజతో పాటు బబుల్‌గమ్, డెవిల్, సైంధవ్ సినిమాల టీమ్‌లు సందడి చేయబోతున్నట్లు సమాచారం. విన్నర్‌ను నాగార్జున స్వయంగా ప్రకటించబోతున్నట్లు తెలిసింది.