Weight Loss With Paneer : పనీర్ బరువు తగ్గేందుకు సహాయపడుతుందా? ఎలా?

Best Web Hosting Provider In India 2024

చాలా మంది సమస్య ఏంటంటే లావుగా ఉండటం. లైఫ్ స్టైల్, డైట్, ఎక్సర్ సైజ్ కి సమయం లేకపోవడం లాంటి కారణాలతో బరువు పెరుగుతూ ఉంటారు. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. బరువు తగ్గాలంటే డైట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. డైట్ ఫాలో అవ్వడం కొంచెం కష్టమే.. ఎందుకంటే నోటికి రుచిగా ఉండే ఫుడ్ తినడం కుదరదు. దీని వల్ల చాలా మందికి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడం కష్టం. మీరు పన్నీర్‌ను ఇష్టపడితే, పనీర్ డైట్ ద్వారా బరువు తగ్గొచ్చు(Paneer For Weight Loss). ఎలా అనే విషయాన్ని ఇక్కడ చూడొచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు

పనీర్ పోషకాలు అధికంగా ఉండే ఆహారం. పనీర్‌లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బి12, సెలీనియం, ఫాస్పరస్, ఫోలేట్ ఉన్నాయి. పనీర్‌లోని ఈ పోషకాలన్నీ బరువును తగ్గించడంలో ఉపోయగపడాతాయి. బరువు తగ్గేందుకు(Weight Loss) ప్రయత్నించినప్పుడు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలి. అప్పుడే మంచిది. కొంతమంది భోజనం మానేసి బరువు తగ్గాలని ప్రయత్నిస్తారు. కానీ ఇది మంచి పద్ధది కాదు.

ఇలా చేయడం వల్ల మన శరీరంలో పోషకాలు లోపించి అనారోగ్యానికి గురవుతారు. బరువు తగ్గడానికి మనం డైట్‌లో ఉన్నప్పుడల్లా మన ఆహారంలో పోషకాహారం ఉండేలా చూడాలి. బరువు తగ్గడానికి పనీర్ ఒక అద్భుతమైన ఎంపిక అని గుర్తుంచుకోవాలి. పనీర్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మిగతా పాల ఉత్పత్తుల కంటే కూడా ఆరోగ్యానికి మంచిది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. కాటేజ్ చీజ్ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే పనీర్ తింటే త్వరగా ఆకలి వేయదు. అతిగా తినడాన్ని అరికట్టవచ్చు.

పనీర్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నించేటప్పుడు తక్కువ కేలరీల ఆహారం తీసుకోవాలి. ఇందులో పిండి పదార్థాలు కూడా తక్కువే. ఇది శరీరంలో చక్కెర పెరుగుదలను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. పనీర్‌లో కాల్షియం కంటెంట్ ఉంది. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, అలాగే ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి కాల్షియం అవసరం. పన్నీర్‌లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.

 

ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడానికి పనీర్‌ను ఎలా తీసుకోవాలి(How To Eat Paneer) అనేది ముఖ్యం. బఠానీ పనీర్, కడాయి పనీర్ చేసి తినండి. మీరు పనీర్‌ను గ్రిల్ చేసి కూడా తినొచ్చు. దీన్ని వేయించవద్దు. నూనెలో వేయించకుండా సాధారణ పులుసులో వేసుకోవచ్చు. రోటీ, చపాతీలకు సూపర్ కాంబినేషన్ పనీర్. నోటికి రుచి ఇస్తూనే పనీర్ డైట్ పాటించడం ద్వారా బరువు తగ్గొచ్చు.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *