Best Web Hosting Provider In India 2024

సాయంత్రమైతే చాలు టీ స్నాక్స్ లేకుంటే.. చాలా మందికి కోపం వచ్చేస్తుంది. టీ జీవితంలో ఒక భాగం చేసుకున్నవారు బోలేడు. టీ తాగితే అదో రిఫ్రెష్. అది లేకుండా ఆ రోజంతా మటాష్.. అన్నట్టే చేస్తారు. కొందరైతే టీ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఇలా ఇండియాలో టీ లవర్స్ చాలా మందే ఉన్నారు. కానీ టీ ఎక్కువగా తాగితే మాత్రం అస్సలు మంచిది కాదు.
ట్రెండింగ్ వార్తలు
నిజానికి టీ చాలా మంది ఇష్టపడే పానీయం. ఓ సర్వే ప్రకారం భారతదేశ జనాభాలో 64 శాతం మంది రోజూ టీ తాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే వారిలో 30 శాతం కంటే ఎక్కువ మంది సాయంత్రం టీ తాగుతారు. ప్రతిరోజూ సాయంత్రం టీ తాగడానికి ఇష్టపడే వారిలో మీరూ ఒకరిగా ఉన్నారా? అవును అయితే, సాయంత్రం టీ మీ ఆరోగ్యానికి మంచి అలవాటు అవునో.. కాదో కూడా తెలుసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం నిద్రవేళకు 10 గంటల ముందు కెఫిన్ నివారించాలి. అలా చేయడం వల్ల కాలేయం నిర్విషీకరణలో సహాయపడుతుంది. అలా చేస్తేనే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే సాయంత్రం పూట టీ తాగడం ఎవరికి మంచిదో, ఎవరికి ఆరోగ్యానికి హానికరమో ఇప్పుడు తెలుసుకుందాం.
సాయంత్రం ఎవరు టీ తాగవచ్చు?
రాత్రి షిఫ్టులో పనిచేసే వారికి సాయంత్రం పూట టీ తాగడం హానికరం కాదు. కానీ ఎక్కువగా తాగొద్దు.
ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు లేని వారు కూడా సాయంత్రం టీ తాగవచ్చు.
ఈవినింగ్ టీ-స్నాక్ మంచి జీర్ణశక్తి ఉన్నవారికి కూడా మంచిది.
నిద్ర సమస్యలు లేని వారు సాయంత్రం పూట టీ తాగవచ్చు.
రోజూ సమయానికి ఆహారం తీసుకునే వారు సాయంత్రం పూట టీ తాగవచ్చు.
తక్కువ టీ తాగే అలవాటు ఉన్నవారు, సగం లేదా 1 కప్పు టీ తాగాలి. అంతకుమించి తాగితే సమస్యలు వస్తాయి.
సాయంత్రం టీకి ఎవరు దూరంగా ఉండాలి?
నిద్రలేమితో బాధపడేవారికి సాయంత్రం టీ మంచిది కాదు.
ఆందోళనతో బాధపడేవారు, ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్న వారు సాయంత్రం టీ తాగకూడదు.
ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవారు సాయంత్రం టీని తీసుకోకూడదు.
బరువు పెరగాలనుకునే వారు సాయంత్రం టీ తాగకూడదు.
క్రమరహితమైన ఆకలి ఉన్నవారు సాయంత్రం టీ తాగకూడదు.
హార్మోన్ల సమస్యలతో బాధపడేవారు సాయంత్రం టీ తాగకూడదు.
మలబద్ధకం/అసిడిటీ లేదా గ్యాస్ సమస్యలు ఉన్నవారు సాయంత్రం టీ తాగకూడదు.
మెటబాలిక్, ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారు సాయంత్రం పూట టీ తాగకూడదు.
బరువు తక్కువగా ఉన్నవారు సాయంత్రం టీ తాగకూడదు.
ఆరోగ్యకరమైన చర్మం, వెంట్రుకలు, పేగులను కలిగి ఉండాలనుకునే వారు సాయంత్రం టీ తాగకూడదు.
ఈ అంశాలన్నింటిని పరిశీలించి, సాయంత్రం పూట టీ తాగడం లేదా టీకి దూరంగా ఉండటం మంచిదా అని నిర్ణయించుకోండి. ఈ జాబితాలో మీరు ఉంటే ఆలోచించండి. నిజానికి టీ రిఫ్రెష్‌గా పనిచేస్తుంది. కానీ అతిగా తాగితే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆకలి సరిగా వేయదు. నిద్ర సరిగా ఉండదు. అందుకే మీరు టీ లవర్స్ అయినా.. కాస్త టీ తగ్గించండి.