Best Web Hosting Provider In India 2024

Keedaa Cola OTT Release Date: క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘కీడాకోలా’ మంచి విజయం సాధించింది. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫుల్ క్రేజ్ మధ్య నవంబర్ 3న థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, ఈ కీడాకోలా మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ కామెడీ డ్రామాను ఓటీటీలో చూడాలని వేచిచూస్తున్నారు. అయితే, ఇప్పుడు కీడా కోలా సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.
ట్రెండింగ్ వార్తలు
కీడాకోలా సినిమా డిసెంబర్ 29వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు (డిసెంబర్ 19) అధికారంగా వెల్లడించింది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లకు మాత్రం ఒక రోజు ముందుగా అంటే.. డిసెంబర్ 28న ఈ మూవీ అందుబాటులోకి వస్తుంది. ఇక సాధారణ సబ్స్క్రైబర్లు డిసెంబర్ 29 నుంచి ఈ మూవీని ఆహా ఓటీటీలో చూడొచ్చు. ఈ విషయాన్ని కూడా ఆహా పేర్కొంది.
“దరిద్రానికి దగ్గరగా.. పైసల్కి దూరంగా.. మజాక్లో బతుకుతున్న కొన్ని జీవితాలను సూడడానికి రెడీగా ఉండండి. పక్కా నవ్వుల దాడి కీడాకోలా.. డిసెంబర్ 29న ప్రీమియర్‌కు రానుంది. గోల్డ్ సబ్స్క్రైబర్లకు 24 గంటల ముందే యాక్సెస్‌కు వస్తుంది” అని ఆహా ఫన్నీగా ఈ కీడాకోలా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటిస్తూ ట్వీట్ చేసింది.
ఓ కోలా కూల్‌డ్రింక్ బాటిల్లో బొద్దింక రావడం.. దాని ద్వారా కంపెనీ యజమానిని బెదిరించి డబ్బు లాగాలని కొన్ని గ్రూపులు ప్రయత్నించడం చుట్టూ ఈ కీడాకోలా మూవీ తిరుగుతుంది. కామెడీ, క్రైమ్, కొన్ని ట్విస్టులు, యాక్షన్ సహా చాలా అంశాలతో ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ నగరానికి ఏమైంది మూవీ తర్వాత డైరెక్షన్‌కు ఐదేళ్ల విరామం తీసుకొని ఈ సినిమాను ఆయన రూపొందించారు.
కీడా కోలా సినిమాలో చైతన్యరావ్, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు. వీజీ సైన్మా పతాకంపై వివేక్ సుదాన్షు, సాయికృష్ణ, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస కౌశిక్.. ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేశ్ బ్యానర్ పతాకంపై ప్రముఖ హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పించారు.
సంబంధిత కథనం
టాపిక్