Sarkaaru Noukari: కండోమ్ తెచ్చిన కష్టాలు.. సింగర్ సునీత కొడుకు మూవీ సర్కారు నౌకరి

Singer Sunitha Son Akash: టాలీవుడ్‌లో సింగర్‌గా సునీత మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా “సర్కారు నౌకరి”. ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

“సర్కారు నౌకరి” సినిమా న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. తాజాగా సర్కారు నౌకరి సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య, రైటర్ బీవీఎస్ఎన్ రవి, సినిమా టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు.

సర్కారు నౌకరి ట్రైలర్‌లో గోపాల్ అనే వ్యక్తికి మండల కార్యాలయంలో ఉద్యోగం వస్తుంది. కొత్తగా పెళ్లయినా గోపాల్ భార్యను తీసుకుని ఓ మారుమూల గ్రామానికి వస్తాడు. ఆ గ్రామంలో నిరోధ్ వాడకం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం గోపాల్ పని. కానీ, ఆ పని నుంచి గోపాల్‌కు వ్యతిరేకత వస్తుంది. కండోమ్‌ వాడమని చెబితే.. అదొక దరిద్రం అంటూ విముఖత చూపుతారు. అప్పటివరకు సర్కారు నౌకరోడి భార్య అని గౌరవంగా చూసుకున్న అతని భార్యను చిన్నచూపు చూస్తారు.

బుగ్గలోడు అంటూ హేళన చేస్తారు. దీంతో గోపాల్ కాపురంలో కండోమ్ కష్టాలు తెచ్చిపెడుతుంది. ట్రైలర్ ఫన్ అండ్ ఎమోషనల్‌గా ఆసక్తిగా సాగింది. సర్కారు నౌకరి అంటే సర్కారు జీతం తీసుకోవడం కాదు సార్.. ప్రజలకు సేవ చేయడం అంటూ ట్రైలర్ చివర్లో చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *