Best Web Hosting Provider In India 2024

Hyderabad City Police Updates: ” ఇయర్ ఎండింగ్ క్రైమ్ ” రివ్యూ పై హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో 24,821 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని వెల్లడించారు.ఇక హైదరాబాద్ లో గత ఏడాదితో పోల్చితే 2 శాతం క్రైమ్ రేటు పెరిగిందని తెలిపారు. 9 శాతం దోపిడీ లు,మహిళలపై 12 శాతం నేరాలు పెరిగాయన్నారు. చిన్నారులపై హైదరాబాద్ లో గత ఏడాదితో పోల్చితే 12 శాతం నేరాలు తగ్గాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ సంవత్సరం హైదరాబాద్ నగరం లో వివిధ కేసుల్లో జరిగిన మొత్తం నష్టం విలువ రూ.38 కోట్లు.అందులో 75 శాతం పోలీసులు రికవరీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 79 హత్యలు,403 రేప్ కేసులు ,242 కిడ్నాప్ లు,4909 చీటింగ్ కేసులు,2637 రోడ్డు ప్రమాదాలు,262 ఆత్మహత్యలు,91 దొంగతనాలు జరిగాయి.ఈ ఏడాది 63 శాతం నేరస్తులకు పోలీసులు శిక్షలు విధించారు.13 కేసుల్లో 13 మంది నెరస్తులకు కోర్టులు జీవిత ఖైదీ శిక్షలు విధించాయి.అన్నీ కేసులో కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా 4465 మంది నేరస్తులకు శిక్షలు పడ్డాయి అని సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
11 శాతం పెరిగిన సైబర్ నేరాలు….
గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం 19 శాతం అత్యాచారం కేసులు పెరిగాయి.డ్రగ్స్ బారిన పడ్డ 740 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులు ఈ ఏడాది పోలీసులకు పట్టుబట్టారు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై డ్రగ్స్ పేరు వినపడకూడదని,హైదరాబాద్ లో ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేసినా,తీసుకున్న కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. డ్రగ్స్ ను పట్టుకునేందుకు రెండు స్నిపర్ డాగ్స్ కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఇక సైబర్ నేరాల విషయానికొస్తే గత ఏడాదితో పోల్చుతే ఈ ఏడాది 11 శాతం సైబర్ నేరాలు పెరిగాయన్నారు.ఇన్వెస్ట్మెంట్ల స్కీంల ద్వారా రూ.401 కోట్ల మోసాలు జరిగాయన్నారు.మార్కెటింగ్ మోసాలు రూ.152 కోట్ల వరకు జరిగినట్లు ఆయన వివరించారు. ఆర్థిక నేరాల్లో రూ.10 వేల కోట్లకు పైగా మోసాలు జరిగాయన్నారు. ల్యాండ్ స్కామ్ లలో 245 మందిని అరెస్టు చేశామన్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా