Best Web Hosting Provider In India 2024

Krishna Mukunda Murari December 25th Episode: కృష్ణ, మురారిలను ఎదురించేందుకు ముకుంద తన అన్నయ్య దేవ్‌ను రంగంలోకి దించుతుంది. అతడు రివర్స్ డ్రామా అడి కృష్ణ, మురారిలను తన ట్రాప్‌లో పడేస్తాడు దేవ్. తనకు ముకుంద ఎంతో కృష్ణ కూడా అంతేనని, కేసు సాల్వ్ విషయంలో నీకు పూర్తిగా సహకరిస్తానని మురారికి మాటిస్తాడు. అతడు మాటలు నిజమని నమ్ముతాడు మురారి. కేసు సాల్వ్ చేయడంలో దేవ్ హెల్ప్ చేస్తానని అన్నాడని రేవతితో చెబుతాడు మురారి. మురారి మాటలతో దేవ్ మంచివాడేనని రేవతి, మధుకర్ కూడా నమ్ముతారు.
ట్రెండింగ్ వార్తలు
ఆదర్శ్ వస్తేనే…
ముకుందను దేవ్ తన ఇంటికి తీసుకెళతాడేమోగానీ తనకు ఇచ్చి మాత్రం పెళ్లి చేయడని మురారి అంటాడు. నిజంగా దేవ్‌కు ముకుంద మీద అంత ప్రేమ ఉంటే ఆదర్శ్‌ను వెతకడానికి ఎందుకు వెళ్లడం లేదని డౌట్ పడుతుంది రేవతి. తనను ప్రేమిస్తున్న ముకుంద…ఆదర్శ్‌ను వెతకడం కోసం దేవ్‌ను ఎందుకు పంపిస్తుందని తల్లితో అంటాడు మురారి. ఆదర్శ్ వస్తే ముకుందతో నీ పెళ్లి ఆగిపోయే అవకాశం ఉందని కొడుకుతో అంటుంది రేవతి. ఇన్నాళ్లు రానివాడు ఇప్పుడు ఎలా వస్తాడని తల్లికి బదులిస్తాడు మురారి. ఎవరు ఉన్నా లేకపోయినా, హోప్ ఉన్న లేకపోయినా నువ్వు కృష్ణ కలిసే ఉంటారు. మిమ్మల్ని ఎవరూ విడదీయలేరని మురారితో చెబుతాడు మధుకర్.
కృష్ణ చేపల పులుసు….
అందరూ హాల్‌లోకి రావాలని అనౌన్స్‌చేస్తాడు దేవ్.కృష్ణతో కలిసి మురారి ఫ్యామిలీ కోసం చేపల పులుసు తయారు చేసుకొని తీసుకొస్తాడు దేవ్. మురారికి చేపల పులుసు అంటే ఇష్టమట కదా కృష్ణ చెప్పిందని అంటాడు.
కృష్ణ, మురారిలతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ వారిని పూర్తిగా బుట్టలో పడేసేందుకు ప్లాన్స్ వేస్తాడు దేవ్. మురారి కోసం కృష్ణ భోజనం తీసుకురావడం భవానీ చూస్తే ఎలాంటి గొడవ చేస్తుందోనని రేవతి టెన్షన్ పడుతుంది. మురారి కూడా అదే ఆలోచిస్తుంటాడు. కానీ భవానీ మాత్రం సీరియస్‌గా చూస్తుంది. చేపల పులుసు మాత్రమే ఇవ్వడానికి వచ్చానని, ఇచ్చేసి వెంటనే వెళ్లిపోతానని భవానీతో అంటుంది కృష్ణ.
భవానీ ఫైర్…
నువ్వు ఈ ఇంటికి రావచ్చు, వెళ్లొచ్చునని చెప్పాను కదా..దానికి నువ్వేదో తప్పు చేసినా దానిలా అంటూ మురారి సర్ధిచెప్పబోతాడు. కానీ భవానీ అతడి మాటల్ని మధ్యలోనే అడ్డుకుంటుంది. కృష్ణ తప్పుచేసిందని అంటుంది. మన ఇంటి పరువు తీసి ఇంట్లో వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేసిన కృష్ణను ఎలా సపోర్ట్ చేస్తున్నారంటూ నిలదీస్తుంది.
కృష్ణ ఏ తప్పు చేయలేదని మీరు ఎలా డిసైడ్ అవుతున్నారంటూ గొడవ చేస్తుంది. నీకు యాక్సిడెంట్ చేసిన కృష్ణను నువ్వు క్షమించవచ్చు…కానీ నేను క్షమించను అంటూ చెబుతుంది. మధ్యలో నందు కలగజేసుకొని భవానీకి సర్ధిచెప్పబోతుంది. కానీ ఆమెపై కూడా భవానీ ఫైర్ అవుతుంది.
కృష్ణకు అవమానం…
నువ్వు వచ్చిన తర్వాతే ఇంట్లో మనుషులు మారారు. వారి మనసుల్ని నువ్వే మార్చావు. క్షమశిక్షణ లేకుండా చేశావు అంటూ కృష్ణను అవమానిస్తుంది భవానీ. కృష్ణను తన కళ్ల ముందే నానా మాటలు అనడం రేవతి సహించలేకపోతుంది. కృష్ణను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని అంటుంది.
కానీ దేవ్ కలుగజేసుకొని కృష్ణకు సపోర్ట్ చేస్తాడు. కృష్ణ మంచిది అని సర్టిఫికెట్ ఇస్తాడు. తన భర్తకు తానే ఎందుకు యాక్సిడెంట్ చేయిస్తుందని అంటాడు. భార్యాభర్తల బంధాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పబోతాడు. అతడిపై కూడా భవానీ కోప్పడుతుంది. భార్యాభర్తలు అనే మాటకు వారు అర్హులు కాదని చెబుతుంది. వాళ్లది అగ్రిమెంట్ మ్యారేజీ అని అంటుంది.
నువ్వే ఈ ఇంటి కోడలివి…
కృష్ణను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు మురారి. కానీ భవానీ మాత్రం అతడి మాటలను పట్టించుకోదు. కృష్ణను నమ్మడమే తాను చేసిన మొదటి తప్పు అని, మళ్లీ ఆ పని చేయనని అంటుంది. తన కోసం భవానీ, మురారి గొడవపడటం కృష్ణ సహించలేకపోతుంది. తాను వెళ్లిపోతానని అంటుంది. కానీ దేవ్ ఆమెను ఆపుతాడు. నువ్వు నేరస్తురాలివని తేలనంతవరకు నువ్వే ఈ ఇంటి కోడలివి. నువ్వే నేరం చేశావని రుజువైన తర్వాతే ముకుంద ఇంటి కోడలు అవుతుందని అంటాడు. ఎలాగూ నువ్వు నిర్ధోషివని తేలడం ఖాయం కాబట్టి అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ఇంటి కోడలివి నువ్వేనని కృష్ణకు సపోర్ట్ చేస్తాడు.
అన్నపై ముకుంద సీరియస్…
సొంత చెల్లెలిని చూడటానికి వచ్చిన నువ్వు కృష్ణలో కలిసి న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నావని అన్నయ్యపై ముకుంద కోప్పడుతుంది. కృష్ణ అవుట్‌హౌజ్‌లో ఉండటానికి కారణం నువ్వే…పెళ్లైన వాడి ప్రేమలో నువ్వు పడకపోయుంటే అంటూ ముకుందకు క్లాస్ ఇవ్వబోతాడు.
కానీ అతడి మాటలను భవానీ అడ్డుకుంటుంది. ఎప్పటికైనా ఈ ఇంటి కోడలు. మురారి భార్య ముకుందనే అని భవానీ తీర్పు ఇస్తుంది. నా నమ్మకం ఎప్పుడూ వమ్ము కాలేదని చెబుతుంది. వచ్చిన వాళ్లు వచ్చిన దారినే వెళ్లిపోవచ్చునని భవానీ అనడంతో కృష్ణ కన్నీళ్లతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
ముకుంద టెన్షన్…
కృష్ణ, మురారి కలిసిపోయరనే ఊహే ముకుంద భరించలేకపోతుంది . తన రూమ్‌లో టెన్షన్‌గా తిరుగుతుంటుంది. ఆమెకు దేవ్ ధైర్యం చెబుతాడు. నీకు మురారికి గ్యారెంటీగా పెళ్లి అవుతుందని అంటాడు అన్నయ్య మాటలతో ముకుంద హ్యాపీగా ఫీలవుతుంది.
యాక్సిడెంట్ చేసింది నేనే మనం చెబితే కానీ ఎవరికి తెలియదని దేవ్ అంటాడు. శుక్రవారం వరకు ఈ సీక్రెట్‌ను దాచిపెడితే చాలని ముకుందకు చెబుతాడు. పెళ్లైన తర్వాత విషయం బయటపడితే ఎలా అని ముకుంద డౌట్ పడుతుంది. తెలిసిన ఏం పర్వాలేదని ముకుందకు సర్ధిచెబుతాడు దేవ్. మురారిని బుట్టలో వేసుకోవడం నీ టాలెంట్‌పై ఆధారపడి ఉంటుందని చెబుతాడు.
దేవ్ సలహా…
మురారి తనతో రెండు నిమిషాలు కూడా మాట్లాడటం లేదని ముకుంద అంటుంది. పెళ్లైన వెంటనే అమెరికా వెళ్లిపొమ్మని చెల్లెలికి సలహా ఇస్తాడు దేవ్. ఏం జరిగిన వెనక్కి తగ్గదని అంటాడు. ఉదయమే మురారి కోసం కాఫీ తీసుకొని వస్తుంది ముకుంద. నా భార్య ఉండగా నాకు కాఫీ తేవడానికి నువ్వెవరూ అంటూ ముకుందపై ఫైర్ అవుతాడు మురారి. నాకు చేసిన మోసానికి నన్ను పెళ్లి చేసుకోవడమే తగిన ప్రాయశ్చిత్తమని మురారితో అంటుంది ముకుంద. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ముగిసింది.