Hyderabad News : వీధి కుక్కల దాడి, ఎలుక కొరికి- ఇద్దరు నవజాత శిశువులు మృతి!

Best Web Hosting Provider In India 2024

Hyderabad News : నెలల వయసున్న ఇద్దరు మగ శిశువులు మరణించిన విషాద ఘటన తెలంగాణలో చోటుచేసుకున్నారు. వీధి కుక్కల దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందగా, ఎలుక కొరకడంతో మరో నవజాత శిశువు మరణించాడు.

 

ట్రెండింగ్ వార్తలు

వీధికుక్కల దాడిలో

హైదరాబాద్ లోని షేక్ పేట్ వినోబా నగర్ లో వీధి కుక్కల దాడిలో ఐదు నెలల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అనూష, అంజి దంపతులు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ షేక్ పేట్ వినోబా నగర్ లో నివశిస్తున్నారు. వీరి ఐదు నెలల బాలుడు శరత్ ను ఈ నెల 8న గుడిసెలో పడుకోబెట్టి తల్లిదండ్రులు కూలిపనికి వెళ్లారు. తల్లిదండ్రులు తిరికి ఇంటికి వచ్చేసరికి కుక్కల దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడి కనిపించాడు. శరత్ ను వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శరత్ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

ఎలుక కొరకడంతో నవజాత శిశువు మృతి

మరో ఘటనలో నలభై రోజుల వయసున్న చిన్నారిని ఎలుక కొరకడంతో మృతి చెందాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ లో జరిగింది. పట్టణంలోని నాగనూల్‌ కు చెందిన శివ, లక్ష్మికళ దంపతులకు ఇటీవల మగ శిశువు పుట్టాడు. శనివారం రాత్రి నేలపై తల్లితో పాటు నిద్రపోతున్న చిన్నారి ముక్కును ఎలుక కొరికింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర రక్తస్రావమైంది. చిన్నారిని వెంటనే నాగర్ కర్నూల్ లోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం చిన్నారి మృతి చెందాడు. చికిత్సకు బాలుడి శరీరం సహకరించకపోడవడంతో చనిపోయాడని వైద్యులు తెలిపారు.

 
WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *