Sankranthi Movies 2024: సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ పందెం 600 కోట్లు – త‌గ్గేదేలే అంటోన్న హీరోలు

Best Web Hosting Provider In India 2024

Sankranthi Movies 2024: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతి పోరు ఆస‌క్తిక‌రంగా మారింది. పండుగ బ‌రిలో అగ్ర హీరోలు మ‌హేష్‌బాబు, నాగార్జున‌, వెంక‌టేష్‌, ర‌వితేజతో పాటు యంగ్ హీరో తేజా సజ్జా నిలిచారు.ఈ స్టార్స్ సినిమాలే కాకుండా డ‌బ్బింగ్ మూవీస్ తో ర‌జ‌నీకాంత్‌, ధ‌నుష్ కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌టంతో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

 

ట్రెండింగ్ వార్తలు

ఎవ‌రికి వారే త‌గ్గేదేలే అంటూ ప్ర‌మోష‌న్స్‌ తో కాంపిటీషన్ పెంచుతున్నారు. మొత్తం ఈ సంక్రాంతికి ఏడు సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఈ ఏడు సినిమాల బ‌డ్జెట్ ఆరు వంద‌ల కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి…థియేట్రిక‌ల్‌, ఓటీటీ శాటిలైట్ క‌లుపుకొని పండుగ సినిమాల బిజినెస్ 800 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంటున్నారు.

మ‌హేష్ టాప్‌…

సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న సినిమాల్లో మ‌హేష్ బాబు గుంటూరు కారం ఆడియెన్స్‌లో అంచ‌నాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్‌బాబు, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబోలో రూపొందుతోన్న ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది.

దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న సినిమాల్లో బ‌డ్జెట్ ప‌రంగా గుంటూరు కారం టాప్ ప్లేస్‌లో ఉంది. మ‌ద‌ర్ సెంటిమెంట్‌కు త్రివిక్ర‌మ్ శైలి ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, కామెడీ మేళ‌వించి గుంటూరు కారం రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. ఇందులో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ఇప్ప‌టికే రిలీజైన పాట‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. జ‌న‌వ‌రి ఫ‌స్ట్ వీక్ నుంచి గుంటూరు కారం ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌బోతున్నారు.

సైంధ‌వ్ సెకండ్ ప్లేస్‌…

గుంటూరు కారం త‌ర్వాత వెంక‌టేష్ సైంధ‌వ్ సంక్రాంతి సినిమాల్లో బ‌డ్జెట్ ప‌రంగా సెకండ్ ప్లేస్‌లో ఉంది. దాదాపు 80 నుంచి 100 కోట్ల బ‌డ్జెట్‌తో వెంక‌టేష్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీగా సైంధ‌వ్ రూపొందుతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి హిట్ ఫేమ్‌ శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. సైంధ‌వ్‌తోనే వెంక‌టేష్‌ పాన్ ఇండియ‌న్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

 

దాంతో వెంక‌టేష్‌కు సైంధ‌వ్‌ స‌క్సెస్ కీల‌కంగా మారింది. తొలుత డిసెంబ‌ర్‌లోనే సైంధ‌వ్‌ను రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ స‌లార్ బ‌రిలో నిల‌వ‌డంతో సైంధ‌వ్ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. సైంధ‌వ్‌లో బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో ఆర్య‌, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, ఆండ్రియా ప్ర‌ధాన పాత్ర‌ల్ని పోషిస్తున్నారు. జ‌న‌వ‌రి 13న సైంధ‌వ్ రిలీజ్ అవుతోంది.

హ‌నుమాన్ ధైర్యం…

స్టార్ హీరోల‌కు పోటీగా సంక్రాంతి బ‌రిలో హ‌నుమాన్ నిల‌వ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. తేజా స‌జ్జా హీరోగా న‌టిస్తోన్న హ‌నుమాన్ మూవీకి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. సూప‌ర్ హీరో క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ బ‌డ్జెట్ 80 కోట్ల‌కుపైనే అని స‌మాచారం. హ‌నుమాన్ కూడా పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో విడుద‌ల‌వుతోంది. అమృత అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, విన‌య్ రాయ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు.

నాగార్జున‌, ర‌వితేజ కూడా…

ఈ సంక్రాంతికి నాగార్జున నా సామిరంగం, ర‌వితేజ ఈగ‌ల్ కూడా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. ఈగ‌ల్ సినిమా బ‌డ్జెట్ యాభై కోట్ల‌కుపైనేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈగ‌ల్ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

 

అలాగే సంక్రాంతి పండుగ నాగార్జున‌కు బాగా అచ్చొచ్చింది. ఈ సారి రీమేక్ మూవీతో సంక్రాంతి స‌మ‌రానికి సిద్ధ‌మ‌య్యాడు నాగార్జున, అత‌డు హీరోగా న‌టించిన నాసామిరంగ పండుగ‌కు ముందుకు రాబోతోంది. దాదాపు యాభై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో నాగార్జున‌తో పాటు అల్ల‌రి న‌రేష్‌, రాజ్‌త‌రుణ్ హీరోలుగా క‌నిపించ‌బోతున్నారు. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన పురింజు మ‌రియం జోస్ ఆధారంగా నా సామి రంగా రూపొందుతోంది.

మామాఅల్లుళ్ల పోరు…

స్ట్రెయిట్ సినిమాల‌తో పాటు ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్‌తో పాటు ర‌జ‌నీకాంత్ లాల్ స‌లాం కూడా సంక్రాంతికి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఈ రెండు డ‌బ్బింగ్ సినిమాల బ‌డ్జెట్‌ 150 నుంచి 200 కోట్ల మ‌ధ్య ఉంటుంద‌ని స‌మాచారం. మొత్తంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న అన్ని సినిమాల బ‌డ్జెట్ 600 నుంచి 700 కోట్ల మ‌ధ్య ఉంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ సంక్రాంతి పోరులో విన్న‌ర్ ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

 

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *