Mangalavaaram OTT Release: ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన పాయల్ రాజ్‍పుత్ థ్రిల్లర్ సినిమా ‘మంగళవారం’

Best Web Hosting Provider In India 2024

Mangalavaaram OTT Release: మంగళవారం సినిమా ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సైకలాజిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మంగళవారంతో అజయ్ – పాయల్ కాంబో మరోసారి రిపీట్ అయింది. ఈ ఏడాది నవంబర్ 17న థియేటర్లలో రిలీజ్ అయిన మంగళవారం చిత్రం మంచి విజయం సాధించింది. మంగళవారం సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలివే..

 

ట్రెండింగ్ వార్తలు

మంగళవారం సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కొంతకాలంగా త్వరలో అంటూ ఊరిస్తూ వచ్చిన ఆ ప్లాట్‍ఫామ్ ఇటీవలే స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది. నేడు (డిసెంబర్ 26) ఎట్టకేలకు మంగళవారం చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది. మంగళవారం రోజున ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. డిస్నీ+ హాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్‍లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది.

ఆర్ఎక్స్100 చిత్రంతో సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు ఆజయ్ భూపతి ఆ తర్వాత మహాసముద్రంతో నిరాశపరిచాడు. అనంతరం సస్పెన్స్ థ్రిల్లర్‌గా మంగళవారం చిత్రాన్ని తెరకెక్కించి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. బడ్జెట్ పరంగా చిన్న మూవీగా వచ్చిన మంగళవారం మంచి కలెక్షన్లు సాధించింది. కథలోని విభిన్నమైన పాయింట్, అజయ్ భూపతి టేకింగ్ చాలా మంది ప్రేక్షకులను మెప్పించింది.

మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‍పుత్ క్యారెక్టర్, ఆమె నటన హైలైట్‍గా నిలిచాయి. ఈ చిత్రంలో నందిత శ్వేత, అజ్మల్ అమీర్, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య కీరోల్స్ చేశారు. అజ్‍నీశ్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ముద్రా మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్స్ వర్క్స్ బ్యానర్లపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేశ్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

మహాలక్ష్మిపురం గ్రామంలో వరుసగా మంగళవారం మరణాలు సంభవించడం.. అందుకు కారణమేంటనే విషయాల చుట్టూ మంగళవారం మూవీ నడుస్తుంది. మంగళవారం జరిగే మరణాల వెనుక మిస్టరీ ఏంటి.. ఈ చావులకు శైలజ (పాయల్ రాజ్‍పుత్‍)కు ఉన్న సంబంధం ఏంటి.. ఇవి ఆత్మహత్యలా.. హత్యలా అనేదే మంగళవారం మూవీ ప్రధాన స్టోరీగా ఉంది. మిస్టరీ థ్రిల్లర్‌గా ఆసక్తికరంగా ఈ చిత్రం సాగుతుంది

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *