జగనన్నతోనే బలహీనవర్గాల సాధికారత సాకారం

Best Web Hosting Provider In India 2024

బడుగులకు తలుపుతట్టి సంక్షేమం అందిస్తున్న జగనన్న: మంత్రి మేరుగ నాగార్జున

దేశంలో సామాజిక ధర్మం పాటించిన ఏకైక సీఎం జగన్: మంత్రి జోగి రమేష్

సంక్షేమ రథ సారథిగా గుర్తింపు పొందిన జగనన్న: ఎంపీ మోపిదేవి వెంకటరమణ

పేదవాడికి జీవితం మీద భరోసా కల్పించిన జగనన్న: ఎమ్మెల్యే పార్థసారథి

మైనార్టీలకు సముచిత స్థానం దక్కింది: ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ 

పెనమలూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర 

పెనమలూరు: పెనమలూరులో సామాజిక సాధికారత వెల్లివిరిసింది. వేలాది మంది జనసందోహం మధ్య ఉత్సాహంగా బస్సుయాత్ర జరిగింది. జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతల ప్రసంగాలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి. జగనన్న అండతో తాము సాధించిన సాధికారతను నేతలు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, రక్షణ నిధి, హఫీజ్ ఖాన్, ఉదయభాను, కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే..

మంత్రి మేరుగ నాగార్జున
* సామాజిక సాధికార యాత్ర ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలి. 
* దేశంలో ఎందరో నాయకులు సామాజిక సాధికారత కోసం ఉద్యమాలు చేశారు. 
* కానీ వారి కలలు అప్పుడు సాకారం కాలేదు. దేశంలో తొలిసారి ఏపీలో ఆ కలలు సాకారం అయ్యాయి. 
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి పెరిగింది. 
* ఈ వర్గాలు ధైర్యంగా బతుకుతున్నరాజకీయాలు ఇప్పుడే జరుగుతున్నాయి. 
* చంద్రబాబు పాలనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు.. ఆయన ఎప్పుడు దిగిపోతాడా అని ఎదురు చూశారు. 
* ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికిరారని ఉత్తరం రాశాడు.
* దేశంలో ఎస్సీల మీద దాడుల్లో చంద్రబాబు హయాంలో ఏపీ 4వ స్థానంలో ఉందని ఎన్సీఆర్‌బీ రిపోర్ట్‌ చెప్పింది.
* ఇప్పుడు రాష్ట్రంలో పేదవాడు ధైర్యంగా బతుకుతున్నాడు. తలుపుతట్టి సంక్షేమ పథకం అందిస్తున్నారు.
* రాజ్యాంగబద్ధమైన హక్కులు మనకున్నాయి. చట్టాలను మనకు చుట్టాలుగా చేసిన సీఎం జగన్.
* రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేస్తే వాటిలో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యం. 
* పేదవాడి పిల్లవాడు ఫీజుల కోసం ఆలోచించకుండా ధైర్యంగా ఇంగ్లీషు మీడియం చదువుతున్నాడు.
* మొన్నటి దాకా ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలుంటే ఈరోజు రూ.25 లక్షల దాకా చికిత్స అందిస్తున్నారు. 
* ఇంటికొచ్చాక పనిచేసుకోలేని పరిస్థితి ఉంటే ఖర్చులకు డబ్బులిచ్చే సీఎం జగన్. 
* 31 లక్షల ఇళ్లపట్టాలిస్తే 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యం.
* రాజధానిలో పేదలకు ఇంటి స్థలాలిస్తుంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందన్న వ్యక్తి చంద్రబాబు. 
* ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు కలిసికట్టుగా ఉండి జగనన్నను కాపాడుకోవాలి. 

మంత్రి జోగి రమేష్
* బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు మొత్తం ఒకతాటిపైకి వచ్చారు. జగనన్న పక్షాన రాష్ట్రంలో మోత మోగిస్తున్నారు. 
* 28 రాష్ట్రాల్లో సీఎంలు ఉంటే ఏ ఒక్కరూ సామాజిక న్యాయాన్ని పాటించలేదు.
* సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్నమాత్రమే.
* జగనన్న కటౌట్ పెడితేనే ఇన్ని వేల మంది వచ్చారు. జగనన్న బయటకొస్తే సునామీనే. 
* కేబినెట్‌లో 25 మంది ఉంటే 17 మంత్రి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న.
* ఏనాడైనా ఫలానా సామాజిక వర్గానికి న్యాయం చేశానని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా?
* వర్ల రామయ్యకు రాజ్యసభ పదవి ఇస్తానని చెప్పి ప్రకాశం బ్యారేజీ దాటకముందే కనకమేడలకు అమ్ముకున్న చంద్రబాబు.
* రాజ్యసభ పదవులు అమ్ముకొనే పరిస్థితులు పోయి మోపిదేవి, పిల్లి సుభాష్, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య లాంటి బలహీన వర్గాలకు ఇచ్చిన జగనన్న.
* ఒకప్పుడు వార్డు మెంబర్ కావాలంటే అడుక్కోవాల్సిన పరిస్థితుల నుంచి ఇప్పుడు బడుగులను రాజ్యసభ సీట్లో కూర్చోబెడుతున్న చరిత్ర.
* 50 శాతం నామినేటెడ్ పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏకంగా చట్టం చేసి మనకు చుట్టంగా ఇచ్చిన జగనన్న. 
* టీడీపీ మేనిఫెస్టో గురించి, మా మేనిఫెస్టో గురించి చర్చకు రెడీ. చంద్రబాబుగానీ, అచ్చెన్నాయుడుగానీ సిద్ధమా? 
* రైతుల్ని రుణమాఫీ పేరుతో, డ్వాక్రా రుణమాఫీ పేరుతో అక్కచెల్లెమ్మల్ని మోసం చేసిన చంద్రబాబు, పవన్. 
* నిరుద్యోగభృతి ఇస్తానని, ఇంటికో ఉద్యోగం అని మోసం చేసిన చరిత్ర వారిది. ముందు వాటికి సమాధానం చెప్పాలి. 
* చంద్రబాబుకే గ్యారెంటీ లేదు. మనకెక్కడ గ్యారెంటీ ఇస్తాడు?
* దొంగలకు చంద్రబాబుకు తేడా లేదు. వీళ్లను తరిమి కొట్టాలని కోరుతున్నాం. 

ఎంపీ మోపిదేవి వెంకటరమణ
* బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల స్థితిగతులు మార్చేందుకు జగనన్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. 
* ఓటు బ్యాంకుకే పరిమితమైన ఈ వర్గాలను సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్టు చేస్తున్నారు. 
* మనం అడగకుండానే యోగక్షేమాలు తెలుసుకొని స్థితిగతుల్లో మార్పులు తెచ్చిన జగనన్న.
* జాతీయ స్థాయిలో సంక్షేమ రథ సారథిగా జగనన్న గుర్తింపు పొందారు.
* రూ.2.50 లక్షల కోట్లు నేరుగా ఎక్కడా రూపాయి లంచం లేకుండా అందించారు. 
* విప్లవాత్మక మార్పులు, చారిత్రాత్మక నిర్ణయాల ద్వారా ప్రజారంజక పాలన అందిస్తున్నారు. 
* సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనైతిక పొత్తులతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు, పవన్ వస్తున్నారు.
* నాలుగున్నరేళ్లలో మన ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తెచ్చేందుకు జగనన్న ప్రయత్నించారు. 
* జగనన్న నాయకత్వానికి మనందరు అండగా ఉండాలి. 

ఎమ్మెల్యే పార్థసారథి
* అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలు, పేదరికంలో మగ్గిపోతున్న వారికి ప్రత్యేకంగా కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేసిన సందర్భాలు గతంలో లేవు. 
* మన హక్కుల్ని కాపాడుకోలేని వారిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత. 
* దేశ సంపద, అవకాశాలు, వనరులను అందరికీ సమానంగా పంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలమీద ఉంది. 
* దేశంలో మొట్టమొదటి సారి పేదలకు సంపద పంచే ఆలోచన వైయస్సార్ చేశారు.
* పేదవాడి బిడ్డ కష్టపడి చదివి ఇంజనీరింగ్ సీటు సంపాదిస్తే తల్లిదండ్రులు ఫీజులకు భయపడేవారు. 
* నేను చదివిస్తాను, ఏం కావాలంటే అది చదవాలంటూ ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రారంభించిన వైయస్సార్. అది సామాజిక న్యాయం.
* నాన్న రెండు అడుగులేస్తే నేను నాలుగు అడుగులు వేస్తానన్న జగనన్న.
* ఆరోగ్యశ్రీలో నాడు వెయ్యి జబ్బులు ఉంటే నేడు మూడున్నర వేల జబ్బులను చేర్చిన సీఎం జగన్.
* కరోనాని ఎదుర్కోవడంలో ఏపీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పని చేసిందని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. 
* నియోజకవర్గంలో పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పంచే అవకాశం నాకు దక్కింది.
* కాలువ కట్టల మీద ఇళ్లు పీకేస్తారని ప్రజలు భయాందోళనలకు గురైతే వారికి విద్యుత్, తాగునీటి వసతి కల్పించి భరోసా ఇచ్చాం. 
* పేదవాడికి జీవితం మీద భరోసా కల్పించడం కూడా అభివృద్ధే.
* నియోజకవర్గంలో రూ.1,763 కోట్లు ఆర్థిక సాయం అందింది.
* 75 శాతం రోడ్లను నిర్మించుకున్నాం. కంకిపాడులో గొడవర్రు రోడ్డు, మెయిన్ రోడ్డు వేయించిన ఘనత మనదే. 
* బీజేఆర్ నగర్‌లో ఎస్సీ కాలనీకి రోడ్డు ప్రారంభించాం. సొంత నిధులు ఖర్చుపెట్టి రోడ్డు పూర్తి చేశాం. 
* ముస్లింలకు 3 షాదీఖానాలు నిర్మించాం. ఉయ్యూరులో ఏసీ షాదీఖానా నిర్మించాం. 

ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
* నాలుగున్నరేళ్ల తర్వాత చెప్పినవన్నీ చేసి చూపించి సంబరాలు చేసుకుంటున్నాం. 
* గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కరివేపాకుగా వాడుకొని ఓటు బ్యాంకుగా చూసేవారు. 
* జగనన్న వచ్చిన తర్వాత పేద పిల్లలకు ఉన్నత విద్య అందిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రమే. 
* చంద్రబాబు డబ్బులు ఎలా సంపాదించాలి, కాంట్రాక్టర్ల నుంచి ఎలా దండుకోవాలని చూశారు.
* నాడు-నేడు ఆస్పత్రులు, స్కూళ్లు, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ట్యాబ్స్, ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేశారు. 
* కోటి రూపాయలైనా విదేశాల్లో చదివిస్తానంటున్నది జగనన్నమాత్రమే.
* పేదల పిల్లలకు ఇంగ్లీషు మీడియం తెచ్చిన ఏకైక సీఎం జగనన్న.
* ఆరోగ్యశ్రీతో వైద్యం అందిస్తున్నారు. మహిళా సాధికారత సాకారం చేశారు. 
* ఇది హక్కు.. బిక్ష కాదు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఉన్నతాధికారులు, నాయకులను మీ ఇంటికి పంపిస్తానన్న జగనన్న.
* లంచం, వివక్ష లేని వ్యవస్థను జగనన్న తయారు చేశారు. 
* చంద్రబాబు 600 హామీలిచ్చి 6 హామీలైనా నెరవేర్చారా?
* జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి అక్కచెల్లెమ్మ, చిన్న పిల్లలు కూడా చెబుతారు. 
* చంద్రబాబు మైనార్టీలకు మంత్రి పదవి లేదు. 
* ఈరోజు జగనన్న హయాంలో నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎం మైనార్టీలకు ఇచ్చారు. 
* మైనార్టీలకు వైయస్సార్ రిజర్వేషన్ ఇచ్చారు. జగనన్న ఫీజురీయింబర్స్‌మెంట్‌తో పాటు పథకాలు అందిస్తున్నారు. ఇంటి పట్టాలిచ్చారు. 
* రూ.24 వేల కోట్లు మైనార్టీల కోసం వెచ్చించిన జగనన్న.
* జగనన్న లాంటి మంచి నాయకుడిని కాపాడుకుందాం. ఈ ప్రభుత్వం మనందరి గురించి ఆలోచించే ప్రభుత్వం.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *