Best Web Hosting Provider In India 2024
Pindam OTT Release: ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులోకి వచ్చిన హారర్ చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. అంటే చాలా భయపెట్టే సినిమా అని. హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాకు సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. సలార్ ఫేమ్ ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించారు.
ట్రెండింగ్ వార్తలు
కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి పిండం చిత్రాన్ని నిర్మించారు. పిండం మూవీ డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. మిక్స్‌డ్ టాక్‌తో రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు మాత్రం బాగానే ఆదరించారని తెలుస్తోంది. పిండం ట్రైలర్‌తో మూవీపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలకు తగినట్లుగా సినిమా లేదని కొంతమంది అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే ఈ హారర్ మూవీ పిండం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది. పిండం మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. పిండం మూవీనీ న్యూ ఇయర్ కానుకగా వచ్చే ఏడాది అంటే 2024 జనవరి మొదటి వారంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
పిండం ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు దాదాపు కన్ఫర్మ్ అయి, అందుకు తగిన డీల్, ఏర్పాట్లు జరిగాయని సమాచారం. అంటే, 2023లో బాగా భయపెట్టిన చిత్రంగా వచ్చిన పిండం మూవీ 2024లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే పిండం మూవీని ప్రస్తుతంతోపాటు 1990, 1930 లలో.. ఇలా మూడు కాలక్రమాలలో జరిగిన కథగా తెరకెక్కించారు.