Best Web Hosting Provider In India 2024
Salaar 8 Days Box Office Collection: క్రిస్మస్తో సహా లాంగ్ వీకెండ్‌కు ముందే విడుదలైన ప్రభాస్ ‘సలార్: పార్ట్ వన్ సీజ్ ఫైర్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. న్యూ ఇయర్‌కు ముందున్న రోజులైన గురువారం వసూళ్లు పడిపోయినప్పటికీ, శుక్రవారం మాత్రం రూ.10 కోట్లు రాబట్టగలిగింది.
ట్రెండింగ్ వార్తలు
ఇండస్ట్రీ నివేదికల ప్రకారం, సలార్ చిత్రం విడుదలైన ఎనిమిది రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దేశీయ మార్కెట్లో రూ. 318 కోట్లు వసూలు చేసింది. థియేటర్లలో ఎనిమిదో రోజు ఈ చిత్రం రూ.10 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్లు ప్రముఖ ట్రేడింగ్ సంస్థ Sacnilk అంచనా వేసింది.
సలార్ మూవీ 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.5 కోట్ల రేంజ్లో వసూళు కలెక్ట్ చేసిందని టాక్. హిందీలో రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. కర్ణాటక, తమిళ్, కేరళ, ఓవర్సీస్లో మొత్తంగా రూ. 5 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ తెచ్చుకుంది. ఓవరాల్‌గా 8వ రోజు 10 కోట్ల వరకు వసూలు చేసింది.
సలార్ మూవీకి 8 రోజుల్లో ఇండియావ్యాప్తంగా రూ. 318 కోట్లు గ్రాస్ రాగా.. వరల్డ్ వైడ్‌గా రూ. 550 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభాస్ రూ. 550 కోట్ల సింహాసనంపై కూర్చున్నట్లు అయింది. ఇక 500 కోట్ల క్లబ్లో మూడు సార్లు చేరిన ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. తర్వాత రెండో స్థానంలో రూ. 800 కోట్లతో రోబో 2.O, రూ. 650 కోట్లతో జైలర్ రెండు చిత్రాలతో రజనీకాంత్ ఉన్నారు.
సలార్‌కు డే ప్రకారం వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్:
సలార్ డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 97.49 కోట్లు (షేర్), రూ. 167 కోట్లు (గ్రాస్)
సలార్ డే 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 45.78 కోట్లు (షేర్), రూ. 84.15 కోట్లు (గ్రాస్)
సలార్ డే 3 వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 42.40 కోట్లు (షేర్), రూ. 78.85 కోట్లు (గ్రాస్)
సలార్ డే 4 వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 36.50 కోట్లు (షేర్), రూ. 68.50 కోట్లు (గ్రాస్)
సలార్ డే 5 వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 18.80 కోట్లు (షేర్), రూ. 36.20 కోట్లు (గ్రాస్)
సలార్ డే 6 వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 12.80 కోట్లు (షేర్), రూ. 27.50 కోట్లు (గ్రాస్)
సలార్ డే 7 వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 13.47 కోట్లు (షేర్), రూ. 27.50 కోట్లు (గ్రాస్)
ఇది కూడా చదవండి: పఠాన్, జవాన్ లేదా డన్కీ?
హోంబలే ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయాలని భావించిన షారుఖ్ ఖాన్ డిసెంబర్ 22కి వాయిదా వేశారు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, మధు గురుస్వామి కీలక పాత్రలు పోషించారు. రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో 14 భారీ సెట్స్ వేస్తున్నారు.