Guppedantha Manasu January 2nd Episode: మ‌ళ్లీ ఒక్క‌టైన రిషిధార‌లు- రౌడీల‌ను చిత‌క్కొట్టిన‌ వ‌సు- భ‌ద్ర‌కు క్లాస్‌

Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu January 2nd Episode: వ‌సుధార‌కు ఫోన్ చేస్తాడు రిషి. భ‌ర్త గొంతు విని వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది. కానీ తాను రిషితో ఫోన్ మాట్లాడ‌టం శైలేంద్ర వింటుండ‌టంతో వ‌సుధార మాట మారుస్తుంది. కాలేజీకి సంబంధించిన ఫోన్ కాల్ మాట్లాడుతున్న‌ట్లుగా శైలేంద్ర‌ను న‌మ్మిస్తుంది. శైలేంద్ర వెళ్లిపోగానే రిషికి ఫోన్ చేసి అత‌డి ద‌గ్గ‌ర‌కు బ‌య‌లుదేరుతుంది. త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తోన్న విష‌యం ఎవ‌రికి చెప్పొద్ద‌ని వ‌సుధార‌తో అంటాడు రిషి.

 

ట్రెండింగ్ వార్తలు

శైలేంద్ర అనుమాన‌ం…

రిషితో ఫోన్ మాట్లాడిన వ‌సుధార హ‌డావిడిగా కాలేజీ నుంచి బ‌య‌లుదేరుతుంది. వ‌సుధార‌ను వెతుక్కుంటూ ఆమె క్యాబిన్‌లోకి ఫ‌ణీంద్ర‌, మ‌హేంద్ర వ‌స్తారు. అక్క‌డ వారికి వ‌సుధార క‌నిపించ‌దు. వ‌సుధార బ‌య‌ట‌కు వెళ్లింద‌ని, ఎక్క‌డికి వెళ్లిందో త‌న‌కు చెప్ప‌లేద‌ని అటెండ‌ర్ అంటాడు.

అత‌డి మాట‌ల‌ను విన్న శైలేంద్ర‌…రిషి గురించి వ‌సుధార‌కు ఏదో ఇన్ఫ‌ర్మేష‌న్ తెలిసే ఉంటుంద‌ని అనుమాన‌ప‌డ‌తాడు. ఎండీ క్యాబిన్‌లో రిషి ఛైర్ చూసి అత‌డిని గుర్తుచేసుకొని మ‌హేంద్ర ఎమోష‌న‌ల్ అవుతాడు. అత‌డిని ఫ‌ణీంద్ర ఓదార్చుతాడు.

భ‌ద్ర‌కు క్లాస్‌…

వ‌సుధార‌ను అనుక్ష‌ణం ఫాలో క‌మ్మ‌ని భ‌ద్ర‌కు చెబుతాడు శైలేంద్ర‌. కానీ వ‌సుధార బ‌య‌ట‌కు వెళ్లిన భ‌ద్ర మాత్రం కాలేజీలోనే క‌నిపించ‌డంతో అత‌డిపై శైలేంద్ర ఫైర్ అవుతాడు. ప‌నిమీద దృష్టిపెట్ట‌మ‌ని వార్నింగ్ ఇస్తాడు. వ‌సుధార కాలేజీలో లేద‌నే విష‌యం నువ్వు నాకు చెప్పాల్సింది పోయి నేను నీకు చెప్పాల్సివ‌స్తుంద‌ని భ‌ద్ర‌కు క్లాస్ పీకుతాడు శైలేంద్ర‌.

వ‌సుధార ఫోన్ మాట్లాడి ఎవ‌రికి చెప్ప‌కుండా వెళ్లిందంటే రిషిని క‌ల‌వ‌డానికే వెళ్లి ఉంటుంద‌ని శైలేంద్ర అంటాడు. వ‌సుధార ఎక్క‌డికి వెళ్లిందో తెలుసుకొమ్మ‌ని ఆర్డ‌ర్ వేస్తాడు. ఒక‌వేళ వ‌సుధార‌…రిషి క‌లిసి క‌నిపిస్తే ఇద్ద‌రిని అక్క‌డే చంపేయ‌మ‌ని భ‌ద్ర‌తో అంటాడు శైలేంద్ర‌. వ‌సుధార ఒంట‌రిగా క‌నిపించినా ఆమెను చంపిన త‌ర్వాతే త‌న ద‌గ్గ‌ర‌కు ర‌మ్మ‌ని గ‌ట్టిగా చెబుతాడు.

 

ఫాలో అయిన రౌడీలు…

రిషిని వెతుక్కుంటూ పెద్ద‌య్య‌ చెప్పిన చోటికి వ‌స్తుంది వ‌సుధార‌. కానీ పెద్ద‌య్య ద‌గ్గ‌ర ఫోన్ లేక‌పోవ‌డంతో అత‌డి అడ్రెస్ తెలుసుకోవ‌డం వ‌సుధార‌కు క‌ష్టంగా మారుతుంది. పెద్ద‌య్య త‌న‌తో మాట్లాడిన నంబ‌ర్‌కు కాల్‌ చేస్తుంది. అది ఓ షాప్ ఓన‌ర్ నంబ‌ర్ కావ‌డంతో అత‌డిని పెద్ద‌య్య అడ్రెస్ అడుగుతుంది. అత‌డు కూడా త‌న‌కు పెద్ద‌య్య అడ్రెస్ తెలియ‌ద‌ని అంటాడు.

పెద్ద‌య్య కోసం వ‌సుధార షాప్ వ‌ద్ద వెయిట్ చేయ‌డం రౌడీలు క‌నిపెడ‌తారు. షాప్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన పెద్ద‌య్య‌… వ‌సుధార‌తో మాట్లాడ‌టం రౌడీలు చూస్తారు. రిషి త‌న ద‌గ్గ‌రే ఉన్నాడ‌ని, నీ గురించే ప‌దే ప‌దే క‌ల‌వ‌రిస్తున్నాడ‌ని వ‌సుధార‌తో అంటాడు పెద్ద‌య్య‌. వ‌సుధార‌ను తీసుకొని త‌న ఇంటికి బ‌య‌లుదేరుతాడు పెద్ద‌య్య‌. వారిని సీక్రెట్‌గా రౌడీలు ఫాలో అవుతుంటారు.

రిషి టెన్ష‌న్‌…

వ‌సుధార‌, పెద్ద‌య్య చాలా స‌మ‌య‌మైనా రాక‌పోవ‌డంతో రిషి టెన్ష‌న్ ప‌డ‌తాడు. వ‌సుధార‌ను వెతుక్కుంటూ తానే బ‌య‌ట‌కు వెళ్లాల‌ని అనుకుంటాడు.కానీ ఓపిక లేక‌పోవ‌డంతో బెడ్‌పై నుంచి లేవ‌లేక‌పోతాడు. రౌడీలు త‌మ‌ను ఫాలో అవుతోన్న విష‌యం వ‌సుధార క‌నిపెడుతుంది. వారికి క‌నిపించ‌కుండా దాక్కుంటుంది.

అక్క‌డే ఉన్న క‌ర్ర‌తో రౌడీ త‌ల‌పై ఒక్క‌టి గ‌ట్టిగా కొడుతుంది. రౌడీ బాధ‌తో విల‌విల‌లాడుతుండ‌టంతో అత‌డికి దొర‌క్కుండా అక్క‌డి నుంచి త‌ప్పించుకుంటుంది. రౌడీల క‌న్నుగ‌ప్పి రిషిని క‌లుస్తుంది. రిషిని చూడ‌గానే వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది. క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. రిషి గుండెల‌పై వాలిపోతుంది. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *