Best Web Hosting Provider In India 2024
Andole Ex Mla Kranthi: అందోల్ నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి దామోదర్ అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలతో అభివృద్ధి పనులు ఆపేయాలని ఆదేశించడం సరికాదన్నారు. ఈ విషయమై సంగారెడ్డి ఐబీలో మంగళవారం మీడియాతో మాట్లాడిన క్రాంతికిరణ్.. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి దామోదర్ తీరును తప్పుబట్టారు.
ట్రెండింగ్ వార్తలు
తమ హయంలో అందోల్ నియోజవర్గంలోని R&B, పంచాయతీ రాజ్, PMGY కింద పలు గ్రామాలకు రోడ్ల నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్ రావు సహకారంతో 60 కోట్లు, మరో 30 కోట్ల SDF సీడీపీ నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.
అయినా మంత్రి దామోదర్ రాజానర్సింహా ఆ పనులన్నీటిని ఆపాలని ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. కరోనా పరిస్థితులు ఉన్నా అందోల్ లో రోడ్ల పరిస్థితి ప్రభుత్వానికి వివరించి తాను సుమారు 60 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. రాజకీయాలు చేయాలి అనుకుంటే చేయాలని, కుట్రలతో నిధులు మంజూరైన రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు ఆపేయాలని ఆదేశించడం సరి కాదన్నారు.
ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి…
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో నియోజక వర్గంలో నిధులు మంజూరై పూర్తి కావాల్సిన అందోల్ మండలంలోని 5, పుల్కల్‌లో 6, వట్పల్లిలో 8, అల్లాదుర్గంలో 8, టేక్మాల్ లో మరి కొన్ని రోడ్ల పనులు, అందోల్ జోగిపేట మున్సిపాలిటీలో మరికొన్ని అభివృద్ధి పనులు ఆగిపోయాయని గుర్తు చేశారు.
ఎవరైనా అభివృద్ధిని కోరుకుంటారు గాని జరగాల్సిన అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని మంత్రి దామోదర్ ను ప్రశ్నించారు. రాజకీయ కక్ష్య సాధింపుతో అందోల్ అభివృద్ధిని అడ్డుకోవాలనుకోవడం సరికాదన్నారు.
దామోదరకు చిత్తశుద్ధి ఉంటే…ఆందోల్ నియోజకవర్గంలో SDF, CDP నిధులతో అభివృద్ధి పనులు ఇప్పుడే మొదలు పెట్టాలన్నారు. 80 శాతం వరకు గ్రామాల్లో సీసీ రోడ్లు వేయించామని.. వాటిలో కొన్ని టెండర్లు కూడా పూర్తి అయ్యాయి..మరికొన్ని పనులు నడుస్తున్నాయన్నారు. ఈ పనులన్నింటిని వెంటనే ప్రారంభించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేయాలనీ కోరారు.
అందోల్ అభివృద్ధి పై చిత్తశుద్ధి ఉంటే ఈ పనుల కోసం బిఆరెస్ ఆధ్వర్యంలో మంజూరు అయిన 60 నుంచి 90 కోట్ల నిధులు సరిపోకపోతే.. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మరిన్ని నిధులు మంజురు చేయించి రోడ్లు ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. అందోల్ అభివృద్ధి కోసం రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధి కి సహకరిస్తామన్నారు.