Best Web Hosting Provider In India 2024
Hanuman Sree Ramadhootha Stotram: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న హనుమాన్ మూవీ నుంచి శ్రీరామదూత స్తోత్రం బుధవారం (జనవరి 3) రిలీజైంది. తేజ సజ్జా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఈ స్తోత్రం గూస్బంప్స్ తెప్పిస్తోంది. గౌరహరి దీనికి మ్యూజిక్ అందించాడు.
ట్రెండింగ్ వార్తలు
హనుమాన్ మూవీ నుంచి వచ్చిన ఈ స్తోత్రాన్ని సాయి చరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదర, హర్షవర్దన్ చావలి పాడారు. హనుమంతుడి శౌర్యాన్ని, శక్తి సామర్థ్యాలను 3డీ ఇమేజ్‌ల రూపంలో ప్రదర్శిస్తూ ఈ స్తోత్రాన్ని రిలీజ్ చేయడం విశేషం. రం రం రం రక్తవర్ణం అంటూ సాగే ఈ స్తోత్రం ఎంతో గంభీరంగా అనిపిస్తుంది. ఈ స్తోత్రానికి మ్యూజిక్ హైలైట్ అని చెప్పొచ్చు.
ఈ హనుమాన్ మూవీకి గౌరహరితోపాటు అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. హనుమాన్ మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతోంది. అంతకుముందే ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ, తన సినిమాటిక్ యూనివర్స్ గురించి ఈ మధ్యే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వివరించాడు.
ఈ హనుమాన్ స్టోరీపై వస్తున్న పుకార్లకు అతడు చెక్ పెట్టాడు. ఇందులో తేజ సజ్జాది ఓ సాధారణ వ్యక్తి పాత్రే అని, అయితే తనకు వచ్చిన హనుమాన్ సూపర్ పవర్ తో తన ఊరిని, ప్రపంచాన్ని ఎలా కాపాడతాడన్నదే సినిమా స్టోరీ అని అన్నాడు. అంతేకాదు తన సినిమాటిక్ యూనివర్స్ లో హిందూ దేవతలే సూపర్ హీరోలుగా 12 సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలిపాడు.
హనుమాన్ నుంచి ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వస్తోంది. అయితే గుంటూరు కారం, ఈగల్ లాంటి సినిమాల నుంచి హనుమాన్ కు పోటీ ఎదురుకానుంది.