Best Web Hosting Provider In India 2024
మనం రోజూ తీసుకునే ఆహారంలో కరివేపాకును తప్పనిసరిగా చేర్చుకుంటే శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. నిజానికి దక్షిణ భారతదేశంలో కరివేపాకులను రోజువారీ వంటలకు ఉపయోగిస్తారు. ఈ కరివేపాకు ఆహారానికి మంచి వాసన, రుచిని ఇస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కర్రీలో వేసుకుని తినేందుకు కొందరు ఇష్టపడరు. అందుకే టీ చేసుకుని తాగండి.
ట్రెండింగ్ వార్తలు
కర్రీలో వేసుకుని కరివేపాకు తినాలనిపించకుంటే.. కరివేపాకుతో టీ తాగితే అందులోని పోషకాలు అందుతాయి. మన ఆరోగ్యం బాగుపడుతుంది. పూర్వ కాలంలో కొన్ని అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు కరివేపాకుతో టీ తయారు చేసేవారు. దీనిని తయారు చేయడం కూడా సులువే.
కరివేపాకు టీ తయారు చేయడం ఈజీనే. ముందుగా కొన్ని కరివేపాకులను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఓ గిన్నెలో నీళ్లు పోసి అందులో కరివేపాకు వేయాలి. తర్వాత మూతపెట్టి అరగంట మరిగించాలి. అనంతరం వడకట్టి, రుచికి సరిపడా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి.
కరివేపాకు టీని ఉదయంపూట ఖాళీ కడుపుతో తాగితే చాలా మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కరివేపాకు టీ తాగవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. కొవ్వును కరిగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కరివేపాకు టీలో బీటా కెరోటిన్, ప్రోటీన్లు ఉంటాయి. చుండ్రు, జుట్టు రాలడం మొదలైన సమస్యలకు ఇది మేలు చేస్తుంది.
కరివేపాకు కడుపు నొప్పిని నియంత్రిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. గర్భిణీలు కరివేపాకు టీ తాగడం వల్ల వాంతులు, వికారం, ఉదయాన్నే అలసట వంటి సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంది. ఈ టీ తాగే ముందు ఒకసారి డాక్టర్ అనుమతి తీసుకోండి. ఎందుకంటే మీ శరీరానికి ఇది సరిపోతుందో లేదో తెలుసుకోవాలి.
కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ ఎంతో ఉపయోగపడతాయి. శరీరం బరువు పెరగకుండా నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సాయపడతాయి. బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంటే. కరివేపాకు టీని తాగండి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగిన సమ్మేళనాలు ఉంటాయి. కరివేపాకులో లినోలోల్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ప్రత్యేకమైన సువాసనను ఇస్తుంది. బ్యాక్టీరియాను చంపగలదు.
జుట్టు పోషణకు కరివేపాకుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కరివేపాకు టీ తాగడం వలన జుట్టు ఆరోగ్యం ఉంటుంది. జుట్టు కుదుళ్ల నుంచి బలోపేతం అవుతుంది.