Animal OTT: ఓటీటీలోకి యానిమల్ మూవీ.. అనుకున్న టైమ్ కంటే ముందుగానే.. ఆ ఫెస్టివల్‌కు రిలీజ్

Best Web Hosting Provider In India 2024

Animal OTT Streaming Date: అర్జున్ రెడ్డి మూవీతో తానెంత బోల్డ్ డైరెక్టరో చూపించాడు సందీప్ రెడ్డి వంగా. 3 గంటల 6 నిమిషాల నిడివితో అర్జున్ రెడ్డి తెరకెక్కించి సెన్సేషనల్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి ఇటీవల ఏకంగా 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌తో యానిమల్ మూవీని తీసుకొచ్చాడు. మూడున్నర గంటల సినిమాతో కూడా హిట్ కొట్టి మరోసారి తన మార్క్ ఏంటో చూపించాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పుడు సలార్ ఫీవర్ నడుస్తోంది కానీ, మొన్నటివరకు అంతా యానిమల్ హవా నడుస్తోంది. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమాకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం మోత మోగిపోయింది. యానిమల్ మూవీలోని బీజీఎమ్, సాంగ్స్, సీన్స్, స్క్రీన్ ప్లేపై ప్రశంసలు కురిపిస్తూ మీమ్స్, వీడియోలు తెగ ఆకట్టుకున్నాయి.

యానిమల్ మూవీ వరల్డ్ వైడ్‌గా మొత్తంగా రూ. 840 కోట్లు కలెక్ట్ చేసినట్లు టాక్. ఇక యానిమల్ ఓటీటీ కోసం ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో యానిమల్ ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. మొన్నటివరకు యానిమల్ మూవీని జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వచ్చింది. కానీ, ఆ టైమ్ కంటే ముందుగా ఓటీటీలోకి రిలీజ్ చేయనున్నారని సమాచారం.

యానిమల్ మూవీని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 15 నుంచి సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. కానీ, ఇదే డేట్ దాదాపు ఫిక్స్ అని సోషల్ మీడియా టాక్. ఒకవేళ ఇదే టైమ్‌కి రిలీజ్ అయితే.. థియేటర్లలో స్టార్ హీరోల సినిమాల కంటే ఓటీటీలో యానిమల్ మూవీ చూసే సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024