Best Web Hosting Provider In India 2024
Money Heist Prequel Berlin OTT Streaming: ఓటీటీ లవర్స్‌కు మనీ హెయిస్ వెబ్ సిరీస్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ సిరీస్‌ను ఇష్టపడని వారుండరు. రాబరీ నేపథ్యంతో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ స్పానిష్ వెబ్ సిరీస్‌కు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన అన్ని సిరీస్‌లు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి కొత్త సిరీస్ బెర్లిన్ (Berlin Web Series) వచ్చేసింది.
ట్రెండింగ్ వార్తలు
మనీ హెయిస్ట్ సిరీసులో చూపించే దొంగతనాల వెనుక ఫ్రొఫెసర్, అతని సోదరుడు బెర్లిన్ ఇద్దరూ మాస్టర్ మైండ్స్ ఉంటారు. వీరిలో ఇద్దరికి సూపర్ క్రేజ్ వచ్చింది. అలాంటి క్యారెక్టర్లలో ఒకటైన బెర్లిన్ మనీ హెయిస్ట్ కంటే ముందు ఏం చేసేవాడు?, ఆయన చేసిన దొంగతనాలు, దోపిడీలు ఏంటీ? అనే స్టోరీ లైన్‌తో బెర్లిన్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా బెర్లిన్ వెబ్ సిరీస్‌లోను మొదటి ఎపిసోడ్‌ను డిసెంబర్ 29, 2023న విడుదల చేశారు. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కోటి సుమారు 50 నిమిషాల వ్యవధితో ఉండి దాదాపుగా 7 గంటల రన్ టైమ్‌తో బెర్లిన్ సిరీస్ ఉంది. బెర్లిన్ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
సిరీసులో బెర్లిన్ లవర్ బాయ్‌లా ఉండి మూడు లవ్ స్టోరీస్, దోపిడీలతో సాగుతుంది. ఆక్షన్ హౌజ్‌లో బంగారు ఆభరణాలు, పారిస్ ఆక్షన్ హౌజ్‌లో 44 మిలియన్ యూరోలా ఆభరణాలు వంటివి కొట్టేయడం ఆకట్టుకుంటున్నాయని టాక్. కాగా బెర్లిన్ పాత్రలో పెడ్రో అలోన్సో అద్భుతంగా నటించాడు.
ఇక సమంత సిక్వోరోస్, ట్విస్టన్ ఉల్లోవా, మిచెల్ జెన్నర్, బెగోనా వర్గాస్, జూలియో పెనా ఫెర్నోండోజ్, జోయెల్ శాంఛైజ్ కీలక పాత్రలు పోషించారు. ఓటీటీలో ప్రస్తుతం దూసుకుపోతోన్న ఈ బెర్లిన్ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్‌లోని అన్ని ఎపిసోడ్స్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి.