
Best Web Hosting Provider In India 2024

Kiss Movie: చిన్న సినిమాలతో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన కొంతమంది ముద్దుగుమ్మలు మంచి క్రేజ్ సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రీతి అస్రాని ఒకరు. మిన్నాలే అనే సీరియల్‌తో పాపులర్ అయిన ప్రీతి అస్రాని తెలుగు తెరకు గుండెల్లో గోదావరి మూవీతో పరిచయమైంది. అనంతరం వచ్చిన మళ్లీ రావా మూవీలో బాలనటిగా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది ప్రీతి.
ట్రెండింగ్ వార్తలు
ఇక ప్రెషర్ కుక్కర్ మూవీతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ప్రీతి అస్రానికి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అయితే, ఈ సినిమా తర్వాత ప్రీతికి పెద్దగా అవకాశాలు రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి కుమారుడు సింహా హీరోగా చేసిన దొంగలున్నారు జాగ్రత్త మూవీలో హీరోయిన్గా నటించింది. కానీ, ఇది అనుకున్నంత హిట్ కాలేదు.
11 అవర్స్ అనే వెబ్ సిరీసులో సైతం ఆకట్టుకునే నటనతో అలరించింది ప్రీతి అస్రాని. ఇటీవలే తమిళ సినిమా అయోతిలో తన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇస్లాం మతానికి చెందిన యువతిగా హీరో శశికుమార్‌కు జోడీగా నటించింది. ఈ సినిమాకు గాను చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది ప్రీతి.
యాక్టింగ్, సినిమాలు బాగున్న పెద్దగా అవకాశాలు రాని ప్రీతి అస్రానీకి హీరోయిన్గా మరో ఛాన్స్ వచ్చింది. దాదా వంటి హిట్ మూవీ కొట్టిన కవిన్ హీరోగా తెరకెక్కుతున్న కిస్ అనే మూవీలో ప్రీతి అస్రాని హీరోయిన్గా సెలెక్ట్ అయిందని టాక్. సతీష్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అంటే, కిస్ అనే రొమాంటిక్ మూవీలో హీరో కవిన్‌తో ప్రీతి రొమాన్స్ చేయనుందని తెలుస్తోంది.
టాపిక్