Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu January 3rd Episode: రిషితో ఫోన్లో మాట్లాడిన వసుధార అతడిని కలవడానికి బయలుదేరుతుంది. ఆమెను సీక్రెట్‌గా రౌడీలు ఫాలో అవుతుంటారు. ఆ విషయం గమనించిన వసుధార రౌడీలకు మస్కా కొట్టి రిషిని కలుస్తుంది.గాయాలతో లేవలేని స్థితిలో ఉన్న రిషిని చూడగానే వసుధార ఎమోషనల్ అవుతుంది.
ట్రెండింగ్ వార్తలు
రిషి గుండెలపై వాలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మిమ్మల్ని ఇలా చూడటం బాధను కలిగిస్తుందని అంటుంది. అన్ని రోజులు మనవిగా కాదుకదా. మన టైమ్ కానప్పుడు వైభవం, పేరు అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. మామూలు మనిషిగా బతకాల్సివస్తుంది. అవన్నీ జీవితంలో భాగాలు అంటూ వసుధారను ఓదార్చుతాడు రిషి. నలుగురి బాగు కోరే మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని వసుధార అంటుంది.
వసుధార బాధ…
ఇన్నాళ్లు ఎక్కడున్నారో, ఏమైపోయారోనని చాలా భయపడ్డామని, బాధపడ్డామని రిషితో అంటుంది వసుధార. మహేంద్ర కూడా మీ మీద బెంగతో ఉన్నారు. మేము మిమ్మల్ని వెతకని చోటు లేదు. మీ ఆచూకీ గురించి మేము అడగని మనిషి లేడని రిషికి చెబుతుంది వసుధార.
ఎంత వెతికినా మీరు కనిపించలేదని అంటుంది. మీరు కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని రిషితో చెబుతుంది. రిషి కనిపించకుండా పోయిన తర్వాత ఏం జరిగిందో మొత్తం అతడికి వివరిస్తుంది వసుధార. చివరకు హాస్పిటల్లో డెడ్ బాడీ మీదే అని కంగారుపడి కన్నీళ్లతో కుప్పకూలిపోయానని చెబుతుంది.
కాలేజీకి వెళ్లలేదు…
మీరు కనిపించకుండా పోయిన తర్వాత ఎవరికి కాలేజీకి సరిగా వెళ్లడం లేదని, బోర్డు మీటింగ్‌లకు హాజరుకావడం లేదని వసుధార అంటుంది. నేను కనిపించకుండా పోతేనే ఇంత జరిగిందా? ఒకవేళ నాకు ఏమైనా అయితే అంటూ రిషి అంటాడు. ఆ మాట అనొద్దంటూ రిషి నోరు మూస్తుంది వసుధార. మీరు మంచివారు. మీలాంటి వాళ్లకు ఏం కాదు. మీకు ఏం కాకుండా నేను చూసుకుంటానని వసుధార.
రిషిని కాపాడిన పెద్దయ్య, పెద్దమ్మలకు చేతులెత్తి దండం పెడుతుంది వసుధార. అసలు రిషి కిడ్నాప్ ఎలా అయ్యాడో తెలుసుకోవాలని వసుధార అనుకుంటుంది. అదే ప్రశ్నను రిషిని అడుగుతుంది. కానీ అప్పుడే రిషి నొప్పితో విలవిలలాడుతాడు. దాంతో రిషిని తైలం రాస్తుంది వసుధార.
అనుపమ ఓదార్పు…
మహేంద్రను భోజనం చేయమని అనుపమ అంటుంది. కానీ అతడు తిననని అంటాడు. రిషి కనిపించకుండా పోయాడు. అతడు ఎక్కడున్నాడో ఇంత వరకు తెలియలేదు. ఇప్పుడు వసుధార కూడా కనిపించడం లేదు. అసలు తను ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదని మహేంద్ర బాధపడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాను భోజనం ఎలా చేయగలనని అంటాడు.
ఇవన్నీ చూస్తుంటే ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపిస్తుందని ఎమోషనల్ అవుతాడు. రిషి కోసమే వసుధార వెళ్లి ఉంటుందని మహేంద్రకు ధైర్యం చెబుతుంది అనుపమ. నీకు తోడుగా నేను ఉన్నానని ధైర్యంతోనే వసుధార బయటకు వెళ్లి ఉంటుందని అనుపమ అంటుంది. నువ్వు ఇలా తినకుండా ఉంటే వాళ్లకు నేను ఏం సమాధానం చెప్పాలి.
నువ్వు ఇలా భోజనం చేయకుండా ఉంటానంటే మళ్లీ నీ కోసం ఇక్కడికి రానని అంటుంది. నువ్వు వెళ్లిన తర్వాత భోజనం చేస్తానని అనుపమతో అంటాడు మహేంద్ర. కానీ అతడు భోజనం చేయకుండా ఉంటాడనే రిషిపై ఒట్టు వేయించుకుంటుంది అనుపమ. దాంతో ఆ ఒట్టు కోసమైనా బాధను దిగమింగుకొని భోజనం చేస్తాడు మహేంద్ర.
రిషి ముఖంలో వెలుగు…
రిషి, వసుధారలను ఎలాగైనా పట్టుకోవాలని రౌడీలు నిర్ణయించుకుంటారు. మరోవైపు రిషికి తైలం రాస్తూ వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏడవద్దని వసును ఓదార్చుతాడు రిషి. ఆ తర్వాత రిషి గంజి తాగిస్తుంది వసుధార. నువ్వు ప్రేమగా గంజినీళ్లు తాగించావు.
నీ ప్రేమ నాకు చాలా ఎనర్జీని ఇచ్చిందని, నిన్ను చూడగానే నా మనసు తేలికైంది అని వసుధారతో అంటాడు రిషి. రిషిలో చాలా హుషారు వచ్చిందని పెద్దమ్మ అంటుంది. ఈ రోజు రిషి ముఖంలో చాలా వెలుగు కనిపిస్తుందని చెబుతుంది.
వసు కిడ్నాప్…
ఆ తర్వాత వసుధార చేయికడుక్కోవడానికి బయటకు వస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రౌడీలు వసుధారను కిడ్నాప్ చేస్తారు. వసుధారకు ఫోన్ రావడం ఇవ్వడానికి పెద్దమ్మ వస్తుంది. కానీ బయట వసుధార కనిపించకపోవడంతో ఆమె కంగారు పడుతుంది. రిషిని రౌడీలు ఎత్తుకుపోవడం గమనించిన పెద్దమ్మ ఆ విషయం రిషికి చెబుతుంది. వసుధారను ఎలాగైనా కాపాడాలని అనుకుంటాడు. కానీ నీరసంగా ఉండటంతో లేవలేకపోతాడు. వసుధార ఫోన్ అక్కడే ఉండటంతో మీకు తెలిసిన వారికి ఫోన్ చేసి వసుధారకు కాపాడమని చెప్పు అని రిషికి సలహా ఇస్తాడు పెద్దయ్య.
శైలేంద్ర ఆనందం…
వసుధారను కిడ్నాప్ చేసిన రౌడీలు ఆమెను కట్టిపడేస్తారు. ఆ విషయం శైలేంద్రకు ఫోన్ చేసి చెబుతారు. వారి మాటలను శైలేంద్ర నమ్మడు. దాంతో వీడియో కాల్ చేసి వసుధారను అతడికి చూపిస్తారు రౌడీలు. తను వచ్చే వరకు వసుధారను ఓ కంట కనిపెడుతూ ఉండమని రౌడీలను హెచ్చరిస్తాడు శైలేంద్ర. తన ప్లాన్ సక్సెస్ కావడంతో శైలేంద్ర హ్యాపీగా ఉంటాడు. వసుధారపై ఇన్నాళ్లకు పగ తీర్చుకునే అవకాశం దొరికిందని మనసులో అనుకుంటాడు. శైలేంద్ర అంటే ఏమిటో ఈ రోజు చూపిస్తానని అనుకుంటాడు.
కాలేజీ ఎండీగా…
శైలేంద్ర సంతోషంగా కనిపించడం చూసి ఏం జరిగిందని అడుగుతుంది దేవయాని. వసుధార నన్ను కొట్టిన చెంపదెబ్బకు, ఇన్నాళ్లకు నాకు చేసిన అవమానాలకు బదులు తీర్చుకోబోతున్నానని తల్లితో అంటాడు శైలేంద్ర. ఇక ఎండీ సీట్‌కు కూడా ఏ అడ్డు ఉండదని అంటాడు. నీ కొడుకును తొందరలోనే డీబీఎస్టీ కాలేజీ ఎండీగా చూస్తావని అంటాడు. కానీ వసుధారను కిడ్నాప్ చేసిన విషయం మాత్రం దేవయానికి చెప్పకుండా దాచిపెడతాడు.
ధరణి ప్రశ్నలు…
శైలేంద్ర బయటకు వెళ్లబోతుండగా ధరణి అడ్డుకుంటుంది. నేను మీతో వస్తానని అంటుంది. కానీ శైలేంద్ర వద్దని అంటాడు. తాను ఒక్కడినే వెళ్లాలని, అర్జెంట్ పని ఉందని అంటాడు. పోనీ మీతో పాటు అత్తయ్యనైనా తీసుకెళ్లండి. మీ గాయాలు పూర్తిగా తగ్గలేదని శైలేంద్రకు సలహా ఇస్తుంది ధరణి. నేను ఒంటరిగానే వెళ్లాలని తనతో పాటు ఎవరూ రావద్దని ధరణిపై కోప్పడుతాడు శైలేంద్ర. అంత ఇంపార్టెంట్ వర్క్ ఏమిటో చెప్పమని శైలేంద్రను అడుగుతుంది ధరణి. ఇది నీకు చెప్పేది కాదని, నన్ను విసిగించవద్దని బదులిస్తాడు శైలేంద్ర.
ఇలా అర్జెంట్ పని అని బయటకు వెళ్లిన ప్రతిసారి డిసపాయింట్ అవుతూ వస్తున్నారు. మీకు ఈ మధ్య అన్ని రివర్స్‌లో జరుగుతున్నాయి. ఇది కూడా అలాగే అవుతుందని అనిపిస్తుందని ధరణి అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ సారి అలా ఏం కాదు. కంగారు పడకుండా హ్యాపీగా కిచెన్‌లో నీ పని నువ్వు చూసుకోమని చెప్పి కోపంగా వెళ్లిపోతాడు శైలేంద్ర. అతడి వాలకం చూసి మళ్లీ ఏదో శైలేంద్ర ఏదో కొత్త ప్లాన్ వేశాడని ధరణి అనుమానపడుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.