
Best Web Hosting Provider In India 2024

AP AHA Exam Key : ఏపీ పశుసంవర్ధ శాఖలో 1896 సహాయకుల భర్తీ నియామక పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. ఈ కీపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 3వ తేదీలోగా తెలియజేయాలని పశుసంవర్ధక శాఖ తెలిపింది. త్వరలోనే తుది కీ, ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది. పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు డిసెంబర్ 31న రాత పరీక్ష నిర్వహించారు.
ట్రెండింగ్ వార్తలు
రైతు భరోసా కేంద్రాల్లో విధులు
ఈ రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు నియమిస్తారు. రాత పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే గోపాలమిత్ర, గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేసిన వారికి ప్రభుత్వం వెయిటేజీ కల్పిస్తుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.22,460 నుంచి రూ.72,810 వరకు జీతం చెల్లిస్తారు.
రాత పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక
ఏపీలో పశుసంవర్థక శాఖలో 1896 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి డిసెంబర్ 31న రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 1896 యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు పాలిటెక్నిక్ డిప్లొమా, ఇంటర్ ఒకేషనల్ కోర్సు, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి నవంబరు 20 నుంచి డిసెంబరు 12 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. రాత పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో రూ.15,000 జీతం ఇస్తారు. అనంతరం రూ.22,460 నుంచి రూ.72,810 వరకూ జీతం ఉంటుందని నోటిఫికేషన్ లో ప్రకటించారు.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో 102, తూర్పు గోదావరి జిల్లాలో 15, అనంతపురం జిల్లాలో 473, చిత్తూరు జిల్లాలో 100, కర్నూలు జిల్లాలో 252, కడప జిల్లాలో 210, గుంటూరు జిల్లాలో 229, కృష్ణా జిల్లాలో 120, నెల్లూరు జిల్లాలో 143, ప్రకాశం జిల్లాలో 177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు విశాఖపట్నం జిల్లాలో 28, విజయనగరం జిల్లాలో 13, శ్రీకాకుళం జిల్లాలో 34 పోస్టులు భర్తీ చేయనున్నారు.
26 డీడీవో పోస్టులు ఏర్పాటు
ఏపీ పంచాయతీరాజ్‌శాఖలో 26 డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్‌కు ఒక్కొక్కరు చొప్పున డీడీఓని నియమించింది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 26కు పెంచడంతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 77కు చేరాయి. దీంతో కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్లు… బొబ్బలి, పలాస, చీపురుపల్లి, చింతూరు, భీమునిపట్నం, తాడేపల్లిగూడెం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, రేపల్లె, సత్తెనపల్లి, కనిగిరి, పత్తికొండ, ఆత్మకూరు, డోన్, గుంతకల్, పుట్టపర్తి, బద్వేల్, పులివెందుల, రాయచోటి, నగరి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి కేంద్రాలకు డీడీవో పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.