Best Web Hosting Provider In India 2024
OTT Releases This Week: కొత్త ఏడాది 2024 వచ్చేసింది. ఈ నయా సంవత్సరం తొలి వారంలోనూ కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో రానున్నాయి. నాని హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ హాయ్ నాన్న, శివాజీ నటించిన నైంటీస్ వెబ్ సిరీస్ కూడా ఇదే వారంలో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాయి. మరిన్ని కూడా స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో ఇక్కడ చూడండి.
ట్రెండింగ్ వార్తలు
నెట్‌ఫ్లిక్స్
హాయ్ నాన్న: నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన హాయ్ నాన్న చిత్రం జనవరి 4వ తేదీన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీ, తండ్రీ-కూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన హాయ్ నాన్న థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు జనవరి 4న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తోంది.
కన్జ్యూరింగ్ కన్నప్పన్: తమిళ హారర్ మూవీ కన్జ్యూరింగ్ కన్నప్పన్.. జనవరి 5న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది.
- ఫూల్ మీ వన్స్ – సినిమా – నెట్‌ఫ్లిక్స్ – జనవరి 5
- గుడ్ గ్రీఫ్ – సినిమా – నెట్‌ఫ్లిక్స్ – జనవరి 5
- మ్యాన్ ఆన్ ది రన్ – డాక్యుమెంటరీ ఫిల్మ్ – నెట్‌ఫ్లిక్స్ – జనవరి 5
- సొసైటీ ఆఫ్ ది స్నో – సినిమా- నెట్‌ఫ్లిక్స్ – జనవరి 4
జీ5
తేజస్: బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన తేజస్ సినిమా జనవరి 5వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ చిత్రంలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా నటించారు కంగనా.
ఈటీవీ విన్
నైంటీస్ (90s) వెబ్ సిరీస్: సీనియర్ నటుడు, ఇటీవలే బిగ్‌బాస్ షో ఆడిన శివాజీ ప్రధాన పాత్ర పోషించిన నైంటీస్ వెబ్ సిరీస్.. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో జనవరి 5వ తేదీన స్ట్రీమింగ్కు రానుంది. 1990ల్లో మధ్య తరగతి కుటుంబం చుట్టూ ఈ సిరీస్ ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో
- ఫోయి – సినిమా – అమెజాన్ ప్రైమ్ వీడియో – జనవరి 5
- జేమ్స్ మే: ఔర్ మ్యాన్ ఇన్ ఇండియా – సిరీస్ – అమెజాన్ ప్రైమ్ వీడియో – జనవరి 5
ఆహా
బాయ్స్ హాస్టల్: స్టూడెంట్స్ కామెడీ థ్రిల్లర్ ‘బాయ్స్ హాస్టల్’ సినిమా జనవరి 5వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఆహాలో కూడా అడుగుపెట్టనుంది.
డిస్నీ+ హాట్‌స్టార్
పెరిల్లూర్ ప్రీమియల్ లీగ్ – మలయాళ సినిమా – డిస్నీ+ హాట్‌స్టార్ – జనవరి 5 (తెలుగు వెర్షన్ కూడా)
క్యుబికల్స్ సీజన్ 3 – వెబ్ సిరీస్ – సోనీ లివ్ – జనవరి 5
టాపిక్