
Best Web Hosting Provider In India 2024

Anakapalli news : అనకాపల్లి జిల్లా చోడవరం వసతి గృహాల్లో ఉంటూ చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 31న మందు పార్టీ చేసుకున్న ఘటన వైరల్ అవుతోంది. వసతి గృహం సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో విద్యార్థులు బిర్యానీ, మందు పార్టీ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చోడవరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 6, 7, 10 తరగతులకు చెందిన 16 మంది విద్యార్థులు డిసెంబరు 31న వసతి గృహం సమీపంలో మందు పార్టీ చేసుకున్నారు. వసతి గృహం గోడదూకి బయటకు వెళ్లిన విద్యార్థులు బయటి నుంచి వచ్చిన యువకులతో కలిసి సమీపంలో ఓ అపార్ట్‌మెంటు వద్ద మందు పార్టీ చేసుకున్నారు. విద్యార్థుల అల్లరికి బయటకు వచ్చిన స్థానికులు ఈ తతంగాన్ని వీడియో తీశాడు. మద్యం మత్తులో ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీస్తున్న వ్యక్తిపై దాడికి దిగారు.
ట్రెండింగ్ వార్తలు
వార్డెన్ ఏమన్నారంటే?
అయితే ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ చిన్నయ్య స్పందించారు. 31వ తేదీ రాత్రి పది గంటల వరకూ తాను హాస్టల్‌లోనే ఉన్నానని ఆ తర్వాత ఇంటికి వెళ్లానన్నారు. తాను హాస్టల్ నుంచి వెళ్లిన తరువాత విద్యార్థులు ఇలా చేసి ఉండవచ్చన్నారు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు ఇలా మందు పార్టీ చేసుకోవడం కలకలం రేపుతుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న విద్యార్థులు ఇలా చెడు వ్యసనాలకు అలవాటుపడడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. విద్యార్థి దశలోనే ఇలా చెడు అలవాట్ల వైపు దారిమళ్లడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. హాస్టల్ వార్డెన్ విద్యార్థులపై నిఘా పెట్టాలని కోరుతున్నారు.
స్కూళ్లు వైన్ షాపులయ్యాయ్
ఈ వీడియోను పోస్టు చేసిన టీడీపీ… జగన్ పాలనలో స్కూళ్లు వైన్ షాపులయ్యాయని విమర్శించింది. పిల్లలు వ్యసనపరులయ్యారని, జగన్ సొంత బ్రాండ్ల ప్రమాదకర మద్యం పాఠశాలల్లో చేరి విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తోందని ఆరోపించింది.