Best Web Hosting Provider In India 2024

తొమ్మిది మంది అర్జి దారులకు 13 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ
కలెక్టర్ చేతుల మీదుగా చెక్కులు అందుచేత …
కాకినాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కాకినాడ జిల్లా కాకినాడ పర్యటన సందర్భంగా పలువురులతో సమస్యలను వినడంతో పాటు తక్షణం వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లను ఆదేశించారు.
బుధవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 8 మంది అర్జి దారులకు లక్ష రూపాయలు చొప్పున 8 లక్షల రూపాయలు, ఒకరికి ఐదు లక్షల రూపాయలు మొత్తం 13 లక్షల రూపాయలు చెక్కులను కలెక్టర్ అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల వివరాలు తెలియ చేస్తూ, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.
ఆమేరకు సిఎం ను కలిసిన 8 మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున రూ.8 లక్షలు, ఒకరికి ఒకరికి ఐదు లక్షల రూపాయలు మొత్తం 13 లక్షల రూపాయల చెక్కులను అందచెయ్యడం జరిగిందన్నారు.
చెక్కులు అందుకున్న వారి వివరాలు..
మాస్టర్ జి. జయ సాయి వెంకట కిరణ్, 7 సంవత్సరాలు బాలుడు తండ్రి శ్రీనివాస్, గ్రామం సర్పవరం, కాకినాడ రూరల్ మండలం, కాకినాడ జిల్లా,
లక్ష రూపాయలు కిడ్నీ వ్యాధి చికిత్స కొరకు
కోట సత్య వెంకట సాయి జశ్విక్, 20 నెలల బాలుడు, తండ్రి నాగార్జున, వేములవాడ గ్రామం, కరప మండలం, కాకినాడ జిల్లా.. లక్ష రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం
3. జి సుష్మ శ్రీ , రెండు సంవత్సరాల బాలిక, కందరాడ గ్రామం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా,.. లక్ష రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం
4. పత్తికాయల డేవిడ్ రోషన్,17 సంవత్సరాలు, తండ్రి పి. శ్రీనివాస్, గాంధీనగర్, కాకినాడ అర్బన్, కాకినాడ జిల్లా
లక్ష రూపాయలు వైద్య సహాయం నిమిత్తం..
5. దూడ రవికుమార్ ( 22 సంవత్సరాలు )తండ్రి చిట్టిబాబు, కొనపాపపేట
యు కొత్తపల్లి మండల్ , కాకినాడ జిల్లా..
లక్ష రూపాయలు వైద్యసేవల నిమిత్తం.
6. గని శెట్టి రూపాలక్ష్మి రెండు సంవత్సరాలు బాలిక, కోలంక గ్రామం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా …
లక్ష రూపాయలు వైద్య సహాయం నిమిత్తం.
7. మర్రిపూడి విశ్వేశ్వరరావు, 41 సంవత్సరాలు, పురుషుడు, తండ్రి కృష్ణారావు, కాకినాడ, కాకినాడ జిల్లా ఐదు లక్షల రూపాయలు వైద్య సహాయం నిమిత్తం.
8. పటేలా కుష్మిత కుమారి మూడు సంవత్సరాల బాలిక, తండ్రి కులదీప్ కుమార్ కాకినాడ, కాకినాడ జిల్లా. లక్ష రూపాయలు వైద్య సహాయం నిమిత్తం.
9. గని శెట్టి కనకమహాలక్ష్మి, 11 సంవత్సరాల బాలిక ,కరప గ్రామం కరప మండలం, కాకినాడ జిల్లా.. లక్ష రూపాయలు ఆర్థిక సహాయం నిమిత్తం సహాయం.