Naa Saami Ranga: నా సామిరంగ నుంచి మరో పాత్ర రివీల్.. 80s ప్రేమకథ పరిచయం

Best Web Hosting Provider In India 2024

Naa Saami Ranga Bhaskar Glimpse: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం నా సామిరంగ. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే నా సామిరంగ నుంచి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ వదిలారు.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటికీ నా సామిరంగ నుంచి నాగార్జున, ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్ పాత్రలను పరిచయం చేస్తూ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. తాజాగా మరో పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. జనవరి 3న అంటే ఇవాళ నా సామిరంగ సినిమా నుంచి రాజ్ తరుణ్ పాత్రను పరిచయం చేశారు. ఇందులో రాజ్ తరుణ్ భాస్కర్‌గా కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన భాస్కర్ ఇంట్రో గ్లింప్స్ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియో గ్లింప్స్‌లో భాస్కర్ (రాజ్ తరుణ్), కుమారి (రుక్సార్ ధిల్లన్)ల 1980 నాటి ప్రేమకథని చాలా అందంగా పరిచయం చేశారు. అంటే రాజ్ తరుణ్‌తో పాటు మరో పాత్ర కుమారిగా చేసిన హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్‌ (Rukshar Dhillon) ఇంట్రో కూడా రిలీజ్ చేసి రివీల్ చేశారు నా సామిరంగ మేకర్స్. ఈ వీడియోలో భాస్కర్, కుమారి ప్రేమకథ 80వ కాలంలో జరిగినట్లుగా తెలుస్తోంది. కాలేజీలో ఈ ఇద్దరి ప్రేమ చిగురించినట్లుగా వీడియో ఉంది.

”మనసు ప్రేమించే వరకే బావుటుంది. ప్రేమించగానే అలోచించడం మానేస్తుంది. తనకోసం ఏదైనా చేసేయొచ్చు, ఏమడిగిన ఇచ్చేయొచ్చు అనిపిస్తది. అలా ఇచ్చినపుడు తన మొహం మీద వచ్చే చిరునవ్వు. అది చూసి మన మనసులో కలిగే ఆనందం. దాని కోసం పక్క ఊరి ప్రెసిడెంట్ గారి గోడ ఏంటి ? చైనా గోడ దూకిన తప్పు లేదు’ అంటూ రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్, దానికి అనుగుణంగా కాలేజీ నేపథ్యంలో చిత్రీకరించిన విజువల్స్ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో రాజ్ తరుణ్, రుక్సార్ జోడి చాలా అందంగా కనిపించింది. వారి వింటేజ్ స్టొరీస్ చాలా ప్లజెంట్‌గా మనసుని హత్తుకుంది. ఈ గ్లింప్స్ కు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఇచ్చిన నేపథ్య సంగీతం మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన నా సామిరంగ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అని తెలుస్తోంది. ప్రోమోస్ అన్నీ ప్రామిసింగ్‌గా ఆకట్టుకునేలా ఉన్నాయి.

కాగా నా సామిరంగ సినిమాను జనవరి 14న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఇకపోతే నా సామిరంగ సినిమాలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నా సామిరంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించారు. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024