![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/salaar-movie-_1704338616805_1704338617013.jpg)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/salaar-movie-_1704338616805_1704338617013.jpg)
Salaar Collections: ప్రభాస్ సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. 12 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 650 కోట్ల వసూళ్లను రాబట్టింది ఈ మూవీ. దేశవ్యాప్తంగా నాలుగు వందల కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్నది. కలెక్షన్స్ పరంగా పలు రికార్డులను బ్రేక్ చేసిన సలార్ తాజాగా మరో కొత్త రికార్డును నెలకొల్పింది. నైజాం ఏరియాలోనే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సలార్ మూవీ రాబట్టింది. పన్నెండు రోజుల్లో వంద కోట్ల గ్రాస్, 70 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నది.
ట్రెండింగ్ వార్తలు
బాహుబలి 2 తర్వాత…
బాహుబలి 2 తర్వాత నైజాం ఏరియాలో వంద కోట్లు కలెక్ట్ చేసిన ప్రభాస్ మూవీగా సలార్ చరిత్రను సృష్టించింది. బాహుబలి 2 మూవీ నైజాం ఏరియాలో 112 కోట్ల గ్రాస్, 68 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఫుల్ రన్లో నైజాం ఏరియాలో బాహుబలి 2 వంద కోట్ల మార్కును దాటగా… సలార్ మాత్రం 12 రోజుల్లోనే ఈ రికార్డును బ్రేక్ చేసింది.
సలార్ నైజాం ఏరియా రైట్స్‌ను దాదాపు 90 కోట్లకు మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నది. నైజం ఏరియాలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 95 కోట్ల వరకు ఉంది. ప్రస్తుతం 70 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. నైజాంలో బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో ఇరవై కోట్ల వరకు వసూళ్లు రావాల్సి ఉంది. సంక్రాంతి సినిమాల పోటీ నేపథ్యంలో నైజంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇవే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు సలార్ మూవీ 230 కోట్ల వరకు గ్రాస్‌ను 147 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. బుధవారం రోజు ఈ సినిమా ఏపీ, తెలంగాణలో కలిపి కోటి ఇరవై లక్షల వరకు వసూళ్లను రాబట్టింది.తెలుగు రాష్ట్రాల్లో సలార్‌కు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ నిర్వహించలేదు. అయినా ప్రభాస్ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
వరల్డ్ వైడ్‌గా 650 కోట్లు…
వరల్డ్ వైడ్‌గా సలార్ మూవీ 12 రోజుల్లో 650 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2023లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఫుల్ రన్లో సలార్ మూవీ 800 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఖన్సార్ అనే క్రైమ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఇద్దరు స్నేహితుల కథతో ఈ సినిమా తెరకెక్కింది.
ప్రభాస్ ఎలివేషన్స్, యాక్షన్‌కు పేరొచ్చిన కథలో మాత్రం కొత్తదనం లేదనే విమర్శలు వినిపించాయి. సలార్ సినిమాలో శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషించారు. సలార్‌కు శౌర్యంగపర్వం 2 పేరుతో సీక్వెల్ రాబోతోంది. సీక్వెల్‌కు సంబంధించి కథ సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ప్రభాస్ తెలిపాడు. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ప్రస్తుతం సలార్2తో పాటు కల్కి 2989 ఏడీ, మారుతితో ఓ హారర్ మూవీ చేస్తున్నాడు ప్రభాస్.