Krishna mukunda murari january 4th: శకుంతల ప్లాన్ తెలుసుకున్న భవానీ.. దేవ్ చేతి ఉంగరం చూసేసిన కృష్ణ

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial: శ్రీధర్ ని ఎవరి చంపి ఉంటారోనని కృష్ణ ఆలోచిస్తుంది. ముకుందతో మీ పెళ్లి చేయాలని పూనుకుంది పెద్దత్తయ్య కదా.. తను కాకుండా ఇంక ఎవరు ఉన్నారని కృష్ణ మురారితో అంటుంది. నేను అదే ఆలోచిస్తున్నా రాజ నర్స్ కొడుకుని ఇరికించాలని చూసారంటే వాళ్ళు ఎవరో మనకి బాగా తెలిసిన వాడే అయి ఉండాలి. మరోసారి బొమ్మ వేయాలని చెప్పి మనం శ్రీధర్ ని కలవాలని అనుకోగానే ఇలా జరిగిందంటే ఏంటి అర్థం. ఇంట్లో వాళ్ళే ఎవరైనా చేయాలని చూస్తున్నారేమో. మధుకర్ ఎందుకో దేవ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని అంటున్నాడు ఒకవేళ అతను ఏమైనా చేశాడేమోనని కృష్ణ చెప్తుంది.

ట్రెండింగ్ వార్తలు

భవానీని రెచ్చగొట్టిన ముకుంద

ఛాన్స్ లేదు శేఖర్ ని గుర్తు పట్టగలిగే వ్యక్తి పరిమళ, తనని చంపేస్తే ఇక టెన్షన్ ఉండదు కదా అంటాడు. ఎవరి నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదని అంటుంది. రింగ్ విషయం ఎవరికి చెప్పొద్దని మురారి చెప్తాడు. ముకుంద భవానీ దగ్గరకి వస్తుంది. ఈ పెళ్లి ఆగిపోతే మీ పరువు అని ముకుంద అంటే షటప్ అని భవానీ సీరియస్ అవుతుంది. అసలు నీ పెళ్లి ఆగుతుందని ఎందుకు అనుకుంటున్నావ్ జరిగి తీరుతుంది. ఈ నేరం పెద్దపల్లి ప్రభాకర్ చేయలేదని నువ్వు నమ్ముతున్నావా? మరి ఎందుకు పెళ్లి జరగదని భయపడుతున్నావని అడుగుతుంది.

దేవ్ ఇదంతా చేస్తున్నాడని తెలిస్తే అత్తయ్య మాత్రమే కాదు ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా నన్ను క్షమించరని మనసులో అనుకుంటుంది. నన్ను పెళ్లి చేసుకునే వాడు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేడు. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పెళ్లి రోజు పారిపోతే నా గతి ఏంటని అంటుంది. అంత భయం ఉన్నప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం ఎందుకు? వాడిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఎందుకని రేవతి ప్రశ్నిస్తుంది. నీ కొడుకు కృష్ణని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా అని భవానీ ప్రశ్నిస్తుంది. అప్పుడు కాకపోయినా ఇప్పుడు బాగున్నారు కదా అంటుంది. వీళ్ళు కూడా తర్వాత బాగుంటారులే అని భవానీ చెప్తుంది.

శకుంతల ప్లాన్ విని షాకైన భవానీ

పెళ్లి దగ్గర పడింది కదా అందుకే రేపు ఇద్దరికీ నలుగు పెట్టిద్దామని ఏర్పాటు చేసినట్టు భవానీ ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఎవరు ఎంత చెప్పినా కూడా భవానీ మాత్రం కృష్ణ వాళ్ళే దోషులని తెగేసి చెప్తుంది. రేవతి సర్ది చెప్పేందుకు చూస్తుంది కానీ భవానీ మాత్రం వినిపించుకోదు. శకుంతల కృష్ణ జీవితం గురించి ఆలోచిస్తూ బ్యాగ్ సర్దుకుంటుంది. అది చూసిన నందిని ఊరు వెళ్తున్నావా అని అడుగుతుంది. ఇక వచ్చేది లేదు నాతో పాటు కిట్టమ్మని అల్లుడిని కూడా తోలుకుపోతాను. అల్లుడికి ముకుందకి లగ్గం చేస్తున్నారు కదా దాన్ని ఆపడం ఆ దేవుడికి కూడా చేతకావడం లేదు. అందుకే తీసుకుని పోతా మీ అమ్మ రెండు రోజులు గరం అవుతుంది తర్వాత చల్లబడుతుందని శకుంతల అంటుంది. ఇది మంచి పనే కానీ అమ్మకి తెలిస్తే షూట్ చేస్తుందని నందిని మనసులో అనుకుంటుంది.

ఇక్కడ కాకుండా ఇంకెక్కడైన నా బిడ్డ వాళ్ళు సంతోషంగా బతుకుతారని చెప్తుంది. ఈ విషయం వెంటనే రేవతికి చెప్పాలని ఇంటికి వెళ్తుంది. రేవతితో విషయం చెప్తుంటే అటుగా వెళ్తున్న భవానీ వింటుంది. శకుంతల అత్త చెప్పింది కరెక్ట్ అనిపించిందని నందిని అంటుంది. మనమేమీ తప్పు చేయడం లేదు భార్యాభర్తలని మనం కలుపుతున్నాం కదా అంటుంది. రేవతిని నందిని బలవంతంగా శకుంతల దగ్గరకి తీసుకుని వెళ్తుంది. శకుంతల బ్యాగ్ పట్టుకుని ఇంటి బయటకి వచ్చి కృష్ణని పిలుస్తుంది. అప్పుడే మురారి వస్తాడు. ఇక్కడ నుంచి ఊరికి వెళ్లిపోదామని అంటుంది. లగ్గం ఆపడానికి వీళ్ళని ఊరి తీసుకుని వెళ్తాను ఆపుతానని చెప్తుంది.

ఎక్కడికీ వచ్చేది లేదని చెప్పేసిన కృష్ణ

ఇదంతా భవానీ ఇంటి మేడ మీద నుంచి చూస్తుంది. తన చిన్నమ్మ ఏదో ఆవేశంలో అంటుందని కృష్ణ అంటుంది. ఆవేశం కాదు అత్త చెప్పింది మంచిగానే అనిపిస్తుందని నందిని శకుంతలకి సపోర్ట్ చేస్తుంది. ఏమైనా తెలుస్తుందా అని రేవతి అంటే ఆధారాలు దొరుకుతాయని మురారి చెప్తాడు. కానీ శకుంతల మాత్రం వినిపించుకోదు. కృష్ణ తన చిన్నమ్మ మీద అరుస్తుంది. మీరు ఏం తప్పు చేయలేదు కదా మరి ఎందుకు ఈ లొల్లి పోదాం పదండని అంటుంది.

మేం రాము నువ్వు వెళ్లాలని అనుకుంటే వెళ్ళమని కృష్ణ తెగేసి చెప్తుంది. మేం వెళ్లిపోతే తప్పు చేసి పారిపోయిన వాళ్ళలాగా చూడరా? మేం పెద్దత్తయ్యకి మాట ఇచ్చాం.. దాన్ని తప్పి ఎక్కడికి వచ్చేది లేదు. మీ అత్తయ్య మాట మారిస్తే ఏంటి పరిస్థితని శకుంతల అడుగుతుంది. మా పెద్దత్తయ్య మాట మార్చరు, మనసు మార్చుకోరు. కృష్ణ రానని చెప్పేసరికి శకుంతల శాంతిస్తుంది. ఈ పెళ్లి జరగదని మీ అందరూ నమ్ముతున్నారు కదా నేను నమ్ముతాలే అంటుంది.

ముకుందని అనుమానించిన సుమలత

దేవ్ ముకుంద పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. ఎల్లుండే పెళ్లి మురారికి నువ్వు చేసే కుట్ర రివీల్ అవదు కదా అని ముకుంద టెన్షన్ గా అడుగుతుంది. ఏమి జరగదని దేవ్ చెప్తుంటే ఏం జరగదనని సుమలత అడుగుతుంది. మీ అన్నయ్య మొహం మీదే పెళ్లి జరగదని అంటుంటే నువ్వేంటి చీవాట్లు పెట్టకుండా ఉన్నావని సుమతల అంటుంది.

ఇదేంటి ఇంత అడ్డంగా దొరికిపోయామని కంగారుపడుతుంది. మా అత్తయ్య ఉంది తన ముందు ఎన్ని ప్రయత్నాలు చేసిన జరగదని వీడికి ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని చెప్పి కవర్ చేస్తుంది. ముకుంద అబద్ధం చెప్తుందని అర్థం అవుతుంది. ఇంకేదో జరుగుతుందని సుమలత మనసులో అనుకుంటుంది.

ఏసీపీ సర్ తో తన పెళ్ళే జరుగుతుందన్న కృష్ణ

ప్రసాద్ వాళ్ళ దగ్గరకి మురారి, కృష్ణ వస్తారు. రేపు నలుగు అంటే ఏంటి ఇంత కూల్ గా ఉన్నారని అడుగుతాడు. ఈ కేసుకి మా చిన్నాన్నకి ఏ సంబంధం లేదని ఖచ్చితంగా తేలుతుందని కృష్ణ చెప్తుంది. నలుగుకి సంబంధించి లిస్ట్ రాస్తున్నానని ప్రసాద్ చెప్పేసరికి కృష్ణ అలిగి వెళ్లిపోబోతుంటే ఆగమ్మ ఎందుకు కంగారని ప్రసాద్ సర్ది చెప్తాడు. ఇదంతా భవానీ చూస్తూ ఉంటుంది. గంధం కాస్త ఎక్కువ రాయండి లిస్ట్ లో ఈ కేసులో మా తప్పు లేదని తెలిస్తే నాకు ఏసీపీ సర్ కి పెళ్లి జరుగుతుంది కదా గంధం బాగా రాసుకుంటానని కృష్ణ చెప్పి నవ్వుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో దేవ్ చేతికి ఉన్న ఉంగరం కృష్ణ కంట పడుతుంది. శ్రీధర్ మొహం మీద ఉన్న గుర్తు ఈ ఉంగరం ఒకటేనని అనుకుంటుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024