![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/Amala_Paul_Pregnancy_1704330689662_1704330700431.jpg)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/Amala_Paul_Pregnancy_1704330689662_1704330700431.jpg)
Amala Paul Pregnancy: కొత్త సంవత్సరం ప్రారంభంలో హీరోయిన్ అమలా పాల్ గుడ్ న్యూస్ చెప్పింది. తన జీవితంలో మాతృ ప్రేమను అందించడానికి, ఆ అనుభూతిని చెందడానికి సిద్ధంగా ఉంది. అమలా పాల్ తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సంతోషంగా తెలియజేసింది. ఈ మధ్య ఓటీటీ సినిమాలు ఎక్కువగా చేస్తున్న అమలా పాల్ ఇలా ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నట్లు తెలియజేస్తూ ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఫొటోలు పోస్ట్ చేసింది. అందులో అమలా పాల్ రెడ్ కలర్ స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుని అందంగా కనిపించింది. తన ప్రియుడు, భర్త జగత్ దేశాయ్ గుండెలో అమలా పాల్ ఉన్నట్లుగా ఫొటోషూట్ చేశారు. మరో ఫొటోలో బేబీ బంప్ పట్టుకుని ఫొటోకు పోజు ఇచ్చారు. ఇంకో ఫొటోలో అమలా పాల్ కాళి వేళ్లపై నిల్చుని జగత్ దేశాయ్‌ను కిస్ చేస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టుకు “నీతో (భర్త జగత్ దేశాయ్) 1+1= 3 అవుతుందని నాకు ఇప్పుడే తెలిసింది” అని క్యాప్షన్ రాసుకొచ్చింది అమలా పాల్.
ఇదిలా ఉంటే అమలా పాల్ తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో గతేడాది జూన్ నుంచి డేటింగ్లో ఉంది. కేరళలోని కోచ్చిలో నవంబర్ 5న అమలా పాల్, జగత్ దేశాయ్ పెళ్లి చేసుకుని వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి పది రోజుల ముందు అమలా పాల్ తన పుట్టినరోజు నాడు అక్టోబర్ 26న ఆమెకు ప్రపోజ్ చేశాడు జగత్ దేశాయ్. అప్పుడు పెళ్లికి ఎస్ చెప్పింది అమలా పాల్. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. పెళ్లైన రెండు నెలలకు తాను గర్భవతినంటూ అమలా పాల్ వెల్లడించింది.
ఇదివరకు గతంలో అమలా పాల్ డైరెక్టర్ విజయ్‌తో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ, అనంతరం మనస్పర్థల కారణంగా అమలా పాల్, విజయ్ విడాకులు తీసుకున్నారు. ఇగ జగత్ దేశాయ్‌ది సినిమా నేపథ్యం కాదు. కానీ, సినిమా వాళ్లలో కొందరికీ బాగా తెలిసిన వ్యక్తి అని తెలుస్తోంది. జగత్ దేశాయ్ ఈవెంట్ ఆర్గనైజర్‌గా చేస్తున్నట్లు సమాచారం. కామన్ ఫ్రెండ్స్ ద్వారా జగత్ దేశాయ్, అమలా పాల్ పరిచయం అయినట్లు, అది కాస్తా ప్రేకు దారితీసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అమలా పాల్ ప్రస్తుతం ఆడుజీవితం (ది గోట్ లైఫ్) మూవీలో నటిస్తోంది. ఇందులో సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా బ్లెస్సీ దర్శకత్వంలో రానుంది. ఇదే కాకుండా ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో అమలా పాల్ నటిస్తోంది. ఇక అమలా పాల్ తెలుగులో నాగ చైతన్య బెజవాడ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన విషయం తెలిసిందే. అనంతరం లవ్ ఫెయిల్యూర్ మూవీతో ఆకట్టుకుంది.
ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నాయక్, ధనుష్ సరసన రఘువరన్ బీటెక్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేసి అలరించింది. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి ఒకరకమైన స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. అనంతరం పెళ్లి చేసుకున్నాగా సినిమాలు తగ్గాయి. ఇక విడాకుల అనంతరం పలు ప్రయోగాత్మక చిత్రాలు చేసింది అమలా పాల్.