ysrcp nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.13-10-2022(గురువారం) ..
ప్రజల ఆశీస్సులే .. జగనన్న బలం ..
పట్టణంలోని 13 వ వార్డులో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 13 వ వార్డు పరిధిలో గురువారం ఉదయం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల క్యాలెండర్ ను అందజేస్తూ – ప్రభుత్వ పనితీరును వివరించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపలోను సంక్షేమం ఆనందం వెల్లివిరస్తోందని , ప్రజల ఆశీస్సులే ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న బలం అని చెప్పారు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు , సంక్షేమ పథకాల పట్ల ప్రతి గడపలో 100% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు ,ప్రతి ఇంట మహిళలు గడిచిన మూడేళ్లలో మా ఇంటికి రూ.లక్షల్లో లబ్ధి చేకూరిందని చెబుతున్నారన్నారు , అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తున్నామని , దాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పనికిమాలిన మాటలతో బురద చల్లుతున్నాయని మండిపడ్డారు , ప్రజలందరికీ అన్ని విధాలుగా మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మనసారా దీవించాలని కోరారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్, కమిషనర్ ,ఏఈ , కౌన్సిల్ మరియు కో ఆప్షన్ సభ్యులు, సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : అడవిరావులపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”..
Follow us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mmohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka