IRCTC Rajasthan Tour : ‘గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్థాన్’ ట్రిప్ – తక్కువ ధరలోనే 7 రోజుల ప్యాకేజీ – పూర్తి వివరాలివే

Best Web Hosting Provider In India 2024

IRCTC Tourism Rajasthan Tour Package 2024: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి రాజస్థాన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘GOLDEN SANDS OF RAJASTHAN’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. విమానం జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో… పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. జైసల్మేర్, జోద్ పూర్, మౌంట్ అబు, ఉదయ్ పూర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

షెడ్యూల్ ఇలా ఉంటుంది….

జనవరి 31, 2024వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్ ఉంటుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 01: ఉదయం శంషాబాద్ విమానాశ్రయ నుంచి బయల్దేరి… ఉదయపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత హోటల్ లోకి చెకిన్ అవుతారు. లంచ్ తర్వాత నథ్ ద్వారాకు(50కి.మీ) వెళ్తారు. తిరిగి ఉదయ్ పూర్ చేరుకున్న తర్వాత… పిచ్చోలా లేక్ సందర్శిస్తారు. రాత్రి ఉదయ్ పూర్ నే ఉంటారు.

Day 2: బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. మౌంట్ అబుకు వెళ్తారు. తర్వాత దిల్వారా జైన ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం నక్కీ లేక్ కు వెళ్తారు. రాత్రి మౌంట్ అబులోనే బస చేస్తారు.

Day 3: అల్పహారం తర్వాత జైసల్మీర్ కు వెళ్తారు. బర్మర్ లో లంచ్ ఉంటుంది. తిరిగి జైసల్మేర్‌ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

Day 4: బ్రేక్ ఫాస్ట్ తర్వాత… జైసల్మేర్ ఫోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం డిస్టర్ట్ క్యాంప్ కు వెళ్తారు. అక్కడ క్యామెల్ సఫారీ ఉంటుంది. జీప్ సఫారీ కూడా అందుబాటులో ఉంటుంది. రాత్రి జైసల్మేర్ డిసర్ట్ క్యాంప్ లోనే బస చేస్తారు.

Day 05: బ్రేక్ ఫాస్ట్ తర్వాత… హోటల్ నుంచి చెక్ అవుతారు. అక్కడ్నుంచి జోద్ పూర్ కు వెళ్తారు. అనంతరం ఉమేద్ భవన్ ప్యాలెస్ ను సందర్శిస్తారు. రాత్రి జోద్ పూర్ లోనే బస చేస్తారు.

Day 06: బ్రేక్ ఫాస్ట్ తర్వాత మెరంఘర్ పోర్టును వెళ్తారు. మధ్యాహ్నం జోద్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరుతారు. అక్కడ్నుంచి హైదరాబాద్ కు చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ ధరల వివరాలు:

హైదరాబాద్ – రాజస్థాన్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.53,900 ధర ఉండగా.. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 41,250 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.39,300 గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024