
Best Web Hosting Provider In India 2024

Tea for Diabetes: టీ, కాఫీలు ఏవి తాగినా అందులో చిటికెడు పంచదారో, బెల్లము వేసుకోవడం అలవాటు. అయితే డయాబెటిక్ పేషెంట్లు మాత్రం పంచదారను, బెల్లాన్ని తినడానికి చాలా భయపడుతూ ఉంటారు. దీనివల్ల టీ, కాఫీలు తాగలేరు. అయితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచే అద్భుతమైన టీ ఒకటి ఉంది. దీన్ని ప్రతి రోజూ తాగితే రక్తంలో చక్కెర పెరగదు. ఎప్పుడూ అదుపులోనే ఉంటాయి. అయితే ఈ టీ ని తాగే వారి సంఖ్య తక్కువే. ఆయుర్వేదంలో కూడా ఈ టీ అత్యంత ఆరోగ్యకరమైనదని చెబుతున్నారు. ఇంతకీ ఈ టీ ని దేనితో తయారు చేసుకోవాలో తెలుసా? జామ ఆకులతో. ప్రతిరోజూ జామ ఆకులతో తయారు చేసిన టీని తాగడం వల్ల డయాబెటిస్ రోగులు ఆరోగ్యంగా జీవించగలరు.
ట్రెండింగ్ వార్తలు
శీతాకాలం వచ్చిందంటే డయాబెటిస్ పేషంట్లలో రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడం కూడా కష్టంగా మారుతుంది. అదే జామ ఆకులతో టీ చేసుకుని తాగితే ఇన్సులిన్ నియంత్రణలో ఉండడంతో పాటు షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. శీతాకాలంలో దొరికే పండ్లలో జామకాయ ఒకటి. కాబట్టి జామాకులు లేతగా ఎదుగుతూ ఉంటాయి. ఈ ఆకులలో ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, పాలీఫెనాల్స్ వంటి సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ ఆకుల్లో ఎక్కువని ఇదివరకే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.
ఎన్నో అధ్యయనాలు చెబుతున్న ప్రకారం జామ ఆకుల్లోని సారం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగ్గా ఉంటే రక్తంలో చక్కెర నియంత్రణ కూడా అదుపులోనే ఉంటుంది. జామ ఆకులోని రసాలు జీర్ణవ్యవస్థ నుండి శరీరం చక్కెరను శోషించుకోకుండా తగ్గిస్తుంది. దీనివల్ల భోజనం తిన్నాక రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవకాశం ఉండదు.
జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ప్యాంక్రియాటిక్ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడతాయి. ఇన్సులిన్ ఉత్పత్తిలో ప్యాంక్రియాస్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్యాంక్రియాటిక్ కణాలను రక్షించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
టీ ఎలా చేయాలి?
జామ టీ తయారు చేయడం చాలా సులువు. ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు వేసి జామ ఆకులను అందులో వేయాలి. స్టవ్ మీద పెట్టి ఆ నీటిని మరిగించాలి. జామ ఆకుల్లోని సారమంతా వేడికి కరిగి ఆ నీటిలో కలిసిపోతుంది. స్టవ్ కట్టేసి ఆకులను వడకట్టి ఆ నీటిని తాగేయాలి. ఇదే జామ ఆకుల టీ రోజుకి రెండుసార్లు తాగడం వల్ల మీకు వారం రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. కావాలనుకుంటే అరస్పూను తేనె కూడా కలుపుకోవచ్చు.