Minister SridharBabu: ఆటోడ్రైవర్లను బిఆర్‌ఎస్‌ నేతలు రెచ్చ గొడుతున్నారన్న మంత్రి శ్రీధర్ బాబు

Best Web Hosting Provider In India 2024

Minister SridharBabu: రాజకీయాల కోసం ఆటో డ్రైవర్లను బలి చెయ్యొద్దని మంత్రి శ్రీధర్‌ బాబు బిఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు. వారికి కూడా న్యాయం చేసే కార్యాచరణ తాము రూపొందిస్తున్నామని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

2018లో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన ముప్పై ఆరు రోజుల తర్వాత రాష్ట్ర శాసనసభ సమావేశాలు పెట్టారని, ప్రజలు తీర్పు ఇచ్చిన నెల తర్వాత ముఖ్యమంత్రి మాత్రమే పదవిలో ఉన్న విషయం బిఆర్‌ఎస్‌ నాయకులు గుర్తుంచు కోవాలని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు.

ఎన్నికల్లో గెలిచిన రెండు నెలల తర్వాత కేసీఆర్‌ మంత్రి వర్గం ఏర్పాటు చేశారని … ఇది బాధ్యత రాహిత్యం కాదా అని నిలదీవారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహస్యం చేశారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను ప్రజలు ఇంటికి పంపారన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లో ఇచ్చిన హామీలు అమలు మొదలు పెట్టామని, హామీల్లో రెండు ప్రధానమైన వాటిని అమలు చేస్తున్నామని.. మహిళల కోసం ఫ్రీ బస్ సర్వీస్ సేవలు ప్రారంభించామని.. ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు సేవలు వినియోగించుకున్నారని చెప్పారు.

రాష్ట్రంలో ప్రతి మహిళ స్వేచ్చగా తన సొంత బస్సుగా భావిస్తూ సేవలు వినియోగించు కుంటున్నారని చెప్పారు. పదేళ్ల నుంచి ప్రజారోగ్యం గాలికి వదిలేసిన పార్టీ, ప్రభుత్వం BRS కాదా అని శ్రీధర్‌బాబు నిలదీశారు. కాంగ్రెస్ వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచి అమలు చేస్తోందని ఇది ప్రతి పేద కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.

ప్రజలు ఓడించినా బుద్ది రాలేదు…

ప్రజలు ఓటమి రుచి చూపించినా ఇంకా అదే అహంకార రీతిలో BRS నేతలు మాట్లాడుతున్నారని, BRS విడుదల చేసిన ఒక బుక్‌లెట్‌ను కాంగ్రెస్ ఖండి స్తోందన్నారు. 3500 రోజులు పాలించిన వాళ్ళు కాంగ్రెస్ వచ్చి 35 రోజులు కూడా కాకున్నా, అప్పుడే అక్కసు వెళ్లగక్కడం ఏమిటన్నారు. ఓర్వలేక నియంతృత్వ ధోరణితో మానిఫెస్టో పట్ల కుట్ర పూరితంగా, కక్ష పూరితంగా వ్యవరిస్తున్నారని ఆరోపించారు.

ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేస్తూ వస్తున్నామని, మంచి సూచనలు ఉంటే ఇవ్వాలని,వాటిని స్వీకరించడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. పదేళ్లు పాలించి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. ఇప్పుడు మేము వచ్చిన 30 రోజులకే ఇంత అహంకారంగా వ్యవహరించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు.

BRS భవన్ లో ఉండి ప్రెస్ మీట్ పెట్టడం కాదని, ఒక్కసారి గ్రామంలోకి వెళ్లి అక్కచెల్లెళ్ళ నీ అడగండి… వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుస్తుందన్నారు. ప్రజా పాలన ఎలా ఉందో, ఉంటుందో కళ్ళారా చూస్తూనే ఉన్నారని, ప్రజా దర్బార్ పెట్టినప్పటి నునంచి వేలాది మంది విజ్ఞప్తులు చేస్తున్నారని … BRS పాలనలో ఒక్కసారైనా మీరు ప్రజలను కలిశారా, ప్రజల గోస విన్నారా అని ప్రశ్నించారు. అహంకార పూరిత పాలనకు చరమ గీతం పాడినా ఇంకా మారకుండా అర్దం పర్డం లేని ఆరోపణ చేస్తున్నారన్నారు.

2014& 2018 లో BRS ఇచ్చిన దళిత CM, మూడెకరాల వ్యవసాయ భూమి,12 శాతం ముస్లిం రిజర్వేషన్,కేజీ పీజీ ఉచిత విద్య హామీల సంగతి పై మాట్లాడితే బాగుంటుందన్నారు. కేంద్రం విభజన హామీల్లో ఏ ఒక్కదాని కోసమైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు, ప్రాజెక్టుల కు జాతీయ హోదా… ట్రైబల్ యూనివర్సిటీల కోసం ఉద్యమించిన దాఖలాలు లేవన్నారు.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024