Best Web Hosting Provider In India 2024
Ganapath OTT Release: బాలీవుడ్‌లో గత ఏడాది రిలీజైన సినిమాల్లో గణపత్ డిజాస్టర్ కా బాప్‌గా నిలిచింది. టైగర్ ష్రాఫ్, కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ గత ఏడాది అక్టోబర్ 20న థియేటర్లలో రిలీజైంది. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలను నిండా ముంచేసింది. కేవలం పదమూడు కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. 2023లో నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చిన బాలీవుడ్‌సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ట్రెండింగ్ వార్తలు
మూడు నెలల తర్వాత ఓటీటీలోకి…
థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత గణపత్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జనవరి మూడో వారం ఈ యాక్షన్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు సమాచారం. రిలీజ్ ముందు గణపత్‌పై ఉన్న బజ్ కారణంగా దాదాపు యాభై కోట్లకు నెట్‌ఫ్లిక్స్ గణపత్ మూవీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నది.
డిసెంబర్‌లోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ థియేటర్లలో సినిమా డిజాస్టర్ కావడంతో ఆ ఎఫెక్ట్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై పడింది. అందుకే థియేటర్లలో రిలీజై మూడు నెలలు దాటిన ఇప్పటివరకు టైగర్ ష్రాఫ్ గణపత్ మూవీ ఓటీటీలో విడుదల కాలేదు. థియేట్రికల్ రిలీజ్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. గణపత్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావడానికి అది కూడా ఓ కారణమని అంటున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్…
గణపత్ మూవీకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వికాస్ భల్ దర్శకత్వం వహించారు. గణపత్ సినిమాలో డోపల్‌గాంగర్‌గా డ్యూయల్ రోల్‌లో టైగర్ ష్రాఫ్ నటించాడు. ఒకే పోలికలతో ఉన్న రక్త సంబంధం లేని ఇద్దరు వ్యక్తులుగా పాజిటివ్, నెగెటివ్ షేడ్స్‌తో డైరెక్టర్ వికాస్ భల్ హీరో క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడు.
గణపత్ కథ మొత్తం 2070 కాలంలో జరుగుతుంది. కథలో క్లారిటీ లేకపోవడం, గ్రాఫిక్స్ సరిగ్గా కుదరకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. టైగర్ ష్రాఫ్ తో పాటు వికాస్ భల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌గా గణపత్ మూవీ నిలిచింది. గణపత్‌లో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలో నటించారు. ఎల్లీ అవ్రామ్ కూడా గ్లామర్ ప్రధాన పాత్రలో సందడిచేసింది.
మూడు సినిమాలు…
బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు టైగర్ ష్రాఫ్. గణపత్ డిజాస్టర్‌గా మిగిలినా అతడి కెరీర్‌పై ఈ సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ మాత్రం పడలేదు. ప్రస్తుతం మూడు భారీ బడ్జెట్ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు టైగర్ ష్రాఫ్. అక్షయ్ కుమార్‌తో కలిసి బడే మియా చోటా మియా సినిమా చేస్తున్నాడు. ఈ మల్టీస్టారర్ మూవీలో సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈసినిమాతో పాటు ది బిగ్ లయన్, సింగం అగైన్ సినిమాలతో టైగర్ ష్రాఫ్ బిజీగా ఉన్నాడు.