Brahmamudi January 5th Episode: కిచెన్‌లో అనామిక.. కావ్యపై మాటల యుద్ధం.. కొత్త కోడలికి ధాన్యలక్ష్మీ, రుద్రాణి సపోర్ట్

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో రాత్రి పూట ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతుంటారు. రాజ్ వంతు వస్తే కావ్యకు ప్రపోజ్ చేసి నుదుటపై ముద్దు పెట్టాలని కల్యాణ్ చెప్పి రోజ్ ఫ్లవర్ ఇస్తాడు. దాంతో అంతా అలాగే చేయమని అంటారు. ఇక చేసేది లేక ఆ ఫ్లవర్ ఇస్తూ ఐ లవ్యూ కళావతి అని రాజ్ చెబుతాడు. కావ్య చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ, అపర్ణ మాత్రం అంతా అయిపోయిందన్నట్లుగా బాధపడుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు

దుప్పటి కప్పుకుని

తర్వాత అన్నయ్య ముద్దు అని కల్యాణ్ అంటాడు. దాంతో కావ్య నుదుటిపై రాజ్ ముద్దు పెడతాడు. నెక్ట్స్ ఎవరు అని కల్యాణ్ అంటే పొద్దుపోయింది. ఇక పడుకుందాం అని సీతారామయ్య అంటాడు. దాంతో అంతా నిద్రపోతారు. కానీ, రాత్రి మధ్యలో లేచిన కల్యాణ్ అనామిక కోసం వెతుకుతుంటాడు. మెల్లిగా వెళ్లి అనామికను లేపి బయటకు తీసుకెళ్తాడు. కానీ, అదంతా ఇంట్లో వాళ్లు గమనిస్తారు. బయట బెంచ్‌పై దుప్పటి కప్పుకుని అనామిక కల్యాణ్ మాట్లాడుకుంటే.. మెట్లపై ఇంట్లో వాళ్లంతా కూర్చుని వింటుంటారు.

ఇక్కడ నిన్నే పెళ్లాడతా సినిమా సీన్ రిపీట్ అవుతుంది. ఇంట్లో వాళ్ల గురించి కల్యాణ్ ఏదో ఒకటి అంటాడు. వాళ్లంతా మొద్దు నిద్ర పోతారు. ఇప్పుడే లేవరు. మా నాన్న అయితే బుల్డోజర్‌లా నిద్రాపోతాడు. ఇక మా అత్తయ్య అయితే విలన్ అన్నట్లుగా మాట్లాడుతాడు కల్యాణ్. అదంతా విని తిట్టుకుంటారు ఇంట్లోవాళ్లు. తర్వాత అనామికను ముద్దు అడుగుతాడు కల్యాణ్. నాకు సిగ్గు అని చెప్పిన అనామిక కాసేపటకి ఒప్పుకుంటుంది.

కిచెన్‌లో అనామిక

దాంతో అనామికకు కల్యాణ్ ముద్దు పెట్టబోతుంటాడు. అప్పుడే రెయ్.. ఇంకెంత సేపురా.. త్వరగా పెడితే మేము వెళ్లిపోతాం అని రుద్రాణి గట్టిగా అంటుంది. దాంతో దుప్పటి తీసి ఇంట్లోవాళ్లను చూసి షాక్ అవుతారు కల్యాణ్, అనామిక. మా గురించే అలా మాట్లాడతవా అంటూ కల్యాణ్‌పైకి అపర్ణ వెళ్తుంది. అలా సరదాగా గడుస్తుంది. అంతా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం కిచెన్‌లో అనామిక టీ పెట్టేందుకు ప్రయత్నిస్తుంటుంది.

 

అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య నీకు ఎందుకు అనామిక శ్రమ అని అంటుంది. కోడలుగా నువ్ చేసినప్పుడు నాకు ఎలా శ్రమ అవుతుంది అని అనామిక అంటుంది. కవిగారితో సరదాగా మాట్లాడుకుంటూ ఉండు అని కావ్య అంటే.. నా భర్తతో ఎప్పుడు మాట్లాడాలో కూడా నువే చెబుతావా. ఇంట్లో పని ఎప్పుడూ చేయాలో కూడా నువ్వే చెబుతావా అని అనామిక అంటుంది. నేను అలా అనలేదు అని కావ్య అంటుంది. అదంతా చూసిన రుద్రాణి, ధాన్యలక్ష్మీ కిచెన్‌లోకి వస్తారు.

గొడవకు కేరాఫ్ అడ్రస్

ఏంటీ అనామిక నువ్ కిచెన్‌లో ఉన్నావ్. అల్లారుముద్దుగా పెరిగావ్. లేవగానే బెడ్ కాఫీ అడుగుతావ్ అనుకున్నా. కిచెన్‌లోకి వచ్చి టీ పెడతావ్ అనుకోలేదు అని రుద్రాణి అంటే.. మరి నా కోడలు అంటే ఏమనుకున్నావ్. బంగారం అని మురిసిపోతుంది ధాన్యలక్ష్మీ. నువ్ అదృష్టవంతురాలివి. నాకు వదినకు అలా జరగలేదు. కావ్య హాల్లోకి వస్తే ఎంత గొడవ అయ్యేది. ఇక స్వప్న అయితే గొడవకు కేరాఫ్ అడ్రస్ అని రుద్రాణి అంటే కావ్య కోపంగా చూస్తుంది. ఎందుకు అలా చూస్తావ్ అని అంటుంది రుద్రాణి.

దొంగతనాల గురించి గజదొంగ మాట్లాడినట్లు ఉంది. అన్నింటికి కారణమైన మీరు ఇలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు చిన్నత్తయ్య సపోర్ట్ చేసింది కానీ, లేకుంటే అని కావ్య అంటే.. అప్పుడు అలా చేసినందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలో అనామిక షుగర్ అడుగుతుంది. ధాన్యలక్ష్మీ ఇచ్చి.. ఏది అవసరం ఉన్న నన్ను అడుగు. ఎవరితో పనిలేదు. భయపడాల్సిన అవసరం కూడా లేదు అని అంటుంది.

 

చెప్పుకుంటూ తిరుగుతారు

నేను భయపడను అని అనామిక అంటుంది. త్వరలో నీ స్థానాన్ని తీసేసుకుంటుందని భయపడుతున్నావ్ అని కావ్యను రుద్రాణి అంటుంది. నేను ఎవరి స్థానాన్ని తీసుకోను. నాకంటూ ఓ గుర్తింపు ఉంది అని అనామిక అంటుంది. నువ్ గొప్పింటి నుంచి వచ్చావ్ కాబట్టి గుర్తింపు కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. కావ్యలా కాదు కదా అని రుద్రాణి అంటుంది. నేను కాదు మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతారో అని నేను ఈ ఇంటి ఆడపడుచు అని చెప్పుకు తిరుగుతారు అని కావ్య అంటుంది.

దాంతో రుద్రాణి కోపంగా వెళ్లిపోతుంది రుద్రాణి. తర్వాత అనామిక కాఫీలా టీ పెడుతుంది. అలా కాదని కావ్య చెబుతుంది. కానీ, అనామిక వినదు. తర్వాత అందరికీ కాఫీ ఇస్తుంది అనామిక. అంతా ఒకేసారి తాగుతారు. విచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ పెడతారు. కానీ, బయటకు మాత్రం బాగుందని అంటారు. ఇంతలో కల్యాణ్ వచ్చి తాగుతాడు. దీనికన్న కషాయమే బెటర్ అని కల్యాణ్ అంటే.. నువ్ అబద్ధం చెబుతున్నావని తీసుకుని కాఫీ తాగుతుంది అనామిక.

నువ్ మహారాణివి కదా

అది తాగి ఛీ.. ఛీ.. ఇలా ఉందేంటి అనామిక అంటుంది. నాకు ఇప్పుడే అర్థమైంది. నాకు కాఫీ పెట్టడం రాదని అనామిక అంటుంది. కావ్య ఉందిగా. అన్ని నేర్పిస్తుందిలే అని ఇందిరాదేవి అంటుంది. అంతా కావ్యను కాఫీ పెట్టుకురమ్మని చెబుతారు. కావ్య వెళ్తుంది. నువ్వేం ఫీల్ అవ్వకు అనామిక.. వాళ్లంటే అన్ని పనులు చేస్తూ పెరిగారు పనివాళ్లలా.. కానీ, నువ్వు మహారాణిలా పెరిగావ్ కదా అని రుద్రాణి అంటుంది. నేను కూడా మహరాణిలా పెరిగాను అని స్వప్న అంటుంది.

 

ఒక్క మాట అంటే కోపం పొడుచుకు వస్తుందే అని రుద్రాణి అంటుంది. అందరిముందు కోడలిని అనొద్దని మీకు తెలిస్తే నాకు కోపం ఎందుకు వస్తుందని స్వప్న అంటుంది. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో రోడ్డుమీద శ్వేతతో రాజ్ ఐస్ క్రీమ్ తింటూ ఉండటం కావ్య చూస్తుంది. కాల్ చేసి ఎక్కడున్నారని అడిగితే.. ఆఫీస్‌లో ఉన్నాను. విండో తెరిచి మాట్లాడుతున్నాను అని చెబుతాడు. అది విని కావ్య బాధపడుతుంది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024