Krishna mukunda murari january 5th episode:: దేవ్ ని అనుమానించిన కృష్ణ.. శ్రీధర్ ని హత్య చేసిన వ్యక్తి దొరుకుతాడా?

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari january 5th episode: కృష్ణ మాటలు విని భవానీ కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. నేను ప్రభాకర్ ఇదంతా చేశాడని నమ్ముతాను. కానీ చూస్తుంటే నేను ఒక్కదాన్నే ఈ విషయం నమ్ముతున్నట్టుగా అనిపిస్తుంది. నేనేమైనా తప్పు చేస్తున్నానా? కృష్ణ వైపు ఎటువంటి భయం కాని టెన్షన్ కానీ కనిపించడం లేదు. అది పైకి కనిపించే గంభీర్యమా? భయపడుతున్న ఛాయలు కృష్ణలో కానీ, కృష్ణ దూరమవుతుందన్న భయం మురారిలో కనిపించడం లేదు. నేను అనవసరంగా ఆవేశపడుతున్నానా? నేను అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను, నేను ఏ తప్పు చేయడం లేదని అనుకుంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు

భవానీ దగ్గరకి వెళ్ళిన శకుంతల

శకుంతల భవానీ దగ్గరకి వస్తుంది. మీ కాళ్ళు మొక్కుతా అని శకుంతల ఏడుస్తుంది. నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసు నేను ఏం చెప్తానో నీకు తెలుసు దయచేసి వదిలేయ్ అనేసరికి శకుంతల ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మురారి తలనొప్పిగా ఉందని అంటే కృష్ణ తలకి మసాజ్ చేస్తుంది. ఎంత బాగా తలపడుతున్నావ్ దీనికోసమైనా కేసు త్వరగా క్లోజ్ చేయాలని అంటాడు.

కృష్ణ కోపంగా అంతేనా దీని కోసంగా అంటుంది. కాదు దగ్గరకి రమ్మని చెప్పి చెవిలో ఏదో చెప్తాడు. అది విని కృష్ణ తెగ సిగ్గుపడిపోతుంది. శకుంతల ఇంటికి వచ్చి నవ్వుతూ ఉన్న కృష్ణ, మురారిలని చూస్తుంది. ఏంటి డల్ గా ఉన్నావ్ మా ఇంటికి వెళ్ళి పెద్దమ్మని కలిసి వస్తున్నావా అని మురారి అడుగుతాడు. అవునని చెప్తుంది. బాధపడకు ఇంకొద్ది రోజుల్లో అన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయని ధైర్యం చెప్తాడు.

దేవ్ చేతి ఉంగరం చూసిన కృష్ణ

చిన్నమ్మ చాలా బాధపడుతుందని కృష్ణ కూడా ఫీల్ అవుతుంది. రింగ్ ఒక్కటే ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుందని మురారి అంటాడు. ముకుంద దేవ్ చేతికి ఉన్న రింగ్ చూసి కొత్తదా అని అడుగుతుంది. అవును ముంబయ్ లోని నా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చింది. నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని చెప్తాడు. కానీ నాతో జీవితం ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేరని అంటాడు. అందరూ తినేందుకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. కృష్ణ తింటూ దేవ్ చేతికి ఉన్న ఉంగరం చూస్తుంది. శ్రీధర్ మొహం మీద ఉన్న రింగ్ గుర్తు ఇదేనని గుర్తుపడుతుంది. మళ్ళీ ఆ రింగ్ ఈ రింగ్ అయి ఉండదులే అనుకుంటుంది.

 

రేపు ముకుంద, మురారికి నలుగు పెడుతున్నామని భవానీ చెప్పేసరికి కృష్ణ బాధపడుతుంది. ముకుంద సంతోషపడుతుంది. మేడమ్ ఒక్కసారి ఆలోచించండి నా చెల్లి పెళ్లి అవుతుందని మీరు సంతోషిస్తున్నారు కానీ నా చెల్లి కృష్ణ జీవితం ఏమవుతుందోనని బెంగతో నాకు భోజనం కూడా సహించడం లేదని ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు.

కృష్ణ ఇంట్లోనే ముకుందకి నలుగు

కృష్ణ నీ చెల్లి అన్నావ్ కదా నా ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికింది. రేపు ముకుందకి నలుగు నీ రెండో చెల్లి ఇంట్లో అదే అవుట్ హౌస్ లో అని భవానీ అనేసరికి కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఈ విషయం మీ చిన్నమ్మకి చెప్పి రెడీగా ఉండమని చెప్పు అంటుంది. కృష్ణ బాధగా అన్నం ప్లేట్ లో చెయ్యి కడిగేసుకుని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మురారి కూడా వెళ్ళిపోతాడు.

శకుంతల కృష్ణ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. బాధగా ఇంటికి వచ్చిన కృష్ణని రేపు నలుగు పెడుతున్నారా అని శకుంతల అడుగుతుంది. కృష్ణ భవానీ మాటలు తలుచుకుని ఏడుస్తుంది. ఎప్పుడూ లేనిది ఎందుకు ఇంత భయపడుతున్నాను. రేపు నలుగు, ఎల్లుండి పెళ్లి. ఈ పెళ్లి ఆగాలి అంటే ఆ ఉంగరం వాడైన దొరకాలి, లేదంటే పెద్దత్తయ్య మనసు అయినా మార్చుకోవాలి. లేదంటే ఆదర్శ్ అయినా తిరిగి రావాలి. ఈ మూడింటిలో ఉంగరం వాడు దొరకడమే సాధ్యమని అనుకుంటుంది. మురారి రాగానే కృష్ణ భయపడుతూ తన చేతిని పట్టుకుంటుంది.

 

భయంగా ఉంది ఏదో కొత్త ఫీలింగ్ నా మనసుకి సమాధానం చెప్పలేకపోతున్నాను. బాధపడకు కృష్ణ ఎందుకు భయం నేను ఉన్నాను కదాని ధైర్యం చెప్తాడు. డిపార్ట్ మెంట్ వాళ్ళకి ఫోన్ చేశాను కేసు ప్రోగ్రెస్ లోనే ఉందని అంటాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను. అయినా అది జరగదు. నీతోనే నేను అనే ధైర్యంతో ఉంటున్నాను. ఎప్పటికీ మీరే నా మొగుడు అంటుంది.

తరువాయి భాగంలో..

ముకుందకి కృష్ణ ఇంట్లో నలుగు పెడతారు. భవానీ కావాలని కృష్ణని కూడా ముకుందకి గంధం రాయమని చెప్తుంది. అటు ఇంట్లో మురారికి కూడా నలుగు పెడతారు. శ్రీధర్ ని చంపిన వాళ్ళలో ఒకడు దొరికాడని మురారి వచ్చి భవానీతో చెప్తాడు. అది విని ముకుంద టెన్షన్ పడుతుంది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024