Guppedantha Manasu January 5th Episode:రిషికి గోరుముద్ద‌లు తినిపించిన వ‌సు – భ‌ర్త‌పై ధ‌ర‌ణి పంచ్‌లు – దేవ‌యాని ర‌చ్చ‌

Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu December 5th Episode: ఎండీ సీట్ కోసం వ‌సుధార‌ను కిడ్నాప్ చేస్తాడు శైలేంద్ర‌. కానీ ముకుల్…వ‌సుధార‌ను సేవ్ చేస్తాడు. ఆ త‌ర్వాత రిషి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వ‌సుధార అత‌డిని పెద్ద‌య్య ఇంటి నుంచి మ‌రో చోటుకి తీసుకెళ్ల‌డానికి రెడీ అవుతుంది. తాను ఎలా ప్ర‌మాదానికి గురైంది వ‌సుధార‌కు వివ‌రిస్తాడు రిషి. మీ లైఫ్‌లో ఇదొక బ్యాడ్‌ఫేజ్ సార్‌…ఏది ఏమైనా మీరు నా ప‌క్క‌న ఉన్నారు. ఇంత‌కు ముందులా మిమ్మ‌ల్ని మార్చుకుంటాన‌ని రిషితో అంటుంది వ‌సుధార‌. మ‌నం ఎక్క‌డికి వెళుతున్నాం. ఇంటికేనా అని వ‌సుధార‌ను అడుగుతాడు రిషి. కాద‌ని అంటుంది వ‌సుధార‌. రిషిని ఎక్క‌డికి తీసుకెళుతున్న‌ది చెప్ప‌దు.

 

ట్రెండింగ్ వార్తలు

శైలేంద్ర టెన్ష‌న్‌…

త‌న కిడ్నాప్ ప్లాన్‌ బెడిసికొట్ట‌డంతో శైలేంద్ర కోపంగా ఉంటాడు. ఒక్క సెక‌న్ లేట‌యి ఉంటే త‌న బండారాన్ని ముకుల్ బ‌య‌ట‌పెట్టేవాడ‌ని, త‌న క‌ల‌లు మొత్తం నాశ‌న‌మ‌య్యేవ‌ని భ‌య‌ప‌డిపోతాడు. చాలా టెన్ష‌న్‌గా రూమ్‌లో తిరుగుతుంటాడు. అప్పుడే రూమ్‌లోకి ఎంట‌ర్ అయిన ధ‌ర‌ణి… ఈ రోజు చావు వ‌ర‌కు వెళ్లొచ్చిన‌ట్లున్నారు అని భ‌ర్త‌పై సెటైర్ వేస్తుంది.

అవును మృత్యుదేవ‌త‌ను ముద్దాడిన‌ట్లు ఉంది. పాడె మీద ప‌డుకోబోయేవాడిని పైకి లేచిన‌ట్లు ఉంద‌ని చిరాకుగా ధ‌ర‌ణికి స‌మాధాన‌మిస్తాడు శైలేంద్ర‌. అర‌వింద స‌మేత సినిమాలోని డైలాగ్‌ను చెబుతాడు. కానీ అత‌డి సీరియ‌స్‌నెస్‌ను అర్థం చేసుకోకుండా శైలేంద్ర‌ను మాట‌ల‌తో ఆట‌ప‌ట్టిస్తుంది ధ‌ర‌ణి.

ధ‌ర‌ణి కూపీ…

శైలేంద్ర నుంచి ఏం జ‌రిగిందో కూపీ లాగే ప్ర‌య‌త్నం చేస్తుంది ధ‌ర‌ణి. తోడుగా నేను వ‌స్తాన‌ని వెళ్లే ముందే చెప్పాను. మీరే వ‌ద్ద‌ని ఒంట‌రిగా బ‌య‌లుదేరారు. నా మాట విన‌కుండా వెళ్లి…ఇప్పుడు కంగారు ప‌డుతూ ఏదేదో చెబుతున్నారు. ఒక పెద్ద క్రైమ్ సీన్ జ‌రిగి..అది మీరు చూసిన‌ట్లు మాట్లాడుతున్నారు. మీ మాట‌లు వింటే అలాగే అనిపిస్తున్నాయి అంటూ శైలేంద్ర టెన్ష‌న్‌ను మ‌రింత పెంచుతుంది.

త‌న ప్లాన్ చెడిపోయిన చికాకులో ఉన్న శైలేంద్ర…రూమ్‌లో నుంచి ధ‌ర‌ణిని బ‌య‌ట‌కు వెళ్ల‌మ‌ని అంటాడు. తాను వెళ్ల‌న‌ని శైలేంద్ర‌కు బ‌దులిస్తుంది ధ‌ర‌ణి. నిద్ర పోవ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. శైలేంద్ర వేసిన ప్లాన్ ఏదో బెడిసికొట్టిన‌ట్లుంది. అందుకే కంగారు ప‌డుతున్నాడ‌ని ధ‌ర‌ణి అనుకుంటుంది.

 

మ‌హేంద్ర బాధ‌…

రిషితో పాటు వ‌సుధార కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌హేంద్ర‌, ఫ‌ణీంద్ర టెన్ష‌న్ ప‌డ‌తారు. వ‌సుధార గురించి ఆమె స్నేహితులంద‌రిని ఎంక్వైరీ చేశాన‌ని, ఆమె ఆచూకీ గురించి త‌మ‌కు తెలియ‌ద‌ని అంద‌రూ అన్నార‌ని మ‌హేంద్ర బాధ‌గా అన్న‌య్య‌కు చెబుతాడు.

మ‌హేంద్ర‌తో ఫ‌ణీంద్ర మాట్లాడిన మాట‌ల్ని దేవ‌యాని చాటు నుంచి వింటుంది. వ‌సుధార క‌నిపించ‌డం లేదా? ఇప్ప‌టివ‌ర‌కు ఆమె ఇంటికి రాలేదంటే ఆమెకు ఏదైనా అయ్యిందేమో అంటూ వ‌సుధార ప‌ట్ల మ‌న‌సులో ఉన్న అసూయ‌ను బ‌య‌ట‌పెడుతుంది. దేవ‌యానిపై ఫ‌ణీంద్ర సీరియ‌స్ అవుతాడు.

వ‌సుధార క‌నిపించ‌డం లేద‌ని మీకు తెలిసినా మాకు ఎందుకు చెప్ప‌లేద‌ని భ‌ర్త‌ను అడుగుతుంది దేవ‌యాని. అన్ని విష‌యాలు నీకు తెలియాల్సిన అవ‌స‌రం లేదు. తెలుసుకొని ఏం చేస్తావ‌ని భార్య‌కు క్లాస్ పీకుతాడు ఫ‌ణీంద్ర‌.

ధ‌ర‌ణిని పిలిచి వ‌సుధార క‌నిపించ‌డం లేద‌ట అని చెబుతుంది. ఇప్పుడే వ‌సుధార‌కు ఫోన్ చేసి ఆమె ఎక్క‌డుందో క‌నుక్కో అని కోడ‌లికి ఆర్డ‌ర్ వేస్తుంది దేవ‌యాని.. కానీ ఫ‌ణీంద్ర వ‌ద్ద‌ని వారిస్తాడు. నువ్వు వ‌సుధార క్షేమ‌స‌మాచారాలు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఈ విష‌యాన్ని ఇంత‌టిలో వ‌దిలేయ‌మ‌ని చెబుతాడు.

చ‌క్ర‌పాణి ఇంటికి…

మామ‌య్య మాట‌ల‌తో ధ‌ర‌ణి కంగారు ప‌డుతుంది. శైలేంద్ర టెన్ష‌న్ ప‌డింది వ‌సుధార కోస‌మ‌ని అర్థం చేసుకుంటుంది. వ‌సుధార‌కు త‌న భ‌ర్త ఏదైనా ఆప‌ద త‌ల‌పెట్టి ఉండొచ్చ‌ని అనుకుంటుంది.

 

ఈ విష‌యం మ‌హేంద్ర‌కు చెప్పాల‌ని అనుకుంటుంది. రిషిని తీసుకొని త‌న తండ్రి చ‌క్ర‌పాణి ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది వ‌సుధార‌. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో మీరు క్షేమంగా ఉండాలంటే ఇక్క‌డ ఉండ‌ట‌మే మంచిద‌ని అంటుంది. మీకు అడుగ‌డుగునా ప్ర‌మాదం పొంచి ఉంద‌ని, ఇంటికి వెళితే రిస్క్ అని అందుకే ఇక్క‌డికి తీసుకొచ్చాన‌ని రిషిని క‌న్వీన్స్ చేస్తుంది వ‌సుధార‌. వ‌సుధార‌కు కూడా జాగ్ర‌త్తలు చెబుతాడు రిషి. ఒంట‌రిగా బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌ని అంటాడు.

వారు ఒక‌రికొక‌రు జాగ్ర‌త్త‌లు చెప్పుకోవ‌డం చూసి చ‌క్ర‌పాణి కంగారు ప‌డ‌తాడు. ఏమైంద‌ని అడుగుతాడు. జ‌రిగిన విష‌యాల‌న్నీ తండ్రికి చెబుతుంది వ‌సుధార‌. ఇంత జ‌రిగిన త‌న‌కు ఎందుకు చెప్ప‌లేద‌ని వ‌సుధార‌తో అంటాడు చ‌క్ర‌పాణి. త‌ల్లి చ‌నిపోయిన బాధ‌లో ఉన్న మీకు ఇవ‌న్నీ చెప్పి టెన్ష‌న్ పెట్ట‌కూడ‌ద‌ని అనుకున్నాన‌ని తండ్రికి స‌ర్ధిచెబుతుంది వ‌సుధార‌.

రిషికి భోజ‌నం…

వ‌సుధార‌కు తానే స్వ‌యంగా అన్నం తినిపిస్తుంది వ‌సుధార‌. గోరు ముద్ద‌లు క‌లిపి నోట్లో పెడుతుంది. రిషికి పొల‌మార‌డంతో అత‌డి త‌ల‌పై త‌ట్టి మంచినీళ్లు తాగిస్తుంది. త‌న‌కు వ‌సుధార చేస్తోన్న సేవ‌లు చూసి రిషి ఫిదా అవుతాడు. మీకు ఏం కావాల‌న్న అడ‌గండి అని రిషితో అంటుంది వ‌సుధార‌. నాకు ఏదైనా అస‌వ‌రం అయితే నిన్ను కాకుండా ఎవ‌రిని అడుగుతాన‌ని రిషి బ‌దులిస్తాడు.

 

రిషి మాట‌ల‌తో వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది. క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను రిషి ఓదార్చుతాడు. మిమ్మ‌ల్ని ఇలాంటి ప‌రిస్థితుల్లో చూడ‌లేక‌పోతున్నాన‌ని, క‌న్నీళ్లు ఆగ‌డం లేద‌ని వ‌సుధార అంటుంది. జీవితంలో క‌ష్టాలు, సంతోషాలు అన్ని ఉంటాయ‌ని రిషి ఆన్స‌ర్ ఇస్తాడు. సంతోషం ఎదురైన‌ప్పుడు గ‌ర్వంగా ఉండ‌కూడ‌దు. క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు కృంగిపోకూడ‌ద‌ని, అన్నింటిని ఒకేలా స్వీక‌రించాల‌ని చెబుతాడు.

మీకు ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగే క్ష‌ణం ముందే నా ప్రాణం పోతుంద‌ని రిషితో అంటుంది వ‌సుధార‌. మీరు క్షేమంగా ఉన్నార‌ని నా మ‌న‌సు చెప్పింది. అందుకే అంతులేని బాధ‌ను మ‌న‌సులో దాచిపెట్టుకొని మీ కోసం ఎదురుచూశాన‌ని రిషితో అంటుంది వ‌సుధార‌.

ఐ ల‌వ్ యూ చెప్పిన వ‌సుధార‌…

మనది రిషిధారల బంధమని వసుధారతో అంటాడు రిషి. ఎన్ని క‌ష్టాలొచ్చిన మ‌న ప్రేమ మ‌న‌కు అండ‌గా ఉంటుంది. ఇప్పుడు కూడా మ‌న ప్రేమే మ‌న‌ల్ని క‌లిపింద‌ని చెబుతాడు. రిషికి ఐ ల‌వ్ యూ చెబుతుంది వ‌సుధార‌. ల‌వ్ యూ టూ అని రిషి బ‌దులిస్తాడు. రిషి ప‌రిస్థితి త‌ల్చుకొని చ‌క్ర‌పాణి కూడా క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. కోటీశ్వ‌రుడు చివ‌ర‌కు బ‌త‌క‌డం కోసం గంజి నీళ్లు తాగాల్సివ‌చ్చింద‌ని బాధ‌ప‌డ‌తాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024