Optical Illusion: ఇక్కడున్న ఆప్టికల్ ఇల్యూషన్లో భిన్నంగా ఉన్న షాంపైన్ గ్లాసులు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టండి

Best Web Hosting Provider In India 2024

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి మన అవగాహనను, దృశ్యం నైపుణ్యాలను సవాలు చేసే చిత్రాలు. ఇవి మనస్సును కదిలిస్తాయి. ఇందులో కనిపించే భ్రమలు మెదడుకు పదును పెడతాయి. ఇటువంటి ఆప్టికల్ ఇల్యూషన్లు క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల మెదడుకు చురుకుదనం పెరుగుతుంది. అభిజ్ఞా సామర్థ్యం పెరుగుతుంది. ముసలయ్యే కొద్ది వచ్చే మతిమరుపు వంటివి రాకుండా ఉంటాయి.

 

ట్రెండింగ్ వార్తలు

ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఈ చిత్రంలో షాంపైన్ గ్లాసుల జత ఉంది .రెండు షాంపైన్ గ్లాసులు ఒక్కదానిని ఒకటి తాకుతూ ఉన్నాయి. అలా ఈ చిత్రంలో ఎన్నో జతల గ్లాసులు ఉన్నాయి. అన్ని గ్లాసుల్లో ఒక జత గ్లాసు మాత్రం కాస్త భిన్నంగా ఉంది. అవి ఎక్కడుందో కనిపెట్టడమే మీ ముందున్న సవాలు. ఎక్కువ సమయాన్ని ఇస్తే చిన్నపిల్లలు కూడా కనిపెట్టేస్తారు. చూడగానే ఐదు సెకండ్లలోనే కనిపెట్టాలి. అప్పుడే మీ మెదడు చురుగ్గా పనిచేస్తుందని అర్థం. అలాగే మీ కంటికి, మెదుడు సమన్వయం బాగుందని, మంచి సామర్ధ్యంతో అవి పని చేస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టండి. కేవలం 5 సెకండ్లలోనే ఈ సవాలకు జవాబును కనిపెట్టండి.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

భిన్నంగా ఉన్న షాంపైన్ గ్లాసులు జతను కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఐదు సెకండ్ల లోనే కనిపెట్టారంటే మీ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. దాని అభిజ్ఞ సామర్ధ్యం ఎక్కువేనని తెలుసుకోవాలి. అలాగే మీ కళ్ళు, మెదడు కలిసి చక్కగా పనిచేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి.మీరు ఆప్టికల్ ఇల్యూషన్లను త్వరగా సాల్వ్ చేయలేకపోతే రోజూ సాధన చేయాలి. ఆప్టికల్ ఇల్యూషన్లు సాధన చేయడం ద్వారా మెదడు పనితీరును పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ జవాబు కనిపెట్టకపోతే ఆ షాంపైన్ గ్లాసుల జత ఎక్కడుందో మేము చెప్పేస్తున్నాం. రెండో లైన్లో చివరి నుంచి రెండో గ్లాసుల జతను చూడండి. వాటి రంగు కాస్త భిన్నంగా ఉంది. అదే ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు.

 

శాస్త్రవేత్తలు ఆప్టికల్ ఇల్యూషన్ల పై ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చేశారు. అవి ఎలా పనిచేస్తాయని పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఇంకా వీటి సంగతి పూర్తిగా తేల్చలేకపోయారు. చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం మన కళ్ళు తీసుకునే సమాచారాన్ని మెదడుకు చేరవేస్తే… మెదడు ఆ సమాచారాన్ని అర్థం చేసుకుని జవాబును కనిపెడుతుంది. అయితే కొన్ని సార్లు ఆప్టికల్ ఇల్యూషన్ చూస్తున్నప్పుడు కళ్ళు ఏమి చేస్తుందో, అది మెదడు అర్థం చేసుకోలేకపోవచ్చు. మెదడు అర్థం చేసుకున్న దాన్ని కళ్ళు చూడలేకపోవచ్చు. ఆ రెండూ కలిసి పని చేస్తేనే ఇలాంటి సవాళ్లకు సొల్యూషన్ దొరుకుతుంది. ప్రపంచంలో ఎంతోమంది ఆప్టికల్ ఇల్యూషన్లను చిత్రీకరించే ఆర్టిస్టులు ఉన్నారు. వారు చాలా భిన్నంగా ఆప్టికల్ ఇల్యూషన్లను చిత్రీకరిస్తున్నారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.

WhatsApp channel
 

టాపిక్

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024