Hyderabad Formula E – race : హైదరాబాద్ లో జరగాల్సిన ఫార్ములా ఈ-రేసింగ్‌ రద్దు

Best Web Hosting Provider In India 2024

Hyderabad Formula E – Race :హైదరాబాద్‌ వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్‌ రద్దైంది. ఈ-రేస్ సీజన్-10 నాలుగో రౌండ్ ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా…. రద్దు చేస్తున్నట్లు ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటించింది. గత ప్రభుత్వం ఒప్పందం కుదిరినప్పటికీ…. ప్రస్తుత ప్రభుత్వం నుంచి స్పష్ణమైన నిర్ణయం రాకపోవడమే ఇందుకు కారణం అని పేర్కొంది.

 

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ ప్రభుత్వంతో తాము చేసుకున్న ఒప్పందాన్ని(అక్టోబరు 30, 2023) మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ(MAUD) రద్దు చేసిందని ఫార్ములా-ఇ ఆపరేషన్స్ (FEO) ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై స్పందిస్తూ… “ఒప్పంద ఉల్లంఘనలపై MAUDకి అధికారికంగా నోటీసు ఇచ్చే అంశాన్ని FEO పరిశీస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాకు వేరే మార్గం లేదు. ఈ రేసింగ్ వేదిక, నిర్వహణకు వర్తించే చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే దానిపై పరిశీలిస్తున్నాం. ఆ విషయంలో FEOకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి” అని ఫార్ములా-ఇ ఆపరేషన్స్ తమ ప్రకటనలో రాసుకొచ్చింది.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024