Krishna mukunda murari serial january 6th: ఊహించని మలుపు.. దేవ్ ఎత్తుగడకి బలైపోయిన కృష్ణ, చీదరించుకున్న భవానీ

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial january 6th: కృష్ణ ఉంటున్న అవుట్ హౌస్ లో ముకుందకి నలుగు పెట్టె కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అది చూసి శకుంతల కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఏంటి ఇది శుభమా అని నలుగు పెడుతుంటే ఏడుస్తావ్ పదిహేను రోజులు ముందే చెప్పాను కదా అంటుంది. నందిని ముందుగా ముకుందకి నలుగు పెట్టమని భవానీ చెప్తుంది. కానీ ముకుంద మాత్రమ అత్తయ్య మీరే పెట్టండి నాకు జీవితాన్ని ఇచ్చారని అంటుంది. ఏడాది లోపు పాప లేదా బాబుని ఇచ్చి రుణం తీర్చుకోమని చెప్తుంది. ఇక భవానీ ముకుందకి గంధం రాస్తుంది. తర్వాత కృష్ణని రాయమని చెప్తుంది. ఇదంతా దేవ్ ఇంటి మేడ మీద నుంచి చూస్తూ ఉంటాడు. అటు మురారికి రేవతి బాధగానే నలుగు పెడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

హత్య చేసిన వాడు దొరికాడన్న మురారి

కృష్ణ ముకుందకి నలుగు పెడుతుంటే భవానీ ఇంకా తనకి హోప్ ఉందా అని మనసులో అనుకుంటుంది. కృష్ణ బాధని దిగమింగుకుంటూ నలుగు పెడుతుంది. మురారికి ఫోన్ రాగానే హడావుడిగా భవానీ వాళ్ళ దగ్గరకి వెళతాడు. శ్రీధర్ ని చంపిన వ్యక్తి దొరికాడని చెప్తాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. శ్రీధర్ ని చంపిన వాళ్ళలో ఒకడు దొరికినట్టు ఇప్పుడే డిపార్ట్ మెంట్ నుంచి కాల్ వచ్చిందని వెంటనే వెళ్తానని చెప్తాడు. ఇప్పుడు ఎలా వెళ్తారని భవానీ అంటుంది.

ముకుంద కూడా నువ్వు వద్దు మా అన్నయ్య వెళ్తాడులే అంటుంది. కానీ మురారి మాత్రం లేదు ఇప్పటికే మా వల్ల దెబ్బలు తిన్నాడు నేనే వెళ్తానని చెప్తాడు. పట్టుకున్న వాడిని మన ఇంటికి తీసుకురమ్మని భవానీ చెప్తుంది. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత పొలిమేర దాటకూడదంటుంది. వెళ్ళి మంగళస్నానాలు చేయించమని చెప్తుంది. ఇంకా ఎందుకు ఇదంతా అంటే ఇంకా ప్రూఫ్ కాలేదు కదా అంటుంది.

భవానీని ఎదిరించిన కృష్ణ

ముకుంద వెంటనే దేవ్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఇప్పుడు పోలీసులు వస్తే ఏంటి పరిస్థితని అంటుంది. ఇప్పుడు ఏం చేయాలా అని దేవ్ ఆలోచనలో పడతాడు. ఇంటి దగ్గర అందరూ పోలీసులు పట్టుకున్న వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానిస్టేబుల్ ఎంతకీ రాకపోవడంతో తనే వెళ్తానని మురారి అంటాడు. కానీ భవానీ నీ డిపార్ట్ మెంట్ మీద నీకే నమ్మకం లేదా అని అడ్డుపడుతుంది. కానీ మురారి మాత్రం వెళ్ళాలి తప్పదని అంటాడు. భవానీ మాత్రం వాళ్ళని రానివ్వు వస్తారు కదా వాళ్ళకి ఎదురు వెళ్ళి ఏం చేయాలని అనుకుంటున్నావ్. ఒకవేళ కేసులో వాళ్ళే దోషులని తేలితే ఎక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అనుకుంటున్నావా అని అడుగుతుంది.

అంటే ఏసీపీ సర్ ని అనుమానిస్తున్నారా పెద్దత్తయ్య అని కృష్ణ కల్పించుకుంటుంది. నన్ను అవమానించండి, అనుమానించండి పడతాను. ఇలా అవమాన పడటం నాకు అలవాటు అయిపోయింది. కానీ ఏసీపీ సర్ ని పిరికివాడిలా చూడటం నాకు నచ్చలేదు. మీరు వద్దు అని ఆపేస్తుంటే నాకు ఒకటి అర్థం అవుతుంది. మా చిన్నాన్న నిర్దోషి అని తెలిస్తే మీ మాట చెల్లదని భయంతో ఏసీపీ సర్ ని ఆపుతున్నారని అంటుంది. భవానీ కోపంగా ఏయ్ అని అరుస్తుంది. ఏంటి నేను భయంతో ఇలా చేస్తున్నానా? చూశావా రేవతి నీ కోడలు కానీ కోడలు ఏం మాట్లాడుతుందో విన్నావా?

పెద్దపల్లి ప్రభాకర్ ని ఇరికించిన దేవ్

అప్పుడే కానిస్టేబుల్ ఇంటికి దొరికిన వ్యక్తిని పట్టుకుని వస్తాడు. చితక్కొట్టి అయినా నిజం చెప్పించమని కృష్ణ చెప్తుంది. చావు దెబ్బలు తినకముందే నిజం చెప్పమని మురారి అడుగుతాడు. తనకేమి తెలియదని అంటాడు. మురారి తన స్టైల్ లో అడిగేసరికి నిజం చెప్తానని అంటాడు. మా అన్న జైల్లో ఉంటాడు. మా అన్న నాతో మీ ఇంట్లో పెళ్లి ఆగిపోయేలా చేయమని చెప్పాడు. మా అన్నకి పెద్దపల్లి ప్రభాకర్ చెప్పాడంట అనేసరికి అందరూ షాక్ అవుతారు. ఇలా చెప్పమని ఎవరు చెప్పారు చెప్పమని రెట్టించి అడుగుతాడు. వీడు అబద్ధం చెప్తున్నాడని కృష్ణ అంటుంటే భవానీ గట్టిగా షటప్ అని అరుస్తుంది.

ఏయ్ ఏమన్నావ్ నేను భయంతో ఇలా చేస్తున్నానా? ఇప్పుడు ఏం అంటావని భవానీ నిలదీస్తుంది. మురారి బతికే ఉన్నాడని ముకుంద చెప్తే తనని ఒక్కరూ కూడా అభినందించలేదు. ముకుందని నేను సపోర్ట్ చేస్తుంటే నన్ను కూడా ఒక శత్రువుని చూసినట్టు చూశారు. కానీ నిన్ను మాత్రమే నేను జీవితంలో మర్చిపోను. నన్ను ఎదిరించి నేను చేయని దాన్ని చేశానని నలుగురిలో నన్ను నిలదీశావ్ దానికి నేను చాలా హర్ట్ అయ్యాను అంటుంది.

జైలుకి వెళ్ళి నిజం తెలుసుకుంటానన్న మురారి

జైలుకి వెళ్ళి అసలు విషయం కనుక్కోవాలని మురారి అంటాడు. కానీ భవానీ మాత్రం నిజం బయట పడితే ఇంకేంటి కనుక్కునేది అని ఆపుతుంది. ఒకసారి నిన్ను చంపాలని చూశారు. చనిపోయి బతికిన నిన్ను మళ్ళీ వాళ్ళ దగ్గరకి పంపే గుండె ధైర్యం నాకు లేదు. నిన్ను మళ్ళీ వాళ్ళు ఏదైనా చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదు. ఇప్పటితో ఈ పీడకల మర్చిపో అనేసి కృష్ణని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్తుంది.

దేవ్ పోలీస్ కానిస్టేబుల్ కి డబ్బులు ఇచ్చి పంపించేసి ఏమి తెలియని వాడిలా మురారి దగ్గరకి వస్తాడు. పెద్దపల్లి ప్రభాకర్ అలాంటి వాడు కాదు నాకు పెళ్లి టెన్షన్ లేకపోతే నేనే రంగంలోకి దిగేవాడినని మురారి అంటాడు. నేను చూసుకుంటాను చివరి ప్రయత్నంగా మురారిని కన్వీన్స్ చేయడానికి చూస్తానని చెప్తాడు.

తరువాయి భాగంలో..

భవానీ పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుతుంటే దేవ్ వచ్చి మీరు చేస్తుంది తప్పని అంటాడు. పెద్దపల్లి ప్రభాకర్ ని రిలీజ్ చేయిస్తానని నేను నీకు మాట ఇస్తున్నా అని కృష్ణ చేతిలో దేవ్ చెయ్యి వేసి చెప్తాడు. అప్పుడే కృష్ణ దేవ్ చేతికి ఉన్న ఉంగరం స్పష్టంగా చూస్తుంది. వెంటనే దేవ్ చెయ్యి విసిరేసి యూ ఛీటర్ అని కాలర్ పట్టుకుంటుంది. ఏసీపీ సర్ శ్రీధర్ ని చంపింది వీడే అనేసరికి అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024