Best Web Hosting Provider In India 2024
Guntur Kaaram Trailer: గుంటూరు కారం ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. కేవలం పన్నెండు గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో గుంటూరు కారం ట్రైలర్ నంబర్ వన్ లిస్ట్‌లో నిలిచింది. టాలీవుడ్‌లో అతి తక్కువ టైమ్‌లో హయ్యెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్‌గా గుంటూరు కారం రికార్డ్ క్రియేట్ చేసింది. గుంటూరు కారం ట్రైలర్‌కు 24 గంటల్లో నలభై మిలియన్ల కుపైగా వ్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
మహేష్ కెరీర్‌లో హయ్యెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్‌గా గుంటూరు కారం రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు.రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ మహేష్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో మహేష్ డైలాగ్స్, అతడి క్యారెక్టరైజేషన్, ఆటిట్యూడ్, లుక్ అలరిస్తున్నాయి. కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌లో మహేష్ కనిపించాడు.
టాప్ సెవన్ లో గుంటూరు కారం
అతి తక్కువ టైమ్‌లో వంద కే లైక్స్ దక్కించుకున్న తెలుగు ట్రైలర్స్‌లో ఒకటిగా గుంటూరు కారం నిలిచింది. గుంటూరు కారం ట్రైలర్‌కు పదిహేను నిమిషాల్లోనే హండ్రెడ్ కే లైక్స్ వచ్చాయి. ఈ జాబితాలో మూడు నిమిషాలతో సలార్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ (నాలుగు నిమిషాలు), వకీల్ సాబ్ (ఏడు నిమిషాలు) సెకండ్, థర్డ్ ప్లేస్‌లలో నిలిచాయి.
అతడు ఖలేజా తర్వాత…
గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అతడు, ఖలేజా తర్వాత దాదాపు పదమూడేళ్ల అనంతరం మహేష్‌బాబు, త్రివిక్రమ్ కలిసి చేస్తోన్న మూవీ ఇది. యద్దనపూడి సులోచనరాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా మహేష్ బాబు గుంటూరు కారం మూవీని తెరకెక్కించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ పుకార్లపై గుంటూరు కారం టీమ్ రియాక్ట్ కాలేదు. ఈ పుకార్లపై ప్రమోషన్స్‌లో ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్…
గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్‌తో పాటు రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని యూనిట్ భావించారు. కానీ పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రతా పరమైన కారణాల వల్ల పోలీసులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతిని నిరాకరించారు.
దాంతో ఈ ఈవెంట్‌ను తెలంగాణ నుంచి ఆంధ్రాకు షిఫ్ట్ చేసినట్లు సమాచారం. జనవరి 9న గుంటూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు తెలిసింది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ గుంటూరు కారం మూవీని నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గుంటూరు కారం తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళితో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నాడు మహేష్ బాబు.