Animal Movie: బాలీవుడ్ రచయిత ‘డేంజరస్’ కామెంట్‍కు యానిమల్ టీమ్ స్ట్రాంగ్ రిప్లే

Best Web Hosting Provider In India 2024

Animal Movie: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ ప్రధాన పాత్ర పోషించిన యానిమల్ సినిమా బ్లాక్‍బాస్టర్ అయింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్‍గా నిలిచింది. అయితే, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్‍లపై మాత్రం విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్.. యానిమల్ చిత్రంపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు

యానిమల్ సినిమాలో ఓ సన్నివేశంలో తన బూట్లు నాకాలని జోయా (తృప్తి డిమ్రి)తో రణ్‍విజయ్ (రణ్‍బీర్ సింగ్) చెబుతాడు. ఈ సన్నివేశంపైనే జావేద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి సన్నివేశం ఉన్న మూవీ సూపర్ డూపర్ హిట్ అయిందని, ఇది చాలా డేంజరస్ అని అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై జావేద్ అన్నారు. దీనికి యానిమల్ టీమ్ నేడు (జనవరి 7) స్పందించింది.

ఒక మహిళ.. ఒక పురుషుడితో షూ నాకాలని అని అంటే దాన్ని మీరు సమర్థించే వారని, ప్రేమకు జెండర్ పాలిటిక్స్ నుంచి విముక్తినివ్వాలని యానిమల్ టీమ్ ట్వీట్ చేసింది. “మీ లాంటి పెద్ద రచయిత కూడా ఓ లవర్ మోసాన్ని (జోయా, రణ్‍విజయ్ మధ్య) అర్థం చేసుకోలేకపోతే.. మీ కళారూపాలన్నీ (రచనలు) అబద్ధాలే. ఒక మహిళ.. ప్రేమ పేరుతో మోసం చేసిన ఓ పురుషుడిని షూ నాకాలని అనొచ్చు. అప్పుడు మీరు దాన్ని స్త్రీవాదం (ఫెమినిజం) అంటూ కీర్తిస్తారు. జెండర్ పాలిటిక్స్ నుంచి ప్రేమకు విముక్తిని ఇవ్వండి. లవర్ మోసం చేసి అబద్ధం చెప్పింది. దీంతో మరో లవర్ షూ నాకాలని అన్నాడు” అని యానిమల్ టీమ్ ట్వీట్ చేసింది. జావేద్ అక్తర్‌ను ట్యాగ్ చేసింది.

 

ప్రేమ విషయంలో పురుషుడు, స్త్రీ అనే భేదాలు చూడొద్దంటూ యానిమల్ టీమ్ పేర్కొంది. ఆ డైలాగ్‍పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న అందరికీ ఈ ట్వీట్‍తో బదులివ్వాలని భావించినట్టుంది.

జావేద్ ఏమన్నారంటే..

“సమాజం నుంచి ప్రశంసలు వచ్చేలా ఎలాంటి క్యారెక్టర్లు క్రియేట్ చేయాలనే విషయంలో ప్రస్తుతం యువ ఫిల్మ్ మేకర్లకు టెస్టింగ్ టైమ్ నడుస్తోంది. ఉదాహరణకు, ఒక సినిమాలో మహిళను పురుషుడు తన షూ నాకాలని అడిగాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే, ఇది చాలా ప్రమాదకరం” అని అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో జావేద్ అక్తర్ అన్నారు. ఒకవేళ ఆ మహిళను ఆ వ్యక్తి చెంపదెబ్బ కొట్టినా సరిపోయేది కదా అని అన్నారు. యానిమల్ చిత్రాన్ని ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు.

యానిమల్ సినిమాలో రణ్‍బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించారు. తృప్తి డిమ్రి కీలకపాత్ర చేశారు. బాబీ డియోల్, అనిల్ కపూర్, సురేశ్ ఒబెరాయ్, ప్రేమ్ చోప్రా కూడా కీరోల్స్ చేశారు. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలోని ఓవర్ డోస్ వైలెన్స్, బోల్డ్ సీన్లపై ఆరంభం నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే, గత డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ చిత్రం సుమారు రూ.890కోట్ల కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ అయింది.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024